Latest Updates
-
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు..
విష్ణు చక్రంతో శివుడి భార్య శవాన్ని ముక్కలు చేసిన విష్ణువు..! అష్టాదశ శక్తిపీఠాల రహస్యం..!
దేశంలో శక్తి పీఠాలు వున్న విషయం మనకు తెలిసిందే. ఆ శక్తి పీఠాలు ఎలా వెలిసాయ్. పార్వతీ దేవి ఒక్కో భాగం ఎందుకు దేవాలంగా మారింది. కామాఖ్య దేవి దేవాలయ రహస్యమేంటి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను మేము మీకు ఇవ్వబోతున్నాం.
అస్సాంలో అమ్మవారి యోని భాగం, అదే కామాఖ్య దేవాలయం
శివుడు తన భార్య మృతదేహాన్ని భుజం పైన వేసుకొని లోకం మొత్తం తిరుగుంటాడు. ఇది చూసిన విష్ణువు. శివుడలా తిరిగితే లోకం ఎలా నడుస్తుందని అనుకొని శివుడి భార్య మృతదేహాన్ని విష్ణు చక్రంతో ముక్కలు చేస్తాడు. ఆ ముక్కలు భూమిపై పడతాయ్ అలా భూమిపై పడిన ముక్కలు అష్టా దశ శక్తిపీఠాలుగా మారుతాయ్.
శివుడి భార్య సతీదేవి యోని భాగం అస్సాంలోని నేలాచల పర్వతం పై పడుతుంది. అక్కడ ఇప్పటికీ సతీదేవి యోనిని పూజిస్తారు. అన్ని శక్తి పీఠాల్లో కామాఖ్య దేవాలయం అత్యంత శక్తివంతమైంది. ఈ దేవాలయం అస్సాంలోని నేలాచల పర్వతం బ్రహ్మపుత్ర నది ఒడ్డున వుంది.

ఇక్కడ వెలసిన దేవి కామారూపినిగా పిలుస్తారు. శాస్త్రం ప్రకారం కామం అంటే అనుకున్న రూపాన్ని దాల్చుకోవడమని అర్ధం. కామాఖ్య అమ్మవారు మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అమాయకులను హింసించే వారిని అంతం చేసే త్రిపుర భైరవిగా రూపం దాల్చుతుంది. అనంద రూపంలో పరమేశ్వరిగా, త్రిపుర సుందరిగా కనిపిస్తుంది. ఇలా మూడు రూపాలను ధరించి భక్తులకు చేరువై వారి కోరికలను తీరుస్తుంది.
కామాఖ్య దేవి ఆలయంలో త్రిపుర శక్తిదాయనిగా కూడా కొలుస్తారు. ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమన్నట్లు భావిస్తుంటారు. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి పూజలు చేయరు. ఇక్కడ సతీదేవి యోని పూజింపబడుతుంది.
సతీదేవి తండ్రి దక్షప్రజాపతి యఘ్నం చేస్తారు. ఆ యఘ్నానికి కూతురిని అల్లుడు శివుడిని పిలవరు. పుట్టింటిపైనున్న మమకారంతో సతీదేవి ఆ యఘ్నానికి వెళ్తుంది. అప్పుడు ప్రజాపతి, పిలవని పేరంటానికి ఎలా వస్తారని అవమానిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక అగ్నిలో దూకి తన ప్రాణాన్ని వదులుకుంటుంది.
దీంతో శివుడికి కోపం వచ్చి వీరభద్రుడిని సృష్టించి యగ్నాన్ని భగ్నం చేయమని పంపుతాడు. ముళ్లోకాలు భయపడేలా శివతాండవం చేస్తాడు. దీన్ని చూసి దేవతలు కూడా భయపడతారు. భార్య శవాన్ని మోసుకుంటూ సామాన్య మానవుడిలా మారుతాడు. లోకాన్ని కూడా పట్టించుకోకుండా వుంటాడు. ఒక బైరాగిలా తిరుగుతూనే వుంటాడు. పరమేశ్వరుడు అలా వుంటే సృష్టికి చాలా నష్టం జరుగుతుందని అనుకుంటాడు. సతీదేవి మృతదేహాన్ని తన విష్ణు చక్రంతో ముక్కలు ముక్కలు కత్తిరస్తాడు.
సతీదేవి ముక్కలు భూమిపైనున్న వివిధ ప్రాంతాల్లో పడతాయ్. అలా పడ్డ ప్రాంతాలే అష్టా దశ శక్తిపీఠాలుగా మారుతాయ్. సతీ దేవి యోని భాగం అస్సంలోని గౌహతిలో నేలాచలం పర్వతం వద్ద పడ్డంతో కామాఖ్య అమ్మవారిగా పూజించడం ప్రారంభించారు. ఆ దేవాలంలో యోని రాతితో నిర్మించబడి వుంటుంది. అందులోనే కామాఖ్య అమ్మవారు వెలసివున్నారని భక్తుల అపార నమ్మకం.
కామాఖ్య అమ్మవారికి నెలలో మూడు సార్లు రుతుస్రావం జరుగుతుంది. అమ్మవారి రాతి యోనిలోంచి ఎర్రటి పదార్దం వస్తుంది. ఈ సమయంలో ఆలయాన్ని మూసి వుంచుతారు. ఆ సమయంలో అక్కడికి ఎవ్వరూ వెళ్లరు వెళ్లడానికి కూడా చాలా భయపడతారు. మూడు రోజులు ముగిసిన తరువాత నాల్గవ రోజు పూజలు చేసి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటారు.



Click it and Unblock the Notifications