Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Aghori: అఘోరీగా మారాలంటే ఏం చేయాలి? అఘోరీ చనిపోయాక మృతదేహాన్ని ఏం చేస్తారో తెలుసా..
భారతదేశపు అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగ మహా కుంభమేళా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమవగా..ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలో పాల్గొనేందుకు దేశ,విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగరాజ్ కి తరలివస్తున్నారు. మహాకుంభమేళా సమయంలో ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించడమే కాకుండా జీవితంలో సానుకూలత, ప్రశాంతత లభిస్తాయని భక్తుల విశ్వాసం.
త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు తొలిరోజు నుంచే పెద్ద సంఖ్యలో నాగ సాధువులు, అఘోరీలు, సన్యాసులు కూడా హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వీరు తమ పురాతన ఆచారాలను నిర్వహిస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వారి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అఘోరీలు ఎవరు, అఘోరీ అవ్వాలంటే ఏం చేయాలి, అఘోరీలు చనిపోయాక వారి మృతదేహాన్ని ఏం చేస్తారు వంటి అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అఘోరీలు ఎవరు
అఘోరీలు పురాతన భారతదేశానికి చెందినవారు.తరచుగా కబాలికుల వారసులు లేదా 'పుర్రెలు మోసేవారు'గా పరిగణించబడతారు. రోమన్ చరిత్రకారుడు మిర్సియా ఎలియట్ తన 1958 పుస్తకం యోగా: ఇమ్మోర్టాలిటీ అండ్ ఫ్రీడమ్‌లో అఘోరీలు శైవ సంప్రదాయాలతో లోతుగా అనుసంధానించబడి ఉన్నారని, వేల సంవత్సరాల నాటి పద్ధతులను సంరక్షించారని తెలిపారు.
చరిత్ర పరంగా
'అఘోరీ'అనే పదానికి "సరళమైనది" అని అర్థం. అయినప్పటికీ అఘోరీలు వారి అసాధారణ కార్యకలాపాల కారణంగా వీరిని సామాన్య ప్రజలు తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. 7వ శతాబ్దంలో హర్షవర్ధన చక్రవర్తి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్..ఎముకల దండలు ధరించి బూడిదలో నివసించే నగ్న సన్యాసుల గురించి వ్రాసాడు. అతను వారిని అఘోరి అని సూచించలేదు కానీ అతని ఈ వివరణలు నేటి అఘోరీల అభ్యాసాలను పోలి ఉంటాయి.
అఘోరీగా మారాలంటే ఏం చేయాలి?
అఘోరీగా మారడానికి జీవితంలో సరళతను స్వీకరించాలి, ద్వేషాన్ని త్యజించాలి,సామాజిక నిబంధనలను ఉల్లంఘించాలి. ఇతరులు అపవిత్రమైనవి లేదా నిషేధించబడినవిగా భావించే ప్రతిదానిలో దైవాన్ని చూడాలని వారు నమ్ముతారు.
మరణం తర్వాత అఘోరీ శరీరం ఏమవుతుంది
అఘోరీ ఆచారాలలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..వారు మరణంతో ఎలా వ్యవహరిస్తారు? సాధారణంగా హిందూమతంలో చనిపోయిన వారిని దహనం చేస్తారని మనకు తెలిసిందే. అయితే ఘోరీ సాధువు మృతదేహాన్ని భిన్నంగా వ్యవహరిస్తారు. మరణించిన తర్వాత అఘోరీ శరీరాన్ని తలక్రిందులుగా..తల క్రిందికి,పాదాలు పైకి ఉంచుతారు. మృతదేహాన్ని 40 రోజులు ఈ స్థితిలో ఉంచుతారు. తర్వాత డెడ్ బాడీ సగాన్ని పవిత్ర గంగలో ముంచబడుతుంది. అయితే తల ఆధ్యాత్మిక అభ్యాసాల కోసం భద్రపరచబడుతుంది. ఈ ఆచారం శరీరం నుండి ఆత్మ విభజన,జీవితం,మరణం శాశ్వతమైన చక్రం యొక్క అంగీకారాన్ని సూచిస్తుంది.
అఘోరీలు పూజించే దేవుడు
అఘోరీలు దత్తాత్రేయుడిని తమ మార్గదర్శక దైవంగా పూజిస్తారు. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు,శివుని పవిత్ర త్రిమూర్తుల అవతారంగా నమ్ముతారు. తంత్రం,మంత్రం దేవుడు అని పిలుస్తారు. దత్తాత్రేయుడు తరచుగా హిందూ కళలు,గ్రంథాలలో అఘోరీలను వారి తాంత్రిక పద్ధతులలో ప్రేరేపించే శాంతియుత, జ్ఞానోదయ వ్యక్తిగా చిత్రీకరించబడింది. దత్తాత్రేయుడు జ్ఞానం, శక్తి, కాఠిన్యం కలిగి ఉంటాడని చెబుతారు.



Click it and Unblock the Notifications
