Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
గురుపూర్ణిమ రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుంది.. ఏది ముట్టినా బంగారమే..!!
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణమి పౌర్ణమి గురు పౌర్ణమి అని అంటారు అన్ని పౌర్ణమిలకంటే ఈ ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. అయితే ఈ సంవత్సరం జూలై 21వ తేదీ రోజున గురుపౌర్ణమి వచ్చింది. ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి శుభ్రం చేసుకొని, మీ ఇంటి ముందు తీగల ముగ్గులు వేసుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి.

ముందుగా దేవుని పటాలను గంధము కుంకుమ పూలతో అలంకరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో 2 యాలకులను వేసి స్నానం చేయండి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయ తీసుకుని దానిమీద కుంకుమతో బొట్టుపెట్టి పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి తలచుకుంటూ దేవునికి నమస్కారం చేయాలి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకుని గుడిలో ఉన్న పంతులుగారికి నమస్కారం చేసి పంతులు గారి ఆశీర్వాదం తీసుకోవాలి. పండితులు ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది.
పౌర్ణమి అంటేనే తులసి మొక్కను పూజించటం రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం చేస్తారు. పౌర్ణమి రోజున తులసి మొక్కను ముట్టుకోవడం కానీ రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం కానీ అస్సలు చేయకూడదు. ఆదివారం రోజున తులసి మొక్క, రావిచెట్టు లో దరిద్ర దేవత నివాసమై ఉంటుందట. కాబట్టి ఆదివారం రావిచెట్టును తాకితే దరిద్రం పట్టిపీడిస్తోందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఒక్కరోజు మాత్రమే రావిచెట్టును, తులసి మొక్కను ముట్టుకోకూడదు. పౌర్ణమి చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి. మీ ఇంట్లోకి కచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం 8 గంటల లోపు మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి .గురు పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంట్లో డబ్బు సమస్యలు రాకుండా చేస్తుంది.
ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు దీపం వెలిగిస్తే మీ అప్పులు త్వరగా తీరుతాయ్. అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే ఈ గురు పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు. పౌర్ణమి ఆదివారం రోజున వచ్చింది. ఆదివారం అంటేనే సూర్యభగవానుడికి అంకితం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయం ఎనిమిది గంటల లోపు సూర్యభగవానుడికి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం, తూర్పు వైపుకు తిరిగి మీ రెండు చేతులను పైకి ఎత్తి సూర్యుడిని చూస్తూ నీటిని వదలాలి. ఆ వెంటనే సూర్యునికి నమస్కరించాలి. తరువాత ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మూడు సార్లు చదవండి. పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోయి మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభం అవుతాయి.
సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. కాబట్టి పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి పూజ గదిలో ఉంచి దేవుడికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సంపద విపరీతంగా పెరుగుతుంది. ఒక ఐదు యాలకులను తీసుకుని వాటిని పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ పర్సులో ఎల్లప్పుడు డబ్బు ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం పెడితే చాలా మంచిది. దేవతలు అడుగు పెడతారు.



Click it and Unblock the Notifications
