For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరస్వతీ దేవి ఆశీర్వాదంతో చదువుల యందు ఉన్నత శిఖరాలు అధిరోహించండి

|

మారుతున్న కాలానికి అనుగుణంగా మారిన ఈ పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరు వారి వారి సామర్ధ్యాలు పెంచుకోవడానికి, తద్వారా ఉన్నత సోపానాలు అధిరోహించుటకు నిరంతర కృషి చేస్తుంటారు. మరియు ఆ పోటీలో నిలదొక్కుకోవడానికి తమని తాము ముందుకు ఉసిగొల్పుతుంటారు.

ఉదాహరణకు పరీక్షల సమయంలో విద్యార్ధులు, చుట్టూ ఉన్న సమాజానికి అతీతంగా చదువుకుంటూ మానసికంగా పోటీలో నెగ్గాలన్న కసితో కనిపిస్తుంటారు. ఇది వారి మానసిక స్థితిని మాత్రమే ప్రభావితం చేస్తుంది. కానీ కష్టపడి అభ్యసించిన విషయాలను సైతం మర్చిపోయే అవకాశం ఉంది. తద్వారా విద్యార్ధి ఆత్మన్యూనతకు లోనవ్వడం పరిపాటి అవుతుంది.

Goddess Saraswati , Hindu Goddess Saraswati ,

కావున పరీక్షా సమయంలో విద్యార్ధుల తల్లిదండ్రులు మరియు ఉపాద్యాయులు వారికి ద్యానం మరియు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారి మనసును రీఫ్రెష్ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో అనేకమంది విద్యార్ధులు ఏకాగ్రత సమస్యను కూడా కలిగి ఉన్నారు. తద్వారా పరీక్షలను సమర్ధంగా ఎదుర్కొనలేని స్థితికి వస్తుంటారు.

ఈ సమయంలో దైవ చింతనని వారిలో కలిగించడం ద్వారా, వారి ఏకాగ్రతని పెంచుటకు మరియ వారి దృష్టిని చదువులపై కేంద్రీకరించేలా చెయ్యవచ్చు. తద్వారా పరీక్షల్లో ఎటువంటి జంకు లేకుండా విజయం దిశగా అడుగులు వేసేలా సహాయపడవచ్చు

విజ్ఞానo, సంగీతం మరియు విభిన్న కళలకు అధిపతి సరస్వతీ దేవి. అనేకమంది ఉత్తీర్ణులైన విద్యార్ధులు సరస్వతీ దేవిని పూజించడం ద్వారా చదువుల్లో నైపుణ్యం పెంచుకోవచ్చని, తద్వారా పరీక్షల యందు ఉత్తీర్ణత సాధించవచ్చని ఖరాఖండిగా చెప్తుంటారు. చదువు మరియు ఉద్యోగాల యందు సమస్యలను ఎదుర్కొనడానికి సరస్వతీ దేవిని పూజించుట ఎంతో ఉత్తమం.

Goddess Saraswati | Hindu Goddess Saraswati | Goddess Saraswati Mantra

సరస్వతీ మంత్రము:

1)ఓం వాగీశ్వరాయ విద్మహీ వాగ్వాదీన్య ధీమహి తన్నః సరస్వతి ప్రచోదయాత్

2)యాకుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా

యావీణావరదండమండి తకరాం యాశ్వేత పద్మాసనా

యాబ్రహ్మాచ్యుత శంకర ప్రబృతిభి దేవై సదా పూజితా

సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్సేష్య జాడ్యాపహాం

Goddess Saraswati | Hindu Goddess Saraswati | Goddess Saraswati Mantra

సరస్వతీ దేవి మంత్రం పఠనం:

ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేశాక భక్తి శ్రద్దలతో సరస్వతీ దేవి మంత్రాన్ని పఠిoచడం మంచిది. అలా ప్రతి రోజూ ఉదయం 64 సార్లు సరస్వతీ దేవి మంత్రాన్ని 21 రోజులు పఠిoచడం వలన సరస్వతీ దేవి ఆశీస్సులు పొందవచ్చు.

Hindu Goddess Saraswati

సరస్వతీ దేవి మంత్ర ఉంచ్చారణ వలన కలుగు ప్రయోజనాలు:

తెలివి మరియు జ్ఞానోదయం:

చదువుల యందు ప్రేమ కలిగి, సరస్వతీ మంత్రం పఠనం చేయువారికి ఆ దేవి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. సరస్వతీ దేవి సకల కళలకు, విద్యకు, తెలివి, జ్ఞానానికి కూడా అధిపతి. కావున అభ్యాసాల యందు విద్యార్ధుల తెలివితేటలు పెరుగుటలో సహాయం చేస్తుంది. తద్వారా చదువుల యందు జ్ఞానాన్ని సమకూర్చుకుని పరీక్షలలో విజయకేతనాలను ఎగరవెయ్యగలరు.

Goddess Saraswati | Hindu Goddess Saraswati | Goddess Saraswati Mantra

సచ్చీలమైన స్పృహ

దైవచింతనతో సరస్వతీ మంత్ర పఠనం గావించుట వల్ల , సానుకూల స్పృహ కలిగిన వారై , చదువుల యందు దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. ఇది మీ సామర్ధ్యాన్ని పెంచుకొనుటకు గొప్ప మార్గంగా ఉంటుంది.

జ్ఞానం మరియు అభ్యాసం

సరస్వతీ మంత్రాన్ని పఠిoచడం ద్వారా జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడం వలన అధ్యయనాల్లో మంచి ఫలితాల్ని రాబట్టుకోవడమే కాకుండా, మంచి జ్ఞానాన్ని కూడా సంతరించుకుంటారు.

కావున దైవచింతనతో చేసే సరస్వతీ దేవి మంత్ర పఠనం, మీ ఏకాగ్రతను పెంచుటయే కాకుండా మీ ఉన్నత విజయాలకు అండగా నిలుస్తుందని తెలుసుకోండి.

English summary

Goddess Saraswati | Hindu Goddess Saraswati | Goddess Saraswati Mantra

Goddess Saraswati , Hindu Goddess Saraswati ,Goddess Saraswati Mantra ,Saraswati is known as the Goddess of knowledge in Hindus. Chanting Saraswati mantra will help students in excelling in their exams.
Desktop Bottom Promotion