Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్దుందంటే.? ఎవ్వరూ తప్పించుకోలేరు..!
కర్మ సిద్ధాం ఒక సిద్ధాం కాదు అది నిజంగా జరిగే వాస్తవమని పండితులు, హిందూ శాస్త్రం చెబుతోంది. కర్మ చేసిన దానికి వచ్చే ఫలితం కర్మసిద్ధాంతంలో వుంటుంది. కొంత వయసు వచ్చిన తరువాత చాలా మందికి తాను ఎందుకు ఇలా పుట్టాను, డబ్బు వున్న వాళ్ల ఇంట్లో ఎందుకు పుట్టలేదు లాంటి ప్రశ్నలు చాలా వస్తాయ్. నిజంగా కర్మ సిద్ధాంతం వుందా అయితే నా పరిస్థితి ఎందుకు ఇలా వుంది. నేనేమి పాపాలు చేశానని ఈ కష్టాలు అనుభవిస్తున్నానని అనుకుంటారు.
మనము చేసుకున్నది మనకు తిరిగి వస్తుంది. మామిడి పండు విత్తనం నాటితే మామిడి చెట్టే వస్తుంది. అలాగే ఏది చేస్తుంటామో అదే తిరిగి వస్తుంది. ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అని పరీక్షించుకోవచ్చు. మనము ఏది చేస్తున్నా అది మనకు తిరిగి వస్తుంది. ఈ లాజిక్ అర్థమైనప్పుడు మనము ఎవ్వరికీ హాని చెయ్యము.

కర్మసిద్ధాంతం అర్థమైనవారు ఎవ్వరికీ ఎలాంటి హానీ తలపెట్టరు, ఎందుకంటే అది తిరిగి వస్తుందని నమ్ముతారు కాబట్టి. కర్మ సిద్ధాంతం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని శాస్త్రం చెబుతోంది. తప్పకుండా కర్మ బాణానికి గురికావాల్సిందే. పాప కర్మం కచ్ఛితంగా అనుభవించి తీరాల్సిందే. దాని నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తప్పించుకోలేకపోయాడు.
కర్మసిద్ధాం నుంచి తప్పించుకోవాలంటే ఏది చేసిన మంచి చేయాలి, ఇంకా వాటి ఫలితాన్ని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. కర్మను ఏ విధంగానైతే చేస్తామో అదే విధంగా మనకు తిరిగి వస్తుంది. మనసుతో లేదా మాటతో ఎవరి గురించైనా చెడు ఆలోచిస్తున్నా ఆ చెడు అంటుకొని తీరుతుంది. మాటలతో బాధపడుతున్న అది నీకు వచ్చి తీరుతుంది. నీవు చేతలతో చేస్తున్నా ఆ కర్మ వచ్చి తీరుతుంది.
కర్మసిద్ధాంతా చాలా కాంప్లికేటెడ్ వ్యవస్థ అని చెబుతుంటారు. జన్మ జన్మలు ఇది కొనసాగుతుందని చెబుతున్నారు. కర్మలనుబట్టే ఏ ఇంట్లో, ఏ తల్లి కడుపులో పుట్టాలో నిర్ణియించబుడుతుంది. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చే లోపు గత జన్మలో చేసినవి గుర్తుకు వస్తాయ్. గర్భంలోంచి బయటకు వచ్చిన తరువాత కొత్త జీవితం ప్రారంభమౌతుంది. కష్టాలను కడుపులో వున్నప్పుడు నిర్ణయిస్తాడు. డబ్బు ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా ఏదో ఒక మెలిక కర్మ పెడుతుంది. ఆరోగ్యంగా వున్నా మళ్లీ ఏదో ఒక లోపం పెడుతుంది. కర్మ చాలా శక్తివంతమైంది.

ఏ ఫలితం వచ్చినా నవ్వుతూ దాన్ని తీసుకోగలితే కర్మ సిద్ధాంతం నుంచి బయటపడవచ్చు. ఏ కష్టం వచ్చినా ఈ జన్మలో అయిపోతుంది అనే భావనను కలిగి వుండాలి. కర్మసిద్ధాంతాన్ని కర్మకు వదిలేసి మన పనులను మనము చేసుకుంటూ వుంటే దాన్నుంచి సులభంగా బయట పడగలుగుతాము.
కోరకలను బట్టి చేష్టలుంటాయ్. చేష్టలను బట్టి అలవాట్లు వుంటాయ్. అలవాట్లను బట్టి ప్రవర్తన వుంటుంది. అతని ప్రవర్తనే అతని వ్యక్తిత్వం. ఉద్దేశ పూర్వకంగా చేసిన పనులు మాత్రమే కర్మలు అవుతాయ్. ప్రస్తుతం జరుగుతున్నది, జరగబోయేది అంతా కర్మలను బట్టే వుంటుంది. కర్మ సిద్దాంతం గురించి అన్ని మతాల్లో వివరించారు. కర్మ వల్ల రెండు జరుగుతాయ్.. ఒకటి ఫలం ఇంకోటి సంస్కారం లేదా ప్రవర్తన.



Click it and Unblock the Notifications
