Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
మాండూక మందిరం దర్శిస్తే ఒక్క సంతామనం మాత్రమే కాదు, సంపందలు కూడా పొందుతారు..
హిందూ పురాణాలలో జంతువులకి ప్రత్యేక స్థానం ఉంది మరియు ఉత్తరప్రదేశ్ లో ఈ ఆలయం లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఉంది. ఇక్కడ ఒక కప్పను దీపావళి మరియు ఇతర సందర్భాలలో ఎంతో శ్రద్ధగా పూజిస్తారు. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఒక కప్ప రాజపుత్ రాజు భక్త్ సింగ్ జీవితాన్నే మార్చేసిందని.
భారతదేశంలో ఏకైక కప్ప ఆలయం ఇది మరియు ఇక్కడ దేవుడైన కప్ప రాజుని అన్ని సంపదలు, ఆరోగ్యకరమైన పిల్లలతో వరాలిచ్చి అతని జీవితం మార్చేసాడు.
మండూక్ మందిర్ అని పిలవబడే ఈ గుడిలోని గర్భగుడి తంత్ర విద్య ప్రకారం కప్ప విగ్రహం వెనక ఉన్న యంత్రంపైన కట్టబడి ఉంది.స్థానికులు ఈ 200ఏళ్ల క్రితం గుడిని దర్శిస్తే చాలు అన్ని సమృద్ధులు కలుగుతాయని భావిస్తారు. మహాశివరాత్రి మరియు శ్రావణసోమవారాలతో పాటు దీపావళి కూడా ఇక్కడ ప్రముఖంగా జరుపుకుంటారు.

నీమ్రాన వంశానికి చెందిన రాజా హర్దేవ్ సింగ్ కొడుకైన రాజా భక్త్ సింగ్ తర్వాత ఏడో తరానికి చెందిన ప్రద్యుమ్న్ నారాయణ్ దత్తాసింగ్ మాట్లాడుతూ,” ఈ ఆలయం తన నిర్మాణం,ఆత్మ ప్రకారం తంత్రంపై ఆధారపడి మంచి అదృష్టాలను తెస్తుంది.

తరతరాలుగా మేము దీని దీవెనల వలన హాయిగా జీవిస్తున్నాం.’ అని అన్నారు.
“కప్ప సంతానసాఫల్యానికి గుర్తు. అందుకని ప్రజలు ఈ గుడిని దర్శించాక సంతానాన్ని, మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. కప్పలు సంపదలను కూడా తెస్తాయి.”అని జతచేసారు.

ఈ ప్రత్యేక కప్ప గుడి ఓయెల్ పట్టణం, లఖీంపూర్ నుంచి సీతాపూర్ కి వెళ్ళే దారిలో లఖింపూర్ నుండి 11 కిమీల దూరంలో ఉంది. భారతదేశంలో మండూక తంత్రం ప్రకారం వెలిసిన ఏకైక ఆలయం ఇది.ఓయెల్ రాజ్య (లఖీంపూర్ ఖేరి జిల్లా) పూర్వ మహారాజు 1860 నుంచి 1870 మధ్య దీన్ని నిర్మించాడు. ఇది పరమశివునికి అంకితం చేసారు.
ఈ ఆలయాన్ని పెద్ద కప్ప విగ్రహం వెనకగా కట్టారు. అష్టాదళపద్మంలో మొత్తం ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాన్ని బానాసుర్ నర్మదేశ్వర్ నర్మదాకుండ్ దగ్గర నుంచి తెచ్చారు.ఆలయం ప్రధాన గేటు తూర్పున ఉంటుంది మరియు మరో గేటు దక్షిణంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం తంత్రవిద్య ఆధారంగా జరిగింది.

తాంత్రిక సంప్రదాయం అంటే ఏమిటి?
ప్రాచీన భారతదేశానికి చెందిన తాంత్రిక సంప్రదాయం హిందూ మరియు బౌద్ధమతాలపై పెద్ద ప్రభావం చూపింది.వేదకాలం ముందు సమయానికి చెందిన ఈ సంప్రదాయం స్త్రీశక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది( అమ్మవార్లకి అధిక ప్రాముఖ్యత ఉండేది). శక్తి(దేవి), ముఖ్యంగా కోపిష్టి రూపంలో ఈ సంప్రదాయంలో ఎక్కువ పూజించబడేవారు. అనేక ఆచారాలు కూడా దీనికోసం ఏర్పడ్డాయి. మండూక మందిరం లేదా కప్ప గుడి కూడా ఇదే తాంత్రిక సంప్రదాయాన్ని పాటిస్తుంది.

ఈ గుడికి ఎవరు వెళ్తారు?
సందేహమే లేదు, మండూక మందిరం భారతదేశంలో ప్రత్యేకమైన గుడి. కానీ మతపరంగా కూడా ఇది ప్రసిద్ధి చెందినది. కప్ప అదృష్టానికి, సంతానోత్పత్తికి సంకేతం. ఇక్కడికి వచ్చే జంటలకి ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు.చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భక్తులు చాలామంది ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. నర్మదేశ్వర్ ఆలయం శివరాత్రి, దీపావళి పండగల సమయంలో ఎక్కువ రష్ గా ఉంటుంది. అసాధారణ నిర్మాణంతో ఉన్న ఈ కప్ప ఆలయం, ఉత్తరప్రదేశ్ లో ప్రాచీన ఆలయాలలో ఒకటిగా ఉంది.ఈ గుడి చుట్టూ ఉన్న ధార్మికత,అద్భుతమైన నిర్మాణం యాత్రికులను అబ్బురపరుస్తుంది.
ఈ ప్రాంతాన్ని అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో మంచి వాతావరణంలో దర్శించుకోవచ్చు. లక్నోకి వెళ్ళి అక్కడనుండి రైలులో వెళ్ళవచ్చు. లక్నో నుంచి లఖీంపూర్ 135 కిమీల దూరంలో ఉంది. ఢిల్లీ నుండి ఖేరికి 425 కిమీల దూరం ఉంది.



Click it and Unblock the Notifications