Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
భారీ శుభవార్త..కైలాస మానస సరోవర యాత్రకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం,ఎలా అప్లయ్ చేసుకోవాలో చూడండి
జీవితంలో ఒక్కసారి అయినా కైలాస మానస సరోవర యాత్ర చేయాలని చాలామంది హిందువుల కోరిక. ఒక్క హిందువులకే కాదు..బౌద్దులు, జైనులుకు కూడా ఇది అత్యంత పవిత్రమైన యాత్ర. కైలాస పర్వతం శివుడి నివాసంగా మన పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇప్పటికీ శివుడు నివసిస్తూ, ధ్యానం చేస్తుంటాడని నమ్ముతారు. ఈ పర్వతం దగ్గర బృహ్మ సృష్టించిన మానస సరోవరం అనే సరస్సులో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని హిందువుల విశ్వాసం. దేవతలందరూ ఈ సరస్సులోనే స్నానం చేస్తారని నమ్ముతారు. అయితే ఈ కైలాస పర్వతం టిబెట్ దేశంలో ఉంది..టిబెట్ చైనా ఆధీనంలో ఉన్నందున ఈ యాత్రకు వెళ్లాలనుకుంటే చైనా అనుమతి అవసరం.
గత 5 ఏళ్లుగా మానస సరోవర యాత్ర నిలిపివేయబడిన విషయం తెలిసిందే. కరోనా,చైనా భారత్ మధ్య ఉద్రిక్తతల కారణంగా 5 ఏళ్లుగా నిలిచిపోయిన మానస సరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ 30 నుంచి తిరిగి ప్రారంభం కానుందని భారత విదేశాంగ శాఖ శనివారం ప్రకటించింది. జూన్-ఆగస్టు మధ్యలో నిర్వహించే ఈ యాత్రకు వెళ్లాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. యాత్ర కోసం అప్లయ్ చేసుకోడానికి చివరి తేదీ మే 13,2025.

ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి
Step 1: ముందుగా కైలాస మానస సరోవర్ యాత్ర అధికారిక వెబ్ సైట్ kmy.gov.in ఓపెన్ చెయ్యండి.
Step 2: ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ ని ఖచ్చితమైన వివరాలతో నింపాలి. మీ పేరు, పుట్టిన తేదీ, పాస్ పోర్ట్ లో ఉన్న ఇతర వివరాలతో కరెక్ట్ గా నమోదు చేయాలి.
Step 4: తర్వాత అక్కడ అడినట్లుగా అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. ఏయే డాక్యుమెంట్లు కావాలంటే..1.లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజు ఫొటో యొక్క స్కాన్ చేసిన కాపీ(JPG ఫార్మాట్ లో ఉండాలి, 300KB మించకూడదు). 2. భారతీయ పాస్ పోర్ట్ స్కాన్ చేసిన కాపీ(ఫొటో,వ్యక్తిగత వివరాలు ఉన్న పేజీ, చివరి పేజీ PDF ఫార్మాట్ లో 500KB మించకూడదు). 3. మెడికల్ ఫిట్ నెస్ సర్టిపికెట్ ను సమర్పించాలి.
Step 5: ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి. వెబ్‌సైట్‌లో ఫీజు వివరాలు అందుబాటులో ఉంటాయి.
Step 6: ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. వెబ్ సైట్ లో ఫీజు వివరాలు అందుబాటులో ఉంటాయి.
Step 7: తర్వాత submit అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు మెసేజ్,ఈమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం మీరు సమర్పించిన అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
అర్హతలు
-దరఖాస్తు చేసుకునే వ్యక్తి 2025 జనవరి 1 నాటికి 18-70 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి
-చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ ఉండాలి. మీ పాస్ పోర్ట్ వ్యాలిడిటీ సెప్టెంబర్ 1,2025 నాటికి కనీసం 6 నెలలు ఉండాలి.
-అధిక ఎత్తులో ప్రయాణించడానికి శారీరకంగా,వైద్య పరంగా ధృఢంగా ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్(BMI)25 దాటకూడదు.
ఇలా వెళ్తారు
ఈ ఏడాది ఒక్కొక్కటి 50మంది భక్తులతో కూడిన 5 గ్రూపులు ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ ద్వారా కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తారు..ఒక్కొక్కటి 50మంది ప్రయాణికులతో కూడా 10 గ్రూపులు సిక్కింలోని నాథులా పాస్ గుండా కైలాస మాన సరోవరానికి చేరుకుంటారు.



Click it and Unblock the Notifications