Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Mauni Amavasya 2021:ఈ అమావాస్య రోజున ఏమి దానం చేస్తే శుభఫలితాలొస్తాయో తెలుసా...
మౌని అమావాస్యం రోజున ఏ పనులు చేయాలి.. ఏమి దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలో ఫిబ్రవరి 11వ తేదీన హిందువులకు చాలా ప్రత్యేకమైనది. హిందువులలో చాలా మంది ఈరోజున క్రిష్ణ పక్షంలో మౌని అమావాస్యను పండుగలా జరుపుకుంటారు. 'మౌని అమావాస్య' అంటే మౌన వత్రం పాటించడం అని చాలా మంది నమ్మకం.

ఈరోజునే మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున సాధువులు, యోగి గురువులు, ఇళ్లలో నివసించే మహిళలు మౌనవ్రతం పాటిస్తారు. ఈరోజున జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి, మాటలు అవసరం లేదని భావిస్తారు. ఎందుకంటే ఆరోజు మాట్లాడేందుకు లేదా ఏదైనా విషయం చెప్పేందుకు ఏమీ ఉండదని భావిస్తారు. ఆ పర్వదినాన నదీ స్నానాలు చేసి పిత్రు దేవతలను తలచుకుంటూ పిండ ప్రదానాలు చేస్తారు.

అసలు ఆరోజే ఎందుకు నదులల్లో స్నానాలు చేస్తారంటే ఆ పవిత్రమైన రోజున నదీ నీరు అమృతంలా మారిపోతుందట. అందుకే అందరూ ఆరోజు చాలా మంది నదులలో స్నానం ఆచరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఆ పవిత్రమైన రోజున అందరూ ఆందోళన తగ్గించేందుకు రుద్రాక్ష మాలను ధరిస్తారట. అలా చేస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. వీటన్నింటితో పాటు ఈరోజున కొన్ని వస్తువులను కచ్చితంగా దానం చేయాలి. అలా చేస్తే శుభఫలితాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మౌని అమావాస్య ప్రత్యేకత
హిందూ క్యాలెండర్ ప్రకారం, మహా శివరాత్రికి ముందు వచ్చేదే చివరి అమావాస్య. ఈ రోజు నిశ్శబ్దం మనస్సును అణచివేయగలదు, జ్ఞానాన్ని పెంచుతుంది మరియు మనస్సును ఉపశమనం చేస్తుంది. భగవద్గీత (అధ్యాయం 2.1) ప్రకారం, మానవ మనస్సు చాలా ఆలోచనలు మరియు పరధ్యానాలతో చాలా అలసిపోతుంది. ఈ రోజు నిశ్శబ్దం మీకు మనస్సులోని పదాలను నియంత్రించే శక్తిని ఇస్తుందని అంటారు.

పవిత్ర నదుల్లో..
ఈ మంత్రాన్ని జపించండి.. స్నానం సమయంలో ఈ మంత్రాన్ని జపించండి. ‘‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదా సింధు, కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు'' అనే మంత్రాన్ని పఠించండి. దీని వల్ల అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది.

ఏమి చేయాలంటే..
* సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉండాలి.
* ప్రవహించే నదిలో లేదా కాలువలో ఉదయాన్నే పవిత్ర స్నానం చేయాలి.
* ఈరోజంతా ఉపవాసం ఉండాలి.
* పేదలకు దానం చేయాలి.

ఏ వస్తువులను దానం చేయాలి?
మౌని అమావాస్య సంప్రదాయం ప్రకారం పట్టు, నల్ల వస్త్రం, నూనె, దుప్పటి, చెప్పులు, వెచ్చని బట్టలు మొదలైనవి మీకు అవసరమైన వారికి దానం చేయాలి. పాలు, బియ్యం, ధాన్యాలు దానం చేయవచ్చు.

దానం వల్ల ప్రయోజనాలు..
మీరు ఈరోజు విరాళం ఇస్తే, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజున పవిత్ర స్నానం చేసిన తరువాత మీకిష్టమైన దేవుడిని ఆరాధించండి మరియు తరువాత మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల పాపం నుండి విముక్తి లభిస్తుంది. అలాగే మీ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.

ఏమి చేయకూడదంటే..
* సమాధి చుట్టూ నడవకండి
* ఇంట్లో పెద్దలను, పేదవారిని అవమానించొద్దు.
* మీ జీవిత భాగస్వామితో శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి.
* ఈరోజున మీరు మాంసం తినకూడదు, శాఖాహారాలు మాత్రమే తినాలి.
* మద్యం, పొగతాగడం వంటి వాటికి దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications