Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
Diwali 2024: దీపావళి రోజు ఆ దేవుళ్లను పూజిస్తే.. వారికి అదృష్టం తలుపుతట్టినట్లే!
దీపావళి రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం సాధారణమే. అయితే పలు రాశుల వారు లక్ష్మీదేవితో పాటు మరికొన్ని దేవుళ్లను పూజిస్తే కచ్చితంగా కార్యసిద్ధి, కోరికలు నెరవేరడం, అనుకున్న కార్యక్రమాలు పూర్తవడం, డబ్బులు రావడం, అదృష్ట యోగం పట్టనుందట. అయితే ఎలాంటి రాశుల వారు ఏ దేవుడిని పూజించాలి, ఎలాంటి పరిహారం చెల్లించాలి అనేది ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏ రాశి వారు ఏ దేవుడిని పూజించాలంటే..
మేషం, వృశ్చికం: ఈ రెండు రాశుల వారికి అధిపతిగా కుజుడు ఉన్నాడు. దీని కారణంగా ఈ రెండు రాశుల వారు దీపావళి తరువాత భాగ్యవంతులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే వీరు భాగ్యవంతులు కావాలంటే దీపావళి రోజు లక్ష్మీదేవితో పాటు సుభ్రమణ్యస్వామిని కూడా పూజించాలి. దీని కారణంగా లక్ష్మీదేవితో పాటు సుబ్రమణ్యస్వామి ఆశీస్సులు కూడా ఈ రాశుల వారిపై ఉండనున్నాయి.

ఈ విధమైన పూజలు చేస్తే ఈ రెండు రాశుల వారికి ఆర్ధిక లాభం కలగనుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. చేపట్టిన ఏ పని అయినా విజయవంతమవుతుంది. మనసులోని కోరికలు నెరవేరడంతో పాటు సంతాన భాగ్యం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరగడంతో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది.
వృషభం, తుల: ఈ రెండు రాశుల వారికి శుక్రుడు అధిపతిగా ఉన్నారు. దీని కారణంగా ఈ రాశుల వారు దీపావళి రోజున దుర్గాదేవిని పూజించాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల వారి జీవితంలోని సమస్యలు తొలిగిపోతాయి. ధైర్యం చేకూరుతుంది. ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలను గడిస్తారు. ఉద్యోగాల్లో జీతం పెరిగే ఛాన్సుంది.
అలాగే ప్రమోషన్స్ లభించడం, విదేశీ ఉద్యోగ అవకాశాలు రావడం వంటివి జరగనున్నాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి అదృష్టయోగం పట్టనుంది. పోటీదారులు, శత్రువులపై విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరిగి, అభివృద్ధి దిశగా ప్రయాణం సాగిస్తారు.
మిథునం, కన్య: ఈ రెండు రాశుల వారి జీవితాలు దీపావళి తరువాత అద్భుతంగా తయారవనున్నాయి. ఈ రెండు రాశులకు బుధుడు అధిపతిగా ఉండడంతో.. ఈ రాశుల వారు దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా పూజించాలి. దీని కారణంగా ఈ రాశుల వారి చేపట్టే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా అవి తొలిగిపోయి, పనులు విజయవంతమవుతుంది.
అధిక ఆదాయ ప్రయత్నాలు పెరగడంతో పాటు, పెళ్లిళ్లు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయవంతమవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగంతో పాటు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కుదుటపడడంతో పాటు ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
ధనుస్సు, మీనం: ఈ రెండు రాశుల వారికి ఈ సంవత్సరమంతా అనుకూలంగానే కొనసాగుతుంది. అయితే ఈ రెండు రాశుల వారికి గురుడు అధిపతిగా ఉండడం వల్ల ఈ రాశి వారు దీపావళి రోజున లక్ష్మీ దేవితో పాటు నరసింహస్వామిని లేదా దత్తాత్రేయ స్వామిని పూజించాలి. దీని వల్ల ముఖ్యమైన పనులు పూర్తవడంతో పాటు మనసులో ఎప్పటి నుంచో అలానే ఉండిపోయిన కోరికలు కూడా నెరవేరుతాయి. వ్యక్తిగత, కుటుంబ, ఆర్ధిక సమస్యలన్నీ తొలిగిపోతాయి.
నిరుద్యోగులకు అద్భుతమైన, అరుదైన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పెళ్లిళ్లు కుదరడంతో పాటు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అద్భుతమైన లాభాలను గడించే అవకాశముంది. అలాగే ఆకస్మిక ధనలాభం పొందే ఛాన్సుంది.



Click it and Unblock the Notifications