కమ్సాను శ్రీకృష్ణుడు ఎలా చంపాడు: కమ్స వధ కథను తెలుసుకోండి

శ్రీకృష్ణుడు తన ప్రతి పాత్రను నిబద్దతతో పోషించాడు. పసితనంలో అల్లరి చిల్లరగా, యుక్త వయసులోప్రేమికునిగా, రాజ నీతిజ్ఞునిగా, సలహాదారుగా, యోధునిగా తన పాత్రలను అన్నింటినీ సంపూర్ణ స్థాయిలో పోషించాడు. అనేక మంది రాజులు తమని జయించగలిగిన సామర్ధ్యాన్ని కృష్ణుడు కలిగి ఉన్నాడని, క్రమంగా వారందరినీ ఓడించి సామ్రాజ్య స్థాపన చేయగలడని భావించినప్పటికీ, శ్రీకృష్ణ పరమాత్ముడు వాటన్నిటికీ వ్యతిరేకంగా ఇతర రాజ్యాల మద్య సయోధ్యలను కుదిర్చేందుకే సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వాన్ని చేసేవాడు. . పరిస్థితి చేయి దాటి, నీతి న్యాయాలు ధర్మ సంకటంలో ఇరుక్కున్నప్పుడు మాత్రమే ధర్మ సంస్థాపనార్ధం ఆయుధం పట్టేవాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు.

చాణూరుడు మరియు ముష్టికుడు అను మల్ల యోధుల సంహారం :

చాణూరుడు మరియు ముష్టికుడు అను మల్ల యోధుల సంహారం :

శ్రీ కృష్ణ భగవానుని సంహరించడానికి కంసుడు చేసిన ప్రతి ప్రయత్నం చివరకు విఫలమే అయ్యేది. క్రమంగా చాణూరుడు మరియు ముష్టికుడు అను మల్ల యోధులతో శ్రీకృష్ణుని సంహరించాలని పథకం పన్నాడు కంసుడు. క్రమంగా తన సలహాదారుడిని పిలిచి, చాణూరునితో మల్ల యుద్దానికి శ్రీ కృష్ణుని ఒప్పించేలా ఒక ప్రణాళిక తయారు చేయమని సూచించాడు. చాణూరుని బల పరాక్రమాలు తెలిసిన కంసుడు, శ్రీ కృష్ణుని ఓడించగలడని బలంగా విశ్వసించాడు.

చాణూరుడు మరియు ముష్టికుడు ఇద్దరూ పేరొందిన మల్ల యోధులు. చాణూరుడు అధిక దేహదారుడ్యాన్ని కూడుకుని భీతి గోల్పే శరీరాన్ని కలిగి ఉన్నవాడు. తమ ప్రత్యర్ధులపై తమ బరువును పూర్తి స్థాయిలో ఉంచి, బాహు బంధాలలో బిగించి సంహరించగల యోధుడు. క్రమంగా మల్లయుద్ద వీరునిగా విజేతగా నిలిచాడు. ఇక ముష్టికుడు తన ముష్టి ఘాతాలతో ప్రత్యర్ధులను మట్టికరిపించేవాడు. క్రమంగా వీరిరువురూ మల్ల యుద్ద వీరులుగా రాజ్యంలో పేరు గడించారు

శ్రీ కృష్ణునికి చాణూరుని సవాలు :

శ్రీ కృష్ణునికి చాణూరుని సవాలు :

ఎట్టకేలకు శ్రీ కృష్ణుడు ఉన్న ప్రాంతంలో కుస్తీ పోటీలను ఏర్పాటు చేయగలిగారు. చాణూరుడు వరుసగా ప్రత్యర్ధులను ఓడిస్తూ, ప్రేక్షకులందరిలో తనతో పోటీపడగల ధైర్యం ఉన్న వారిని బరిలోకి రమ్మంటూ సవాలు విసరడం మొదలుపెట్టాడు. అంతలో శ్రీ కృష్ణ పరమాత్ముడు మరియు బల రాముడు అక్కడకు చేరుకొని గుంపు మధ్య నిల్చుని జరిగేది చూడసాగారు. అంతలోనే, చాణూరుడు శ్రీ కృష్ణుని చూపి కుస్తీకి రమ్మని సవాలు విసిరాడు. కానీ, శ్రీ కృష్ణుడు కేవలం 16 ఏళ్ల బాలుడుగా ఉన్న కారణాన ఆ ఆలోచనను అక్కడ ఉన్న అందరూ వ్యతిరేకించారు. దానికి తోడు చాణూరుడు దృఢమైన దేహ ధారుడ్యం కలవాడు. శ్రీ కృష్ణుని ప్రాణాలకే ముప్పు వాటిల్లగలదని భయపడ్డారు.

