Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
శివుడి పుట్టుక ఒక్కో పురాణంలో ఒక్కోలా ఉంది.. అసలెలా పుట్టాడు ఆ మహాదేవుడు..?
శివుడి పుట్టుకపై ఇప్పటికీ చాలా చర్చలు జరుగుతున్నాయ్. ఈ విశ్వం ఆది అంతం తెలిసిన శివుడు అసలు ఎలా పుట్టాడు. శివుడికి తల్లిదండ్రి లేరంటారు. మరి ఆయన ఎలా జన్మించారు. జగత్తుకు మొత్తం తండ్రిగా భావించే శివుడికి తండ్రి ఎవరు ? ఇలా ఎన్నో ప్రశ్నలు శివుడి పుట్టకపై వస్తున్నాయ్. ఆ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శివుడిని స్వయంభువు అని అంటారు. స్వయంభు అంటే తనంతట తానే పుట్టినవాడు. ఇది కాకుండా శివుడి పుట్టుకపై శివ పురాణంలో ఒకలా, విష్ణు పురాణంలో మరోలా వుంది. శివ పురాణంలో శివుడి కాళ్లు మర్ధన చేసుకుంటుంటే ఆ మురికి నుంచి విష్ణువు పుట్టాడని ఉంది. ఇక విష్ణువు పురాణంలో విష్ణువు నుదుటన కిరణాల నుంచి శివుడు పుట్టాడని ఉంది. ఇలా ఈ రెండు పురాణాల్లోనే వైరుద్యం కనిపిస్తోంది. ఏది పరిగణనలోకి తెలుసుకోవాలో పండితుల మధ్యే పెద్ద చర్చ జరుగుతోంది.
పై రెండూ కథలు కాకుండా మరో కథ ప్రాచుర్యంలో ఉంది. విష్ణువు, బ్రహ్మ మద్య ఎవరు గొప్ప అని తీవ్ర చర్చ జరుగుతుండగా వారి మధ్యలో ఒక పెద్ద కాంతి స్థంభం ఏర్పడింది. ఆ కాంతి స్థంభం అంతం ఆది తెలుసుకున్నవారే గొప్పవారు అని ఇద్దరు అనుకొని దాని గురించి తెలుసుకోవడానికి బయలుదేరుతారు. ఈ ప్రయత్నంలో ఇద్దరూ విఫలం చెందుతారు. ఆ స్థంభం నుంచి శివుడు ప్రత్యక్షం కావడంతో శివుడే గొప్ప అని విష్ణువు, బ్రహ్మ నిర్దారణకు వస్తారు.
శ్రీ మహాదేవీ పురాణంలో శివుడి పుట్టక గురించి మరోలా ఉంది. ఒక సందర్భంలో నారదుడు బ్రహ్మదేవుడిని.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి తల్లిదండ్రి ఎవరు అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు సమాధానం చెప్తూ...దుర్గాదేవి, శివస్వరూపుడు బ్రహ్మ ద్వారా ముగ్గురి పుట్టుక జరిగిందని అంటాడు. శివుడు, దుర్గాదేవే ముగ్గురికీ తల్లీదండ్రీ అని అంటాడు.
శివుడు తనకున్న జ్ఞానన్ని 7గురు రుషులకు మాత్రమే చెబుతాడు. ఆ ఏడు రుషులే మనము సప్త రుషులుగా భావిస్తాం. లోకానికి చెందిన ఎన్నో రహస్యాలను, వేదాలను, ఆయుర్వేదం, పురుణాల్లో చెప్పిన బడిన శాస్త్రాలు ఇలా చాలా విషయాలు ఈ సప్త రుషుల ద్వారానే తెలిసాయని పండితుల చెబుతున్నారు.



Click it and Unblock the Notifications