For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందూ కాలెండర్ ప్రకారం ఈ 2018 ఏప్రిల్ మాసంలో పవిత్రమైన రోజులు ఇవే

|

ఉపవాసాలు, పండుగలు హిందువులకు ఎంతో ముఖ్యమైనవి. ప్రతి నెలా, హిందువుల కాలెండర్ ప్రకారం సాంప్రదాయాలను పాటించే హిందువులకు కొన్ని పవిత్రమైన, శుభప్రదమైన రోజులు ఉండడం సహజం. ఈరోజులను అత్యంత ప్రాముఖ్యమైనవిగా భావించి ఆయా రోజులననుసరించి దైవకార్యాలు చేస్తుంటారు. హిందువుల కాలెండర్ ప్రకారం, ఈ కింది రోజులు ఏప్రిల్ మాసంలో హిందువులకు ముఖ్యమైన రోజులు.

ఏప్రిల్ 3 : సంకష్ట చతుర్ధి
ఈరోజును సంకష్ట హర చతుర్ధి అని కూడా పిలుస్తారు, ఈరోజు వినాయకునికి ప్రీతిపాత్రమైన రోజుగా చెప్పబడింది. ఈరోజు గణేశునికి పూజలు చేసి రోజంతా ఉపవాసం చేసి, సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత, పేదవానికి కానీ, బ్రాహ్మణుడికి కానీ భోజనం పెట్టిన తర్వాతనే ఉపవాస దీక్ష ముగిస్తారు. మరియు ఈ నెలలో 3వ తేదీన వచ్చిన సంకష్ట చతుర్ధి మంగళవారం రావడం వలన అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది.

Auspicious Days, As Per Hindu Calendar In April 2018

ఏప్రిల్ 7 : కాలాష్టమి
కాలాష్టమి కాలభైరవునికి ప్రీతిపాత్రమైనది. కాలభైరవుడు శివుని మరొక అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. కాలభైరవుడు రాక్షస రాజు మహాబలిని అంతమొందించుటకై శివుడు ఎత్తిన అవతారంగా చెప్పబడుతున్నది. కృష్ణపక్షం 8 వ రోజున ఏప్రిల్ కానీ మే నెలలో కానీ ఈ కాలష్టమి వస్తుంది. ఈ ఏప్రిల్ నెలలో 7 వ తేదీన ఈ కాలష్టమి వస్తుంది. ఎక్కువగా కాలభైరవుని రాత్రివేళల యందే పూజిస్తుంటారు. మరియు రాత్రి జాగరణ ద్వారా దేవుని కృపకు పాత్రులవగలరని భక్తుల ప్రఘాడవిశ్వాసం.

ఏప్రిల్ 12 వరూధిని ఏకాదశి
కృష్ణపక్షం 11 వ రోజున వైశాఖ మాసంలో ఏప్రిల్ లేదా మే నెలలో విష్ణుమూర్తి అవతారమయిన వామనుడి గౌరవార్ధం ఈరోజుని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 12 వ తేదీన వస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా పాపాలన్నీ తొలగిపోయి దేవుని కృపకు పాత్రులవగలరని విశ్వసిస్తుంటారు. ఈరోజు రాత్రి జాగరణ చేయడం ద్వారా ఎక్కువ దైవానుగ్రహాన్ని పొందగలరని భక్తుల నమ్మకం.

ఏప్రిల్ 16 సోమావతి అమావాస్య.
సోమవారం నాడు అమావాస్య వచ్చిన పక్షంలో ఆరోజును సోమావతి అమావాస్యగా చెప్పబడుతుంది. ఈ నెల 16 వ తేదీన సోమావతి అమావాస్య వస్తుంది. ఈరోజు నదిలో స్నానం చేయడం ఎంతో ముఖ్యమైనది. పెళ్ళైన ఆడవారు ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా భర్తలకు ఆయురారోగ్యాలు సిద్దిస్తాయని , మరియు పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. ఈరోజు దానధర్మాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుంటారు.

ఈరోజు సూర్యదేవుని పూజించడం ద్వారా పేదరికం తొలగిపోతుందని కూడా నమ్ముతారు. ఈరోజు ఎక్కువగా మౌనవ్రతానికి ముఖ్యంగా సూచించబడినది. ఈరోజు రావిచెట్టుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. దీనిని రావిచెట్టు ప్రదక్షిణ వ్రతంగా గుర్తిస్తారు కూడా.

ఏప్రిల్ 18 అక్షయ తృతీయ, పరశురామ జయంతి
ఈరోజు హిందువులకు మరియు జైనులకు ఇద్దరికీ ముఖ్యమైన రోజుగా చెప్పబడింది. వినాయకుడు, వేదవ్యాసుడు మహాభారతం రాయడo ఈరోజు నుండే ప్రారంభించాడు. మరియు ఈరోజు పరశురాముని జన్మదినం కూడా. జైనుల ప్రకారం , జైన తీర్ధంకరుడైన రిషభ దేవుడు 3 నెలల కఠోర ఉపవాసాన్ని ఈరోజున ముగించాడు. తద్వారా ఈరోజు జైనులకు ముఖ్యమైన రోజుగా ఉన్నది.

ఏప్రిల్ 22 : గంగా సప్తమి
స్కంధ పురాణం మరియు వాల్మీకి రామాయణంలో గంగా జయంతిని గురించి చెప్పబడినది. ఈరోజు గంగాదేవి పుట్టిన రోజు. ఈరోజు గంగా ఘాట్ నకు పూజ చేసి, గంగానదిలో స్నానం చేయడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. తద్వారా పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వైశాఖ శుక్ల పక్షo లో 7 వ రోజున గంగా సప్తమి జరుపుకుంటారు. ఈ నెల 22 న గంగాసప్తమి వస్తుంది.

ఏప్రిల్ 24 : సీతా నవమి
భద్రాచలం, బీహార్ లో సీతా సమాహిత్ స్థల్ , తమిళనాడులోని రామేశ్వరంలో అత్యంత విశిష్టమైన రోజుగా ఈరోజుని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం శుక్ల పక్షం 9 వ రోజున సీతా నవమి జరుపబడుతుంది. ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా తమ భర్తలకు ఆయురారోగ్యాలను చేకూర్చవచ్చని భక్తుల విశ్వాసం. కథ ప్రకారం ఈరోజు జనక మహారాజు సీతాదేవిని నాగేటి చాలులో కనుగొని , దత్తత తీసుకుని జానకి గా నామకరణం చేయడం జరిగినది. తద్వారా ఈరోజుని జానకి జయంతిగా కూడా వ్యవహరిస్తారు.

ఏప్రిల్ 26 : మొహిని ఏకాదశి
సూర్య పురాణంలో ఈరోజు యొక్క విశిష్టత చెప్పబడినది. ఈ సూర్య పురాణాన్ని కృష్ణుడు యుధిష్ఠురునికి (ధర్మరాజు) వివరించినాడు. మరియు వశిష్టుడు శ్రీరామునికి ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా , సీతా వియోగ దోషము తొలగించుకోవచ్చని సూచించిన రోజుగా చెప్పబడినది.

నిజానికి ఈరోజు విష్ణు మూర్తి అవతారమైన మోహినీ దేవికి సంబంధించినది. దేవాసురులు మరణం దరిచేరనీయని అమృతభాండo కోసం కొట్టుకుంటున్న సమయంలో మోహినీ రూపం లో అమృతం దేవతలకు చేరేలా చేశాడు మహావిష్ణువు.

ఏప్రిల్ 28 : నరసింహ జయంతి
ఈరోజు మహావిష్ణువు అవతారం అయిన నరసింహునికై జరిపేది. ఈ అవతారం ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుని సంహరించుటకు విష్ణువు ఎత్తిన అవతారం. వైశాఖ మాసం 14 వ రోజున ఈ నరసింహ జయంతిని జరుపుకుంటారు. ఈ నెలలో ఇది ఏప్రిల్ 28 న వచ్చింది. ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా దేవుని కృపకు పాత్రులవగలరని భక్తుల విశ్వాసం.

English summary

Auspicious Days, As Per Hindu Calendar In April 2018

Fasts and festivals play a great role to the Hindus. Every month, in the Hindu calendar, there are certain auspicious days that are considered to be quite important to the people following it. And no doubt, the Hindu devotees observe these days with a high religious fervor.
Story first published: Saturday, April 7, 2018, 6:52 [IST]
Desktop Bottom Promotion