Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
2025లో మహా కుంభమేళ జరిగే ప్రదేశాలు, తేదీలు ఇవే.. కుంభమేళాకు ఎలా వెళ్లాలంటే?
కుంభమేళాలు పన్నెడు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఈ కుంభమేళాలు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ సారి కుంభమేళా 2025లో వస్తుంది. పన్నెండు సంవత్సరాల తరువాత వస్తున్న ఈ కుంభమేళాను ఘనంగా జరిపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కోట్లలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కుంభమేళాలో స్నానాలు చేస్తే ఎంతో మంచిది అని భక్తులు విశ్వసిస్తారు కూడా.
అంత ప్రాముఖ్యత కలిగిన ఈ మహా కుంభమేళా 2025లో ఎప్పుడు జరుగుతుంది? ఏ ఏ తేదీల్లో ఏ ఏ ప్రదేశాల్లో ఈ కుంభమేళాను నిర్వహిస్తున్నారు? ఈ కుంభమేళా ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ స్టోరీలో కూలంకుషంగా తెలుసుకుందాం రండి.

2025 కుంభమేళా ఎక్కడ జరుగుతుందంటే?
పన్నెండు సంవత్సరాల తరువాత 2025లో ఈ కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళాను పుణ్య క్షేత్రాల్లో నిర్వహిస్తారు. ఇది ప్రయాగ్‌రాజ్‌లోని సంగం, హరిద్వార్‌లోని గంగా, ఉజ్జయినిలోని షిఫ్రా నదిలో, నాసిక్‌లోని గోదావరి నది వద్ద నిర్వహించనున్నారు.
కుంభమేళా ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే?
ఈ మహా కుంభమేళా 2025లో జనవరి 13వ తేదీన ప్రారంభమై 2025 ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరుగుతాయి. సుమారు ఒక నెల 13 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. కొన్ని కోట్లలో భక్తులు స్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకోనున్నారు. ఏ తేదీన ఎక్కడ కుంభమేళా జరుగుతుందో ఒకసారి పరిశీలిస్తే..
- జనవరి 13వ తేదీ 2025న - పౌష్ పూర్ణిమ స్నాన్
- జనవరి 14వ తేదీ 2025న - మకర సంక్రాంతి స్నానాలు
- జనవరి 29వ తేదీ 2025న - మౌని అమావాస్య స్నానాలు
- ఫిబ్రవరి 3వ తేదీ 2025న - వసంత పంచమి స్నానాలు
- ఫిబ్రవరి 12వ తడి 2025న - మాఘీ పౌర్ణిమ స్నానాలు
- ఫిబ్రవరి 26వ తేదీ 2025న - మహా శివరాత్రి స్నానాలు జరగనున్నాయి.
మహా కుంభమేళా ప్రాముఖ్యత ఇదే..
పన్నెండు సంవత్సరాల తరువాత వచ్చే ఈ మహాకుంభమేళాకు చాలానే ప్రాముఖ్యత ఉంది. ఈ మహాకుంభమేళా జరిగే సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు. ఇలా స్నానం చేయడం వల్ల ఒక వ్యక్తికి ఉండే రోగాలు, వ్యాధులు, పాపాల నుండి విముక్తి లభిస్తుందని పేర్కొంటారు. అలాగే భక్తులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, దైవానుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈ మహాకుంభ మేళాలో స్నానాలు చేయడానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మహాకుంభ మేళ పౌష్ పూర్ణిమ రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజున ముగుస్తుంది.



Click it and Unblock the Notifications