For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కృష్ణాష్టమి 2019, పూజా వేళలు, ప్రాముఖ్యత

కృష్ణాష్టమి పండుగ రోజున సూర్యుడు ఉదయించక ముందే తలస్నానం చేయాలి. పసుపు బట్టలు ధరించాలి. అనంతరం ఇంటిని, పూజ గదిని పరిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లో గుమ్మానికి పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టాలి.

|

What Is Sri Krishna Janmashtami || కృష్ణాష్టమి విశిష్టత పై ప్రత్యేక ఇంటర్వ్యూ..!! || Boldsky Telugu

మహా విష్ణువు అవతారాల్లో ఒక అవతరమైన కృష్ణుని అవతారం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కృష్ణాష్టమిని గోకుల అష్టమి లేదా అష్టమి రోహిణి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇంతటి మహిమాన్వితం అయిన కృష్ణాష్టమి రోజున పూజలు ఎలా చేయాలి, ఏమేమీ చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Krishnastami

కృష్ణాష్టమి పండుగ రోజున సూర్యుడు ఉదయించక ముందే తలస్నానం చేయాలి. పసుపు బట్టలు ధరించాలి. అనంతరం ఇంటిని, పూజ గదిని పరిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లో గుమ్మానికి పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టాలి. పూజ గదిలో రంగుల రంగుల ముగ్గులు వేయాలి.

సూర్యుడు ఉదయించక ముందే..

సూర్యుడు ఉదయించక ముందే..

కృష్ణాష్టమి పండుగ రోజున సూర్యుడు ఉదయించక ముందే తలస్నానం చేయాలి. పసుపు బట్టలు ధరించాలి. అనంతరం ఇంటిని, పూజ గదిని పరిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లో గుమ్మానికి పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టాలి. పూజ గదిలో రంగుల రంగుల ముగ్గులు వేయాలి.

శ్రీ కృష్ణుడు రాధతో కలిసి..

శ్రీ కృష్ణుడు రాధతో కలిసి..

ఆ తర్వాత పూజకు ఉపయోగించే పటాలకు లేదా ప్రతిమలకు పసుపు, కుంకుమ గంధం, పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి. శ్రీ కృష్ణుడు రాధతో కలిసి ఉన్న ఫొటోను లేదా ప్రతిమను పూజ గదిలో ఉంచాలి. దానికంటే ముందు అక్షింతలు, కదంబ పుష్పాలు, సన్నజాజులతో దండ, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలా పండ్ల వంటి వాటిని సిద్ధం చేసుకోవాలి.

"ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ:"

అనంతరం పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనెను పోసి, ఐదు దూది వత్తులతో దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు ఆవు నెయ్యితో చేసిన హారతిని సిద్ధంగా ఉంచుకోవాలి. మన నుదుటిపై సింధూరం ధరించి, తూర్పు దిక్కున తిరిగి, "ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే బాలకృష్ణ, శ్రీ కృష్ణ సహస్రనామములు, శ్రీ మద్భావతములతో శ్రీ కృష్ణుడిని స్తుతించవచ్చు. తర్వాత శ్రీ కృష్ణుడికి నైవేద్యాలు సమర్పించాలి. దీపారాధన గావించుకుని పూజను ముగించాలి.

కృష్ణాష్టమి రోజు ఉపవాసం

కృష్ణాష్టమి రోజు ఉపవాసం

కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉండి కేవలం ఒకపూట భోజనం చేసి శ్రీ కృష్ణుడికి పూజచేసి, శ్రీ కృష్ణుడి ఆలయాలను, గౌడీయ మఠాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతన్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించే వారి వంశం అభివృద్ధికి, వారికి అష్ట ఐశ్వర్యాలు దక్కుతాయని పురోహితులు చెబుతున్నారు. కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి వచ్చే మహిళలకు తాంబూలంతో పాటు శ్రీ కృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేయాలి. దీంతో మీకు సకల సంపదలు సిద్ధిస్తాయని చాలా మంది విశ్వసిస్తున్నారు.

తాళ్లపాక అన్నమాచార్యులు ఒక కీర్తనలో ఇలా..

తాళ్లపాక అన్నమాచార్యులు ఒక కీర్తనలో ఇలా..

మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమిని ఉట్ల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ కృష్ణుడి జన్మాష్టమిని గురించి మన తొలి తెలుగు

వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు.

"పైకొని చూడరె ఉట్ల పండుగ నేడు

ఆకడ గొల్లెతకు ననందం నేడు

అడర శ్రావణ బహుళ అష్టమి నేడితడు

నడురేయి జనియించినాడు చూడ గదరే

అరుదైన శ్రవాణ బహూళాష్టమి నాటి రాత్రి

తిరువవతారమెందును కృష్ణుడు

ఇరవై దేవకిదేవి యెత్తుకుని వసుదేవు

కరములందు బెట్టితే కడు సంతోషించెను"

ముందుగా అందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు.

English summary

Krishnastami 2019: date, puja time, significance

Pour coconut oil into the jasmine lamp and light the lamp with five cotton swabs. Prepare a garland made of cow ghee for liturgy. On our foreheads, we should recite the mantra "Om Sri Krishna Parabrahmane Nama:" 108 times, returning to the east. Similarly, Sri Krishna can be praised with Balakrishna, Sri Krishna millennials and Sri Madhbhava. Subsequent oblations should be submitted to Sri Krishna. The pooja must be completed by taking the liturgy.
Desktop Bottom Promotion