Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీరు కోటీశ్వరులు అయ్యేముందు ఇలాంటి కలలే వస్తాయంట.. ఎలా తెలుసుకోవాలంటే..!
సాధారణంగా మానవులందరూ కలలు కంటారు. కలల్లో కనిపించేవన్నీ కొన్నిసార్లు నిజమవుతాయని, మనం భవిష్యత్ కార్యాచరణను తెలియజేస్తాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని కలలు వస్తే భవిష్యత్‌లో కోటీశ్వరులు అవుతారని పేర్కొంటున్నారు. ఏ సమయంలో కలలు వస్తే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి, ఎన్ని రోజుల్లో నెరవేరతాయనేది కూడా స్వప్న శాస్త్రంలో ఉంటాయని తెలిపారు. అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
కోటీశ్వరులయ్యే కల ఎలా వస్తుందంటే..
మన పురాణాలతో పాటు ప్రస్తుతం మన సమాజంలో కలలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని పెద్దలు సైతం చెప్తూ ఉంటారు. అదే విధంగా ఎవరికైనా కలలో దేవుళ్ళు, దేవుళ్ళ ఆలయాలు, దేవుళ్ళ పటాలు కనిపించినా ఆ వ్యక్తి తొందరలోనే కోటీశ్వరుడు అవుతారట. అయితే ఆ కల నిజం అవ్వాలంటే మరుసటి రోజే.. కలలో కనిపించిన ఆ గుడికి వెళ్లి పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి రావాలట. ఇలా పూజ చేసి కొబ్బరికాయ కొట్టే వరకు ఆ కల గురించి ఎవరికీ చెప్పొద్దట. అప్పుడే ఆ కల నిజం అవుతుందని చెబుతున్నారు.

అలాగే ఎవరైనా చిన్న పిల్లకు కలలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్లు కనిపిస్తే అది శుభసూచకమని చెబుతున్నారు. త్వరలోనే ఆ ఇంటి యజమాని కోటీశ్వరుడు అవబోతున్నాడనే దానికి అది సంకేతమని పేర్కొంటున్నారు.
ఎవరికైనా కలలో జమ్మిచెట్టు కనిపిస్తే అతను త్వరలోనే రాజకీయాలను శాసించే అవకాశం ఉందని అర్ధమట. సమాజంలో మంచి హోదా దక్కడంతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్స్, చేస్తున్న పనిలో గౌరవం పెరుగుతుందట.
కలలో తెల్లగుర్రం కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని, విదేశాల్లో కోట్లకు కోట్లు డబ్బులు కోడగొడతాడనేదానికి సంకేతం అని చెబుతున్నారు. అలాగే కలలో తెల్ల ఏనుగు కనిపించినా.. వారికి విపరీత రాజయోగం పడుతుందని, అధికార బలం చేకూరనుందని అర్ధం చేసుకోవాలంట. అలాగే కలలో నీళ్లు కనిపించినా ధనయోగం పడుతుందనేదానికి సంకేతమని పేర్కొంటున్నారు.
కలలో పాములు కనిపిస్తే చాలా భయపడిపోతారు. ముఖ్యంగా తాచుపాము కనిపిస్తే ఎదో అయిపోతుందేమోననే భయాందోళన ఉంటుంది. అయితే తాచుపాము కనిపిస్తే చాలా మంచిదట. ఇది రాబోయే అదృష్టానికి, ధన సంపాదనకు సంకేతమని పేర్కొంటున్నారు. అలాగే కలలో పాము మనిషిపైకి ఎక్కినట్లు కనిపిస్తే అది అఖండ ధనయోగానికి సంకేతమని భావిస్తున్నారు.
కలలో ఎవరికైనా కొండ ఎక్కినట్టు కనిపించినా లేదా చెట్టు ఎక్కినట్టు, ఎద్దు ఎక్కినట్టు, ఏనుగు ఎక్కినట్టు కనిపించినా విపరీత రాజయోగం పడుతుందని, అలాగే జీవితంలో ఉన్నతశిఖరాలకు వెళ్తారనేదానికి సూచకమని పేర్కొన్నారు. అయితే కలలో ఏడుస్తున్నట్లు కనిపించినా, ఎవరైనా చనిపోయినట్లు కలలో వచ్చినా అది చాలా మంచిదని, అలా కనిపిస్తే వారికి దీర్ఘాయుస్సు కలుగుతుందని నమ్మకం అని చెబుతున్నారు.
సమాజంలో గుర్తింపు కోసం..
కలలో మిమ్మల్ని ఎవరైనా పెద్దలు దీవించినట్లు కనిపించినా సమాజంలో విపరీత గౌరవ మర్యాదలు పెరుగుతాయనేదానికి సంకేతమని చెబుతున్నారు. అలాగే సమాజంలో ప్రజా ప్రతినిథిగా ఎన్నికవుతారనే దానికి సంకేతమట.
అశుభ కలలు ఎలా ఉంటాయంటే..
కలలో పామును చంపినట్లు వచ్చినా, పక్షిని తింటున్నట్లు కనిపించినా అది అశుభమని చెబుతున్నారు. అలాగే చితిపైకి ఎక్కినట్లు కనిపించినా, ఇంద్రధనస్సు విరిగినట్లు వచ్చినా అశుభమనే చెప్పుకొస్తున్నారు. దీంతోపాటు ఆకాశం నుంచి సూర్యచంద్రులు విరిగిపడడం, భూఉత్పాతాలు జరిగినట్లు వచ్చినా మంచిది కాదట.
గమనిక: ఈ కథనంలో మేము పేర్కొన్న అంశాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవి కచ్చితమని మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications