Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తలుపులు లేని శక్తివంతమైన ఏకైక ఆలయం.. క్షణాల్లో కోరిన కోరికలు తీరిపోతాయి.. శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ పూజలు చేస్
మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా.. కొన్ని ఆలయాలకు మాత్రం ప్రత్యేకత ఉంటుంది. స్వయంభూగా వెలవడం, ఆలయాలకు తలుపులు లేకపోవడం వంటి ప్రత్యేకతలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏపీలోనూ ఓ ఆలయం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు ఆ ఆలయంలోని అమ్మవారిని కొలుస్తూ ఉంటారు.
అదే సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లి దేవాలయం. నాలుగు రాష్ట్రాల ప్రజలు కొలుచుకునే ఈ తల్లి ఆలయానికి తలుపులు ఉండవు. కోట్లాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయానికి తలుపులు ఎందుకు ఉండవు, ఈ ఆలయ విశిష్టతలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆలయ చరిత్ర ఏంటంటే..
ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. కాళంగి నది ఒడ్డున ఈ ఆలయం, సుమారు 500 ఏళ్ల క్రితం.. కొంతమంది పశువుల కాపరులు కాళంగి నది ఒడ్డున పశువులు మేపుతుండగా.. నదిలో ఓ సుడిగుండంలో ఓ బాలుడు చిక్కుకున్నాడట. ఆ బాలుడికి ఓ రాయి తగలడంతో ఆ రాయిని పట్టుకొని ఆ బాలుడు ఒడ్డుకు చేరుకున్నాడు. అనంతరం తనను ఒడ్డుకు తెచ్చిన ఆ రాయిని చూడగా అది చెంగాళమ్మ పరమేశ్వరి దేవి విగ్రహం కనిపించింది.
దీంతో ఆ బాలుడు ఊర్లో ప్రజలకు సమాచారం అందించగా.. వారు వచ్చి ఆ విగ్రహాన్ని కదిపేందుకు ప్రయత్నించారు. ఎంత కదిపినా కదలకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయిన గ్రామస్థులకు.. రాత్రి కలలోకి వచ్చి తనను కాడకూడదని చెప్పడంతో అక్కడే గుడి కట్టి పూజలు చేయడం ప్రారంభించారు.
ఈ ఆలయానికి తలుపులు ఎందుకు ఉండవంటే..
ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. ఈ ఆలయంలోని చెంగాళమ్మ దేవి 24 గంటలు దర్శన భాగ్యం కలిగిస్తారు. అమ్మవారికి గుడి కట్టిన తరువాత తలుపులు చూపిద్దామని చెక్కలు చెక్కిస్తుండగా.. అమ్మవారు పూజారి కలలోకి వచ్చి, తన ఆలయానికి తలుపులు వద్దొని చెప్పిందంట. దీంతో ఆ చెక్కలను పక్కకు పెట్టగా.. వాటికి మొలకలు వచ్చి, మహా వృక్షంగా మారింది. ఆ వృక్షం కింద అమ్మవారు 24 గంటలకు అలసట లేకుండా భక్తులకు దర్శనం ఇస్తూనే ఉంటారు.
చెంగాళమ్మ తల్లి దేవాలయం ప్రాముఖ్యత
చెంగాళమ్మ దేవి ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చెంగాళమ్మ తల్లికి కూడా చాలా మహిమలు ఉంటాయని భక్తులు నమ్ముతుంటారు. ఇండియన్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజషన్(ఇస్రో) ఏదైనా ఉపగ్రహాలు ప్రయోగించేటప్పుడు లేదా ఏదైనా ప్రయోగం చేసే సమయంలో ముందుగా ఉపగ్రహాల నమూనాను చెంగాళమ్మ తల్లి వద్ద పెట్టి పూజించి, ఆ తరువాత ప్రయోగం చేస్తారు.
అంతటి మహిమలు ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుందని నమ్ముతుంటారు. అమ్మవారికి పూజలు చేసి మనసుతో కోరికలు కోరుకుంటే తప్పకుండా అమ్మవారు అనుగ్రహం చూపుతుందని, అలాంటివే ఇక్కడ చాలా జరిగాయని చెబుతూ ఉంటారు.



Click it and Unblock the Notifications