Makara jyothi: శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఎప్పుడు జరుగుతుందంటే? అసలైన సమయం ఇదే..

మకర సంక్రాంతిని దేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా వైభవంగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఈ పండగను చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ మకర సంక్రాంతి రోజున శబరిమలలో జ్యోతి దర్శనం జరుగుతుంది. అయ్యప్ప స్వామి భక్తులతో పాటు హిందువులందరికీ ఈ జ్యోతి దర్శనం అనేది అత్యంత ముఖ్యమైనది, పవిత్రమైనది కూడా. ఈ జ్యోతిని దర్శించుకునేందుకు లక్షల మంది వేచి ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు వెళ్తుంటారు.

పవిత్రమైన ఈ జ్యోతి దర్శనం అనేది అందరికీ కలిగే భాగ్యం కాదు. ఆ జ్యోతి దర్శనం కలగాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి. ఈ జ్యోతిని దర్శించుకోవాలంటే గంటల కొద్దీ లైన్లలో నిలబడాలి. అయినప్పటికీ జ్యోతి దర్శనం అవుతుందా లేదా అనేది స్పష్టమైన అవగాహన లేదు. అందుకే అసలు జ్యోతి దర్శనం ఏ సమయంలో చేస్తారు? ఏ సమయానికి వెళ్తే జ్యోతి దర్శనం జరుగుతుంది అనేది ఈ స్టోరీలో వివరించాము పూర్తిగా చదవండి.

Makara jyothi darshan exact timing in sabarimala Here are the every details you should know

మకరజ్యోతి దర్శనం ఎప్పుడు?

ఈ ఏడాది జనవరి 14న శబరిమలలో మకరజ్యోతి దర్శనం జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ 30 నుంచి ఈ సంవత్సరం జనవరి 20 వరకు ఈ మకరజ్యోతి యాత్ర జరుగుతుంది. అయితే జనవరి 14న అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారని ప్రతీతి.

జనవరి 14న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మూడుసార్లు జ్యోతి దర్శనం ఉంటుంది. శబరిమలకు వెళ్లిన ప్రతిఒక్కరూ దీనిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. శబరిమల నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు వద్ద కొండపై మకర జ్యోతి కనిపిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జ్యోతి దర్శనం జరుగుతుంది. ఈ జ్యోతి సూర్యాస్తమయం తర్వాత కొద్దిసేపటికే కనిపిస్తుంది. ఇది మూడుసార్లు కనిపిస్తుంది, ఆ తరువాత అదృశ్యమవుతుంది.

అయ్యప్ప జ్యోతి రూపంలో ఎందుకు దర్శనమిస్తాడు

పురాణాల్లో ప్రతి దానికి ఒక చరిత్ర ఉంటుంది. అలాగే సంక్రాంతి రోజున దర్శనమిచ్చే మకర జ్యోతికి కూడా ఓ చరిత్ర ఉంది. అదేంటంటే.. రాజుగా ఉండాల్సిన అయ్యప్ప స్వామి రాజభవనం నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో రాజ్యమంతా కన్నీరుమున్నీరుగా విలపించడం మొదలయ్యింది. దీంతో అయ్యప్ప స్వామి.. తాను పట్టాభిషేకం విరమించుకున్నంత మాత్రాన మీ సమస్యలను వినకుండా పోనని, శబరిమల కొండపై తాను నెలకొంటానని తెలిపారు. అలాగే సంక్రాంతి రోజున మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చి సమస్యలను విని, వాటిని పరిష్కరిస్తానని మాట ఇస్తారు. ఆ మాట ప్రకారం అయ్యప్ప స్వామి ప్రతి సంక్రాంతికి మకర జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు.

Story first published: Monday, January 13, 2025, 15:39 [IST]
Desktop Bottom Promotion