Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చేతికి కట్టుకునే నల్లదారంలో శక్తి ఎన్ని రోజులు వుంటుందో తెలుసా..?
పూజలో కొన్ని నియమాలు వుంటాయ్. వాటిని ఎలా పాటించాలో అదే పద్ధతిలో పాటించాలి. మనకు నచ్చిన విధంగా పూజచేయడానికి వీలు లేదని పండితులు చెబుతున్నారు. ప్రతీ దానికి ఒక నియమం ఉన్నట్టే, పూజా విధానానికి కూడా ఒక నియమం వుంది. ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి లాంటి ప్రశ్నలు కూడా కొందరిని వెంటాడుతూ వుంటాయ్.
పూజలో పాటించాల్సిన నియమాలు
ఇంట్లో గుడిలో వ్రతాలు పూజలు చేసేటప్పుడు చేతికి కంకణాలు, దారాలను కట్టుకుంటాం. ఆ దారానికి మూడు పక్షాలు శక్తి వుంటుందని హిందూ శాస్త్రం చెబుతోంది. 15 రోజులను ఒక పక్షమని అంటారు. నెలలో మనకు 2 పక్షాలు వస్తాయ్. ఒకటి కృష్ణ పక్షము, రెండవది శుక్ల పక్షము. అమావాస్య నుంచి పూర్ణమ రోజు వచ్చే 15 రోజులను శుక్ల పక్షము అని పిలుస్తారు. పౌర్ణమి నుంచి అమావాస్య వచ్చే దాన్ని కృష్ణ పక్షము అని పిలుస్తారు. 45 రోజుల తరువాత ఈ దారానికి శక్తి వుండదు. తరువాత ఆ దారాన్ని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పారవేయాలి. లేదంటే ఏదైనా చెట్టుపైన వేసేయాలి.

దృష్టి తగలకుండా స్త్రీలు, పురుషులు కాలికి నల్లదారం కట్టుకుంటారు. పురుషులు కుడి కాలికి, ఆడవాళ్లు ఎడమ కాలికి కుంటారు. అమావాస్య నుంచి అమావాస్యకు ఈ నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇంట్లో పూర్వీకులు తెచ్చిపెట్టిన వెండివిగ్రహాలను అమ్మేసి వేరే విగ్రహాలను తెచ్చుకోవద్దు. ఎందుకంటే అది వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి. ఆ విగ్రహానికి సంబంధించి చేయి విరగడం, పాడవడం లాంటిది ఏదైనా జరిగితే అప్పుడు దాన్ని షాపులో ఇచ్చి వేరే విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు.
పూజ చేసేటప్పుడు ఎన్ని అగరబత్తీలు వెలిగించాలనే ప్రశ్న మనకు పూజ చేసే సమయంలో చాలా సార్లు వచ్చి వుంటుంది. అగరబత్తీ అంటే ధూపం. ధూపాన్ని ఎంత వెలిగించాలనే విషయాన్ని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. అగరబత్తీలు వెలిగిస్తే రెండు వెలిగించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఒక వేల ధూప్ స్టిక్ అయితే ఒకటి వెలిగించమని చెబుతున్నారు. కెమికల్స్‌తో తయారు చేసిన అగరబత్తీలను పూజలో వాడవద్దు. వాటిని పీల్చడం వల్ల చాలా అనారోగ్యాలకు గురౌతాము. తిరుపతి, ఇస్కాన్ టెంపుల్ పరిసరాల్లో కెమికల్స్ లేని అగరబత్తీలను అమ్ముతుంటారు. వాటిని తెచ్చుకొని వెలిగించడం చాలా ఉత్తమం.

ఉదయం రెండు అగరబత్తీలు, సాయంత్రం రెండు అగరబత్తీలు వెలిగించుకోవచ్చు. సాయంత్ర సమయంలో పూజ చేసేటప్పుడు గంట మోగించవచ్చా లేదా అనే ప్రశ్న కూడా కొంతమందికి వస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సాయత్రం పూజ చేసేటప్పుడు కచ్ఛితంగా గంట మోగించవచ్చు. సాయంత్రం లక్ష్మీ దేవీ ఇంటికి వచ్చే సమయం.గంట వాయించినప్పుడు దేవతలు అక్కడికి వస్తారని శాస్త్రంలో వుంది. దుష్ట శక్తులు ఇంటి ముందు వుంటే ఈ గంట శబ్దం విని పారిపోతయ్.
సాయంత్రం పూజలో శంఖానాదాన్ని కూడా చేయవచ్చు. లక్ష్మీ దేవికి శంఖానాదమంటే చాలా ఇష్టమని పండితులు చెబుతున్నారు. ఏ ఇంట్లో అయితే శంఖానాదం చేస్తారో, ఆ ఇంట్లో లక్ష్మీ దేవీ స్థిర నివాసం వుంటుంది. పూజ మధ్యలో గంట మోగించవచ్చు కానీ పూజ మొత్తం పూర్తయిన తరువాత గంట మోగించవద్దని శాస్త్రం చెబుతోంది.



Click it and Unblock the Notifications