కృష్ణుడిలో కోపాన్ని రెచ్చగొట్టేలా అనేక వ్యాఖ్యలు చేస్తూ, కుస్తీ బరిలోకి వచ్చేలా చేయడానికి నానా ప్రయత్నాలు చేశాడు చాణూరుడు. కానీ, ఆ ఆహ్వాన౦ ఉద్దేశం తెలిసిన శ్రీ కృష్ణుడు చాణూరుని మాటలకు నవ్వుకుంటూ ఉండసాగాడు.

క్రమంగా బరిలోకి దిగని ఎడల, పురుషునివే కాదంటూ పెను సవాలు విసిరాడు చాణూరుడు. దీనికి కృష్ణుడు తన తండ్రి అనుమతి లేనిదే తాను బరిలోకి రాలేనని అన్నాడు. వెంటనే తండ్రి శ్రీ కృష్ణుని తెలివితేటల మీద ఉన్న నమ్మకంతో అనుమతిని ఇవ్వడంతో బరిలోకి అడుగు పెట్టాడు శ్రీకృష్ణుడు.

ముష్టికునితో జరిగిన పోటీలో బలరాముని విజయం :

ముష్టికునితో జరిగిన పోటీలో బలరాముని విజయం :

ఇంతలో, మరో పక్క ముష్టికుని ఆహ్వానం మేరకు బలరాముడు కూడా కుస్తీ బరిలోకి వెళ్ళాడు. చాణూరుని సవాలుకు కృష్ణుడి అంగీకారం, ముష్టికుని సవాలును బలరాముని అంగీకారంతో ప్రారంభమైన పోటీలో, కొద్ది క్షణాల వ్యవధిలోనే బలరాముడు ముష్టికుని మెడను విరిచేసి కుస్తీ గెలిచాడు.

కృష్ణుడు తెలివితో చాణూరుని మట్టి కరిపించాడు :

కృష్ణుడు తెలివితో చాణూరుని మట్టి కరిపించాడు :

మరోవైపు శ్రీ కృష్ణుడు, చాణూరుని బలం అతని బరువులో ఉన్నదని గ్రహించి, చాణూరుని చేతికి చిక్కకుండా తప్పించుకోవడం ప్రారంభించాడు. క్రమంగా కొంత సమయం తీసుకున్నాడు. పూర్తిగా చాణూరుడు డస్సిపోయిన తర్వాత, అవకాశం చూసి తెలివిగా అతని మెడపై ఎక్కి మెడను విరిచేశాడు శ్రీ కృష్ణుడు.

కంసుని సైన్యానికి, యాదవులకు మధ్య పోరాటం :

కంసుని సైన్యానికి, యాదవులకు మధ్య పోరాటం :

ఆ ఇద్దరు మల్ల యోధులు కృష్ణుని చేతిలో సంహరించబడితే, తర్వాతి వంతు తనదేనని కంసునికి తెలుసు. అ౦దుకే, తన రక్షణ కోస౦ ఒక చిన్న సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. క్రమంగా చాణూరుడు, ముష్టికుడు చనిపోయిన వెంటనే యాదవులపై దండెత్తమని సైన్యాన్ని ఆదేశించాడు. క్రమంగా అతి తక్కువ సమయంలోనే తన సైన్యానికి, యాదవులకూ మధ్య పోరాటం మొదలైంది.

