Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
Ganesh Chaturthi 2023: వినాయకుని అనుగ్రహం పొందాలంటే మీ రాశిని బట్టి జపించాల్సిన మంత్రాలు!!
Ganesh Chaturthi 2023: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండులలో వినాయక చవితి పండుగ ప్రముఖమైనది. దూ పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలో శుక్ల పక్షం నాలుగో రోజు అంటే చవితి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఈరోజున గణేశుడు జన్మించాడని.. అందుకే ఈరోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారని చాలా మంది నమ్ముతారు.
ఈ సంవత్సరం 2020 ఆగస్టు 22వ తేదీన వినాయక చతుర్థి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున వినాయక మిత్ర మండలి సభ్యులు, ఇతర భక్తులు మండపాలలో, వారి వారి ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు.

మండపాలలో ప్రతిష్టించే విగ్రహాల వద్ద నవరాత్రుల ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రకరకాల పూలు, పండ్లను ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
వినాయకుడి శోభయాత్ర వరకు ప్రతిరోజూ మూడుసార్లు పూజ చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఇలా కేవలం ఇళ్లల్లోనే కాదు అందరూ కలిసి దేవాలయాల దగ్గర, వివిధ ప్రముఖ ప్రదేశాల్లో వినాయక మండపాలను వివిధ చోట్ల ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ రాశిని బట్టి ఏ మంత్రాన్ని జపిస్తే, మీరు వినాయకుడి నుండి ఆశీర్వాదం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం....
మేష రాశి..
మేషరాశి వారు గణేశుడిని "ఓం విఘ్నేషాయ నమః"అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి.
వృషభ రాశి..
వృషభరాశి వారు "ఓం గజ వక్ర నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ వినాయకుడిని పూజించాలి.
మిధున రాశి..
మిధున రాశి వారు "ఓం కీర్తి నమః"అనే మంత్రాన్ని పఠిస్తూ వినాయకుడిని పూజించాలి.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారు "ఓం దుర్గా నమః"అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి.
సింహ రాశి..
సింహరాశివారు "ఓం నమస్తేతు నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ గణేశుడిని పూజించాలి.
కన్య రాశి..
కన్య రాశి వారు "ఓం విఘ్నేషాయ నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి.
తుల రాశి..
తుల రాశి వారు "ఓం గజ కర్ణ నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ వినాయకుడిని పూజించాలి.
వృశ్చికరాశి..
వృశ్చికరాశి వారు "ఓం యశస్కర్ నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ గణేశునికి నమస్కరించాలి.
ధనస్సు రాశి..
ధనుస్సు రాశి వారు బాల వినాయకుడిని "ఓం యషస్కర్ నమః"అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించడం చాలా మంచిది.
మకర రాశి..
మకరరాశి వారు "యంజకాయ నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ గణేశునికి నమస్కరించాలి.
కుంభ రాశి..
కుంభ రాశివారు "ఓం విశ్వరాజ నమః" అనే మంత్రాన్ని పఠించడం మరియు గణేశుడిని పూజించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.
మీన రాశి..
మీనరాశి వారు "ఓం శశి వర్ణం నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ వినాయకుడికి నమస్కరించడం చాలా మంచిది.



Click it and Unblock the Notifications
