Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
Hanuman Jayanti 2025: ఈ మంత్రం 11సార్లు జపిస్తే ఏడాదంతా మీపై ఆంజనేయస్వామి అనుగ్రం
దేశవ్యాప్తంగా ఇవాళ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆంజనేయస్వామి ఆలయాలకు పోటెత్తారు. ఈ పవిత్రమైన రోజున హనుమంతుడిని నిజమైన హృదయంతో పూజించేవారి జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని పండితులు తెలిపారు. హిందూమతంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన హనుమాన్ జయంతి నాడు ఆంజనేయస్వామిని ఏ విధంగా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి,పూజా విధానం, శుభసమయం వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
శుభ సమయం
ఆంజనేయస్వామి పూజకు పవిత్రమైన సమయం ఏప్రిల్ 12న అంటే శనివారం ఉదయం 4:30 నుంచి 5: 59 వరకు ఉంటుంది. సాయంత్రం పూట 6: 45 నుండి రాత్రి 8: 09 వరకు ఉంటుంది.

హనుమాన్ జయంతి పూజ సమాగ్రి
హనుమాన్ విగ్రహం, తేనె, గంధపు చెక్క, పువ్వులు, దీపం, కర్పూరం, ధూపం కర్రలు, ధూపం, సింధూరం, చరణ్ పాదుక, పూలమాల, పండ్లు, స్వీట్లు, ఎర్రటి వస్త్రం, గంగా జలం, పాలు, నెయ్యి, తమలపాకు, తమలపాకు, ఎరుపు రంగు వస్త్రం మొదలైనవి.
పూజా విధానం
ముందుగా ఆంజనేయ స్వామి ఫొటోని లేదా విగ్రహాన్ని గంగా జలం, తేనె,గంధం,పాలు,పెరుగుతో స్నానం చేయించండి. తర్వాత ఎర్రటి వస్త్రం ధరించండి, తర్వాత దేవుడి ఫొటోని పీఠపై ఉంచి దేవుడి ముందు దీపం వెలిగించాలి, తర్వాత హనుమాన్ చాలీసా, మంత్రాలు, మనుమంతుడి వివిధ పేర్లను జపించండి. దేవుడి నుదిటిపై సింధూరం ఉంచి,పూలమాలతో అలంకరించాలి. తర్వాత స్వామికి ఇష్టైన ఆహారపదార్థాలు నైవేధ్యంగా ససమర్పించాలి. ఇవాళ రామచరితమానస్ పఠించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇవాళ రాముడు సీతను పూజించడం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు.
చదవాల్సిన మంత్రాలు
ఓం హం హనుమతే నమః : ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా ఆంజనేయస్వామి అనుగ్రహంతో శుభ ఫలితాలు పొందవచ్చు. కనీసం 21సార్లు ఈ మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజిస్తే మారుతి విశేషమైన అనుగ్రహం మీకు లభిస్తుందని పండితులు తెలిపారు.
ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్: ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇది శని అనుగ్రహం పొందటానికి కూడా సహాయపడుతుంది.
మర్కటేశ మహోత్సాహా సర్వ శోక వినాశన శత్రు సంహార మాం రక్ష శ్రియం దాపమయే ప్రభో : ఈ ధ్యాన శ్లోకాన్ని 11 సార్లు చదివినా హనుమంతుని అనుగ్రహం సంవత్సరం మెత్తం మీపై ఉంటుంది.
ఓం నమో హనుమాన్ రుద్రావతారాయ సర్వ శత్రు సంహరణాయ సర్వరోగ హరాయ సర్వవశికరణాయ రామదూతాయ స్వాహా!
ఓం నమో హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహా
ఈ మంత్రాలతో పాటు, హనుమాన్ చాలీసా, సుందరకాండం పారాయణం చేయడం కూడా చాలా మంచిది.



Click it and Unblock the Notifications
