Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Kumbh Mela 2025: కుంభమేళా నుంచి తప్పక తేవాల్సిన వస్తువులు ఇవే.. అప్పుడే దైవానుగ్రహం కలుగుతుంది!
కుంభమేళాకు వేళయ్యింది. ఇంకో నెలలో మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఇప్పటికే కుంభమేళాకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో ఈ కుంభమేళా జరగనుంది. 12 సంవత్సరాల తరువాత కుంభమేళా వస్తుడడంతో ప్రజలందరూ ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మత సేవకులు, సన్యాసులు, అఘోరీలతో సహా లక్షలాది మంది భక్తులు పాల్గొని మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఈ కుంభమేళాలో పాల్గొనాలనేది ప్రతి హిందువు యొక్క కల. ఈ కుంభమేళాలో పాల్గొంటే సర్వ శక్తులు లభించించడంతో పాటు మోక్షం కలుగుతుందని విశ్వసిస్తారు. అయితే ఈ కుంభ మేళాలో పాల్గొన్న వ్యక్తులు అక్కడి నుంచి కొన్ని వస్తువులను తీసుకెళ్తారు. ఆ వస్తువులు తీసుకోవడం వల్ల అనేక విధాలుగా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. అసలు అక్కడి నుంచి ఎలాంటి వస్తువులు తీసుకుంటే మంచిది? వాటి వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గంగాజలం:
కుంభమేళాలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తుడు గంగాజలం తీసుకొస్తుంటారు. గంగాజలం అత్యంత పవిత్రమైనది. ఇక్కడికి వచ్చేవారు గంగాజలాన్ని ఇంటికి తీసుకువెళతారు. ఇంట్లో గంగాజలం చల్లితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకం.
మట్టి
కుంభమేళాలో పాల్గొనే సందర్శకులు తమ వెంట త్రివేణి సంగమం నేల తీసుకెళ్తుంటారు. ఈ ప్రదేశంలో గంగా, యమునా, సరస్వతి నదులు కలుస్తాయి. కాబట్టి ఇక్కడి నేల దైవిక శక్తి కలిగిన నేల. అందుకే అక్కడి నెల మట్టిని తీసుకెళ్తుంటారు.
శివలింగం
కుంభమేళాలో పాల్గొనే భక్తులు శివలింగాన్ని తీసుకొని దేవత గదిలో పూజిస్తారు. దేవుళ్ళ గదిలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది. ఇంట్లో ఆనందం మరియు శాంతి నెలకొంటుంది.
తులసి:
తులసిని కుంభమేళా నుండి కూడా తెస్తారు. మన ఇంట్లో నాటడానికి, సులభంగా తీసుకురావడానికి అనుకూలమైన చిన్న మొక్కలను తెస్తారు. తులసిని తెచ్చి ఆ తులసిని మన ఇంట్లో నాటి ప్రతిరోజూ చూసుకుంటే ఆ ఇంట మంచి జరుగుతుందని నమ్మకం.
ప్రసాదం:
అన్ని మతపరమైన ప్రదేశాల్లాగే ఇక్కడ కూడా ప్రసాదం లభిస్తుంది. ఇంటికి తెచ్చి ప్రసాదం పంచుతారు. ప్రసాదాన్ని తీసుకొచ్చి కుటుంబాలకు అందజేస్తే ఆ ఇంట్లో శుభం కలుగుతుందని విశ్వాసం.
కుంభమేళా ఎప్పుడంటే?
ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా జరగనుంది. ఇప్పటికే చాలా మంది సాధువులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈసారి కుంభమేళాకు గంగాపురి మహారాజు రానున్నారు. అతన్ని ఛోటాబాబాగా పిలవనున్నారు. అతను గత 32 సంవత్సరాలుగా గణనీయమైన సాధన కోసం ధ్యానం, పూజలు చేస్తున్నాడు.



Click it and Unblock the Notifications