Just In
- 3 hrs ago
Breakfast Foods for diabetes:షుగర్ ఉన్నవారు ఉదయం అల్పాహారంలో తప్పకుండా ఎలాంటి ఆహారాలు తినాలి?
- 6 hrs ago
మీ జుట్టు రంగు ఫేడ్ అవ్వకుండా ఈ చిట్కాలను ఇంట్లోనే ప్రయత్నించండి..
- 9 hrs ago
నోటి దుర్వాసన రాకుండా నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి?
- 9 hrs ago
National Doctors’ Day 2022 :వైద్య రంగానికి జీవితాన్ని అంకితం చేసిన బిదన్ చంద్ర రాయ్ గురించి నమ్మలేని నిజాలు..
Don't Miss
- News
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా: ఏక్నాథ్ షిండేకు చురకలు
- Movies
ఓటీటీ రిలీజ్ విషయంలో టాలీవుడ్ నిర్మాతల కీలక నిర్ణయం.. ఇక అన్ని రోజులు ఆగాల్సిందే!
- Sports
IND vs IRE: టీమిండియాలో కొనసాగుతున్న ధోనీ సంప్రదాయం!
- Technology
ఇలా చేయడం ద్వారా Youtubeలో సబ్స్క్రైబర్స్ ను పెంచుకోవచ్చు!
- Travel
రహస్యాల నిలయం... గుత్తికొండ బిలం!
- Finance
SEBI Fine: కో-లొకేషన్ స్కామ్ లో సెబీ భారీ పెనాల్టీలు.. చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణియన్లకు కూడా..
- Automobiles
జర్మన్ లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి 'మున్మున్ దత్తా': ధర ఎంతో తెలుసా?
Jagannath Puri Rath Yatra 2022: ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పుడంటే...!
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర హిందువులకు ఎంతో ముఖ్యమైనది. భారతదేశంలోని నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఇదొకటి.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా ఆషాఢ మాసంలో రథయాత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది జులై మాసంలో 1వ తేదీ నుండి పది రోజుల పాటు ఈ రథయాత్ర వేడుకలు జరుగనున్నాయి. కరోనా కారణంగా గత ఏడాది నామ మాత్రపు భక్తులతోనే ఈ రథయాత్ర వేడుకలు జరిగాయి.
జగన్నాథుడు అంటే జగత్తుకు ప్రభువు అని అర్థం. ఈ రథయాత్రలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రథయాత్రలో పాల్గొనడం ద్వారా తమ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. మరి కొద్ది రోజుల్లో జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జగన్నాథుడి రథయాత్ర తేదీ, సమయంతో పాటు జగన్నాథుని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

జగన్నాథుని రథయాత్ర ఎప్పుడంటే..
ప్రతి ఏడాది హిందూ పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని రెండో రోజున నిర్వహిస్తారు. 2022లో జగన్నాథుడి రథయాత్ర జులై 01వ తేదీ నుండి ప్రారంభం కానుంది. దేవశయని ఏకాదశి రోజున ఈ రథయాత్ర ముగుస్తుంది. యాత్ర మొదటి రోజున జగన్నాథుడు ప్రసిద్ధ గుండిచ మాతా ఆలయాన్ని సందర్శిస్తాడు. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత తొలిసారి ఘనంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఏడాది భక్తులకు అనుమతించే అవకాశం ఎక్కువగా ఉంది.

గత ఏడాదిలో..
గత ఏడాది రథయాత్రను నిర్వహిస్తామని పరిమిత స్థాయిలో భక్తులు, పండితులు ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్నారు. జగన్నాథుడి రథయాత్రకు గతంలో ఎవరైతే కరోనా నెగిటివ్ రిపోర్టు తెచ్చుకున్నారో మరియు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న రథయాత్రకు అనుమతి సులభంగా లభించింది.

జగన్నాథుని రథయాత్ర ప్రాముఖ్యత..
హిందూ పురాణాల ప్రకారం, విష్ణువు తన సోదరుడు బాలభద్ర మరియు సోదరి సుభద్ర అవతారమైన జగన్నాథుడి రథయాత్ర పూరిలో నిర్వహించబడుతుంది. ఈ రథయాత్ర పది రోజుల పాటు కన్నులపండుగగా జరుగుతుంది. తలధ్వజ అని పిలువబడే బాలభద్ర రథం ఈ ప్రయాణంలో ముందు వరుసలో ఉంటుంది. మధ్యలో సుభద్ర రథం వెళ్తుంది. వీటినే దర్పదాలన లేదా పద్మ రథం అంటారు. చివరగా నంది ఘోష్ అని పిలువబడే జగన్నాథ ప్రభువు రథం కదులుతుంది. ఈ రథయాత్రను ప్రత్యక్షంగా చూసిన వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుందని, స్వేచ్ఛ లభిస్తుందని మరియు మరణం తర్వాత మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

అతిపెద్ద తీర్థయాత్ర..
జగన్నాథుని ఆలయం భారతదేశంలో అతి పెద్ద తీర్థయాత్రల్లో ఒకటి. దీనికి నాలుగో స్థానం వచ్చింది. ఈ ఆలయం 800 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఈ ఆలయం చుట్టూ నాలుగు గోడలు ఉంటాయి. ఈ ఆలయంలో జగన్నాథడు, తన సోదరుడు బాలభద్ర మరియు సోదరి సుభద్ర దేవతలు భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం.

ప్రతి సంవత్సరం కొత్త రథాలు..
ఇక్కడి రథయాత్రలో మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త రథాలను సిద్ధం చేస్తారు. అవి స్వచ్ఛమైన మరియు నాణ్యత గల వేప చెక్కతో తయారు చేస్తారు. వీటిలో గోర్లు, ముళ్లు లేదా ఇతర లోహాలను ఉపయోగించరు. ఈ రథం మూడు రంగులలో ఉంటుంది. జగన్నాథుని రథం ఎత్తు 45 అడుగుల వరకు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. రథయాత్రకు కేవలం పదిహేను రోజుల ముందు జగన్నాథుడు అనారోగ్యానికి గురయ్యాడని, ఆ దేవుడు కోలుకున్నతర్వాత ఈ ఊరేగింపు బయటకు వచ్చినట్లు స్థానికులు చెబుతారు.

100 యాగాల ఫలితం..
ఈ రథయాత్రలో పాల్గొని భగవంతుని రథాన్ని లాగిన భక్తులకు 100 యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఈ యాత్రలో పాల్గొన్న వారికి మోక్షం లభిస్తుంది. అందుకే జగన్నాథుని యాత్రలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. అషాఢ మాసంలో పూరి పుణ్యక్షేత్రంలో స్నానం చేయడం వల్ల సకల తీర్థాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని, శివలోకం ప్రాప్తిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది.