TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
సుమిత్రలాంటి తల్లి ఉంటే ప్రతి అన్నకు లక్ష్మణుడిలాంటి తమ్ముడుంటాడు,లక్ష్మణుడు,శత్రజ్ఞుడు అలా పుట్టారు
రామాయణంలో అత్యంత్య సౌమ్యమైన పాత్ర సుమిత్ర. దశరథుడి భార్య అయిన సుమిత్ర కాశీ రాజ్యానికి చెందిన రాజ కుమారి. దశరథుడి పెద్ద భార్య పేరు కౌసల్య. ఇక చిన్ననేమో కైకేయి. మధ్యలో ఉండేది అంటే నడిపి భార్య సుమిత్ర. ఈర్ష్య అసూయ, ద్వేషం అస్సలు లేని భార్యగా సుమిత్ర పేరు పొందింది.
సుమిత్ర మంచి జ్ఞానం గల ఆమె. ఎంతో ముందు చూపుంది ఆమెకు. ఆ నారాయణుడు రాముడుగా జన్మించాడాని ఆయనకు శేషువులా, శంకుచక్రాల్లా లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞుడు జన్మించాడని ఆమెకు ముందే తెలుసు. వీరంతా లోకకల్యాణం కోసం జన్మించారని సుమిత్ర ముందే గ్రహించగలిగింది.
ఎవ్వరికీ సంతానం కలగలేదు
దశరథుడు ముగ్గురు భార్యలు చేసుకున్నా కూడా ఎవ్వరికీ సంతానం కలగలేదు. దీంతో వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్తాడు దశరథుడు. ఆయన చెప్పినట్లుగా పుత్రకా మేష్ఠి అనే యాగాన్ని చేస్తాడు. యాగం అయిపోయాక యాగ ఫలమైన పాయసాన్ని మూడు గిన్నెల్లో పోసి దశరథుడు తన భార్యలకు ఇస్తారు.
గరుడ పక్షి వచ్చి
అయితే సుమిత్ర పాయసం తిందామనుకునేలోపు ఒక గరుడ పక్షి వచ్చి గిన్నెను ఎత్తుకుని వెళ్తుంది. దీంతో సుమిత్ర ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. అయితే కౌసల్య, కైకేయిలిద్దరూ వారి పాయసంలో సగం తాగి మిగిలిన సగాన్ని సుమిత్రకు ఇస్తారు.
ఇద్దరు కొడుకులు
సుమిత్రకు ఇద్దరు కొడుకులు పుడతారు. వారే లక్ష్మణుడు, శత్రజ్ఞుడు.
అయితే వీరిద్దరూ స్వయంగా అన్నదమ్ములైనా కూడా కౌసల్య కుమారుడు రాముడు వెంట లక్ష్మణుడు కైకేయి కుమారుడైన భరతుని వెంట శత్రజ్ఞుడు ప్రతి క్షణం ఉంటారు.
నేను అన్నను విడిచి ఉండలేనమ్మా
సుమిత్ర ఎవరినీ నొప్పించకుండా బతికింది. ఆమె వ్యక్తిత్వం పూర్తి భిన్నం. రాముడు అరణ్య వాసానికి వెళ్తున్నప్పుడు అందరికంటే ఎక్కువగా సుమిత్ర ఏడ్చింది. అమ్మా... అన్న అడవులకు వెళ్తే నేను అన్నను విడిచి ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తూ ఉండలేనమ్మా అని లక్ష్మణుడు చెప్పినప్పుడు ఆయన మాటను కాదనలేదు ఆ తల్లి.
మీ అన్న రాముడే దశరథుడు..
"మీ అన్న, వదినలకు ఎప్పుడూ అండగా ఉండు నాయనా అంటూ ఆశీర్వదించి పంపింది సుమిత్ర. లక్ష్మణ నిన్ను ఆ భగవంతుడు వనవాసం చేసేందుకే పుట్టించినట్లున్నాడు. మీ అన్న రాముణ్ని అరణ్యంలో ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా చూసుకో. మీ అన్న రాముణ్ని దశరథుడి మాదిరిగా, మీ వదినమ్మ సీతను మీ అమ్మగా, అరణ్యాన్ని అయోధ్యలా భావించు కన్నా" అంటూ ఆశీర్వదించింది సుమిత్ర.
సౌమ్యానికి మారు పేరు
లక్ష్మణుడు సుమిత్ర కుమారుడు కాబట్టే సౌమిత్రి అంటారు. రామాయణం లో సుమిత్ర పాత్ర గురించి తక్కువగా ఉన్నా ఆమె ఎక్కువ ఉదారత్వం కలది. ఇక రాముడు అడవుల పాలయ్యాడని దశరథుడు కుంగిపోతుంటే సుమిత్రనే ధైర్యం చెబుతుంది.
దిగులుతో దశరథుడు మరణించాక కౌసల్యకు అండగా ఉంటుంది. ఇందుకు కారణం అయిన కైకేయిని సుమిత్ర ఏమీ అనదు. ఎవ్వరినీ నిందించని మనసత్వం సుమిత్రది. అందరిలో ధైర్యం నింపే గుణం ఆమెకు ఎక్కువ.
సౌమ్యానికి మారు పేరుగా ఉండే సుమిత్ర నిజంగా ఆదర్శమూర్తినే.