కృష్ణుని చేతుల్లో కంసుని సంహారం :

కృష్ణుని చేతుల్లో కంసుని సంహారం :

ఈ సంగతి తెలిసుకున్న శ్రీకృష్ణుడు, పరిస్థితులకు స్వస్థి చెప్పాలని భావించాడు. మరోవైవు కంసుడు శ్రీ కృష్ణుడిని సంహరించేందుకు, వీలుగా తన చేతిలోకి కత్తిని తీసుకుని శ్రీ కృష్ణుని మీదకు పరుగెత్తుకుంటూ వచ్చాడు.

తెలివిగా వ్యవహరించిన శ్రీ కృష్ణుడు, వెంటనే కంసుని వెనక్కి దూకి, అతని జుట్టును పట్టుకొని, వెనుకకు లాగాడు. అలా కంసుని కత్తి కింద పడిపోయింది. వెంటనే ఖడ్గాన్ని తీసుకుని, ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా కంసుని తలని నరికివేశాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు.

కంసుని సంహరించిన తర్వాత కంసుని మెడలో ఉన్న శంఖాన్ని తీసి, విజయానికి చిహ్నంగా విచ్చిన్నం చేశాడు. క్రమంగా జాతకం ప్రకారం దేవకీ దేవి అష్టమ సంతానం యొక్క 16వ సంవత్సరాన కంసుని సంహారం జరిగింది.

వాస్తవానికి ఆకాశవాణి సూచించిన ప్రకారం కంసుడు, దేవకీ దేవి అష్టమ సంతానం చేతిలో సంహరించబడుతాడని చెప్పబడింది. క్రమంగా దేవకీ దేవికి పుట్టిన ప్రతి బిడ్డనూ సంహరించడం మొదలు పెట్టాడు కంసుడు. అష్టమ సంతానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాసుదేవుడు కృష్ణ మాయ సహాయంతో యమునా నదిని దాటి, యశోదా దేవి సంతానంతో మార్పు చేసి శ్రీ కృష్ణుని గోకులంలో విడిచిపెట్టాడు. దేవకీ దేవి దగ్గర ఉన్న బిడ్డను వారి సంతానమని అపోహ చెందిన కంసుడు, సంహరించబోగా ఆ బిడ్డ మాయమై తాను శక్తిని అని చెప్పి, నీకు మరణం తప్పదని సూచించి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఎన్ని ప్రయత్నాలు చేసినా కృష్ణ మాయ ముందు విఫలమవుతూనే వచ్చాడు కంసుడు.

కంస సంహారం జరిగిన తర్వాత, ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ చేసుకున్నారు. కానీ శ్రీ కృష్ణుడు వారిని వారించి, ఏదిఏమైనా కంసుడు మీకు రాజు. రాజు అన్నాక మంచి చెడులు రెండూ ఉంటాయి. కావున అతని మరణాన్ని కోరుకోవడం సబబు కాదని సూచించాడు.

కంసుని సంహారంతో జరాసంధుని ప్రతీకారేచ్చ:

కంసుని సంహారంతో జరాసంధుని ప్రతీకారేచ్చ:

ఆ తర్వాత కంసుని మామ అయిన జరాసంధుడు శ్రీ కృష్ణునిపై ప్రతిన పూని, అనేకమార్లు శ్రీ కృష్ణుని సంహరించాలని ప్రయత్నించినా, భీముని చేతిలో సంహరించబడాలని శ్రీకృష్ణుడు భావించిన కారణంగా యుక్తితో సైన్యాన్ని మాత్రమే ఓడించి, జరాసంధుని తరిమిగొట్టే వాడు. ఆ క్రమంలో భాగంగా జరాసందునితో చేతులు కలిపిన అనేక మంది రాక్షసులను మట్టుబెట్టగలిగాడు శ్రీ కృష్ణుడు. క్రమంగా ఒకే నక్షత్రంలో పుట్టిన కీచకుడు, బకాసురుడు, జరాసంధుడు, దుర్యోధనుడు వంటి వారిని అదే నక్షత్రంలో పుట్టిన భీముని చేతిలో సంహరించబడేలా ప్రణాళికలు చేశాడు శ్రీకృష్ణుడు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Desktop Bottom Promotion