Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఉజ్జయిని మహంకాళి దర్శనం చేసుకోవాలనుందా.. అయితే ఈ ప్రత్యేక ఆఫర్ మీకోసమే - ఓ లుక్కేయండి!
ఉజ్జయిని మహాకాళేశ్వర్ దర్శనానికి వెళ్లాలి అనుకునే వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో ఉజ్జయిని, ఓం కారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్ అన్నీ సందర్శనలు ఉంటాయి. అయితే ఆగస్టు 3వ తేదీ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం కాబోతుంది.

ఉదయం 5 గంటలకు ఫ్లైట్ - టూర్ ప్రారంభం
ఈ ప్యాకేజీని బుక్ చేసుకున్న పర్యాటకుల్ని ఫ్లైట్ లో తీసుకెళ్లి ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను చూపించబోతుంది. మరి ఈ టూర్ ప్యాకేజీలో విశేషాలు అంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐఆర్సీటీసీ మధ్య ప్రదేశ్ మహా దర్శన్ టూర్ మొదటి రోజు హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 5.0 గంలకు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 7.45 గంటలకు ఇండోర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఉజ్జయిని బయలు దేరాలి. ఉజ్జయినిలో స్థానిక ఆలయాల సందర్శన ఉంటుంది.
సాయంత్రమే మహాకాళేశ్వర్ ఆలయ దర్శనం
హరసిద్ధి మాత ఆలయం, సాందీపని ఆశ్రమం, కాల భైరవ ఆలయం, మంగళనాథ్ ఆలయం, చింతామన్ గణేష్ ఆలయాలను చూడొచ్చు. సాయంత్రం మహాకాళేశ్వర్ ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రికి ఉజ్జయినిలో బస చేయాలి. రెండో రోజు ఓంకారేశ్వర్ బయలు దేరాలి. సాయంత్రం ఓంకారేశ్వర్ చేరుకున్న తర్వాత ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రికి ఓంకారేశ్వర్ లో బస చేయాలి. అలాగే మూడో రోజు మహేశ్వర్ బయలు దేరాలి.
మూడో రోజు అహల్య దేవి ఫోర్ట్, నర్మదా ఘాట్
అక్కడ అహల్య దేవి ఫోర్ట్, నర్మదా ఘాట్ చూడవచ్చు. ఆ తర్వాత ఇండోర్ బయలు దేరాలి. రాత్రికి ఇండోర్ లో బస చేయాలి. నాలుగో రోజు అన్నపూర్ణ మందిర్, లాల్ భాగ్ ప్యాలెస్ కూడా చూడొచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రాయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 7.20 గంటలకు ఇండోర్ లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో రటూర్ ముగుస్తుంది.
సింగిల్ ఆక్యుపెన్సీకి 28 వేలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి 21, 300
ఐఆర్సీటీసీ మధ్య ప్రదేశ్ మహా దర్శన్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ఒక్కరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,300, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.22,200, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.28,000 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టిక్కెట్స్, హోటల్ లో బస, 4 బ్రేక్ ఫాస్ట్, 3 డిన్నర్, ఏపీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications