Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Krishna Janmashtami 2023: శ్రీ క్రిష్ణుని లీలల గురించి తెలుసుకుందామా...
హిందు మతం ప్రకారం, శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున శ్రీ క్రిష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. క్రిష్ణుడు పుట్టినరోజునే జన్మాష్టమి లేదా గోకులాష్టమి, శ్రీ క్రిష్ణ జయంతిగా జరుపుకుంటారు.

ఈ ఏడాది 2023 సంవత్సరంలో సెప్టెంబర్ 06వ తేదీన శ్రీ క్రిష్ణ జన్మాష్టమి వచ్చింది. ఈ పవిత్రమైన తల్లులందరూ తమని తాము దేవకి, యశోదగాలు భావిస్తూ.. తమ బిడ్డలనే శ్రీ క్రిష్ణుడి ప్రతిరూపాలుగా భావిస్తారు.

చిన్నారులను చిన్ని క్రిష్ణుడిలా అలంకరిస్తారు. పంచెకట్టి, తలపై చిన్న కీరిటం, నెమలి పింఛంతో పాటు రంగు రంగుల ఆభరణాలు వేసి అలంకరిస్తారు. తన లీలల ద్వారా భక్తి, జ్ణానం, యోగం, మోక్షాల గురించి ప్రపంచానికి తెలియజేశారు శ్రీక్రిష్ణ భగవానుడు. ఈ సందర్భంగా శ్రీక్రిష్ణుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

విష్ణువు 8వ అవతారం..
హిందూ పురాణాల ప్రకారం భూమి మీద అధర్మం, అరాచకత్వం పెరిగిపోయి ధర్మం మాయమవుతున్న సమయంలో విష్ణుమూర్తి మానవుని రూపంలో జన్మించి అసుర సంహరం జరిపించి తిరిగి ధర్మాన్ని నెలకొల్పుతాడని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం.. ధర్మాన్ని నిలబెట్టడానికి, మానవాళిని సంరక్షించడానికి.. విష్ణుమూర్తి ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీక్రిష్ణ అవతారమని కూడా చాలా మంది నమ్ముతారు.

కంసుడి సంహారం..
భూ లోకంలో తన మామ అయిన కంసుడు చేస్తున్న దాష్టీకాల నుంచి ప్రజలను రక్షించేందుకు, అసుర సంహారం చేసేందుదకు, అధర్మాన్ని నాశనం చేయడానికి శ్రీక్రిష్ణుడు భూలోకానికి విచ్చేశాడు. ధర్మస్థాపన కూడా చేశాడని చాలా మంది విశ్వాసం. శ్రీక్రిష్ణ అవతారంలో కంసాది దానవులను సంహరించాడు. ధర్మాన్ని పాటించిన పాండవులకు అండగా నిలిచి అధర్మాన్ని ఓడించాడు. గీతాచార్యునిగా యుద్ధ రంగంలో అర్జునుడికి హితబోధ చేశాడు. చావుపుట్టుకల పరమార్థం వివరించాడు. దాన్నే ఇప్పటికీ మనం భగవద్గీతగా మనం చదువుతున్నాం.

శ్రీక్రిష్ణుడి పుట్టుక నుంచే..
శ్రీ క్రిష్ణుడు పుట్టిన నాటి నుంచే దేవతామూర్తిగా పూజలందుకుంటూ వస్తున్నాడు. అల్లరి క్రిష్ణుడిగా.. వెన్న దొంగగా.. గోవర్ధన గిరిధారిగా, కాళీయ మర్దనుడిగా.. గీతా ప్రభోదకుడిగా. అసుర సంహారిగా తాను చేసిన ప్రతి పని నుండి ప్రజలకు అద్భుతమైన సందేశాలను ఇస్తూనే ఉన్నాడు.

నలుగురికి పంచడం..
వెన్నను దొంగించి తప్పు చేశాడనుకునేలోపే.. వాటిని గోప బాలురకు పంచిపెట్టడం ద్వారా మనకున్నది నలుగురికివ్వడం వల్ల కలిగే సంతోషం ఎలా ఉంటుందో చేసి చూపించాడు.

గోవర్దన పర్వతాన్ని..
తనకు బదులుగా గోవర్దన గిరిని పూజించారనే కోపంతో ఇంద్రుడు రేపల్లెపై జడివాన కురిపించగా.. ఆ దాడి నుండి తన వారిని, పశుపక్ష్యాదులను రక్షించేందుకు గోవర్దన పర్వతాన్ని చిటికిన వేలిపై నిలిపాడు. ఆ విధంగా ఇంద్రుడి కోపాన్ని అణచివేశాడు.

‘కృష్ణం వందే జగద్గురు’
పుట్టగానే తల్లిదండ్రులకు, యుద్ధ భూమిలో అర్జునుడికి కర్తవ్యబోధ చేశాడు. అందుకే శ్రీ కృష్ణుడిని ‘కృష్ణం వందే జగద్గురుమ్' అని పిలుస్తారు. కృపతత్వం అనేది అనంతమైనది. దాన్ని అర్థం చేసుకుంటేనే అందులోని మర్మం అవుతుందని చెబుతాడు.

కుచేలునితో స్నేహం..
ఎంతో కటిక పేదరికంతో బాధపడుతున్న కుచేలుని నుంచి కొన్ని అటుకులు తీసుకుని.. తనకు అంతులేని సిరిసంపదలు ప్రసాదించిన కృష్ణుడు ప్రేమతో, భక్తితో, తనకు ఏది సమర్పించినా ఆనందంగా స్వీకరిస్తానని చాటి చెప్పాడు.

మహా భారత యుద్ధంలో..
పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్దంలోనూ తన యుద్దనీతిని ప్రదర్శించాడు. అధర్మాన్ని అంతం చేసేందుకు ఎన్నో మాయలు చేశాడు. ఎన్నటికీ అసత్యమాడని ధర్మరాజు చేత ‘అశ్వత్థామ హతః కుంజర' అని చెప్పించాడు. కర్ణుడిని నిస్సహాయుడ్ని చేయడానికి విదురుడ్ని, భీష్ముడిని నిలువరించడానికి శిఖండిని ఉపయోగించాడు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత చెరువులో దాక్కున్న దుర్యోధనుడిని సంహరించడానికి సైతం ఎన్నో మాయలు చేశాడు. ఇలా చెప్పుకుంటూ శ్రీక్రిష్ణుడు పుట్టినప్పటి నుండి చేసిన లీలలు ఎన్నో.. ఎన్నెన్నో..



Click it and Unblock the Notifications