Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
వేడి నీటిని చల్లగా మార్చేస్తున్న వెంకటేశ్వర స్వామి.. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే వేంకటేశ్వరుడు మీ జీవితా
మన దేశంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆలయాలకు సంబంధించిన వింతలు, సైన్స్‌కు కూడా అంతుచిక్కని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. మన దేశంలోని వింతలు కేవలం శాస్త్రవేత్తలనే కాకుండా యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి విషయాలు, విగ్రహాలు చాలానే ఉన్నాయి.
అలాంటి విగ్రహం గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కర్ణాటకలోని గబ్బూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలోని విగ్రహం వేడి నీటిని కూడా చల్లగా మార్చేస్తుంది. అభిషేకం చేసే సమయంలో స్వామివారి విగ్రహంపై నీళ్లు పోస్తే ఆ నీరు స్వామివారి పాదాలకు చేరుకోగానే చల్లగా మారిపోతున్నాయి. అలాగే ఎన్నో విశేషాలు ఈ విగ్రహంలో దాగి ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రహస్యమైన మాయా విగ్రహం
వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ దైవంగా చెప్పుకుంటారు. ఆపద సమయాల్లో ఆదుకునే దేవుడిగా వేంకటేశ్వరుడి పేరుంది. ఎన్నో మహిమలు కలిగిన వేంకటేశ్వరుడిని ఈ కలియుగంలో కొన్ని కోట్లాది మంది భక్తులు ఆరాధిస్తుంటారు. అలాంటి వేంకటేశ్వరుడు తన విగ్రహంతో ఇప్పుడు మాయ చేస్తున్నారు. కర్ణాటకలోని గబ్బూరులో గల ఈ విగ్రహం మొత్తం ఆభరణాలతో నిండి ఉంటుంది. విచిత్రంగా విగ్రహం నడిబొడ్డున కూడా స్వామి వారిని అలంకరించి ఉంటారు. ఈ విగ్రహానికి ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని, విగ్రహం చుట్టూ ఒక కాంతి ప్రకాశిస్తూ ఉంటుందని, విగ్రహానికి రహస్య శక్తులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.
విగ్రహ శక్తులు ఎలాంటివంటే?
సాధారణంగా దేవుళ్ళ విగ్రహాలకు అభిషేకాలు చేస్తూ ఉంటాము. అయితే ఈ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి అభిషేకం చేసినప్పుడు అతీత శక్తులు మనకు దర్శనమిస్తాయి. స్వామి వారికి వేడినీళ్ళతో అభిషేకం చేసినప్పుడు తలపైన పోసిన నీరు పాదాల వద్దకు చేరుకోగానే చల్లగా మారిపోతాయట. అభిషేకం తరువాత తలను తాగితే వేడిగా, పాదాలను తాకితే చాలా చల్లగా అనిపిస్తాయట. అదే ఆ వేడినీళ్లను నేరుగా స్వామివారి పాదాలపై పోస్తే మాత్రం వేడిగానే ఉంటాయని చెబుతున్నారు. ఇది ఒక అద్భుతమని కలియుగ దైవం వేంకటేశ్వరుడి లీల అని భక్తులు నమ్ముతున్నారు.
ఇంకొక అద్భుతం..
అయితే కొందరు తలపై నుంచి నీరు పోసినప్పుడు పాదాలకు చేరుకోగానే చల్లగా మారడంలో వింత ఏముందని అనుకుంటారు. కానీ ఈ విగ్రహానికి మరొక మహిమ కూడా ఉంది. వేడి నీటిని తలపై పోసినప్పుడు మాత్రమే నీళ్లు చల్లగా మారుతున్నాయి. తలపై కాకుండా నాభి దగ్గర నుంచి లేదా చాతి దగ్గర నుంచి నీళ్లు పోస్తే అలానే ఉంటున్నాయి. ఇది సైన్స్‌కు అంతుచిక్కని విశేషం.
అవిశ్వాసులు ఏమంటున్నారంటే?
స్వామి వారి భక్తులు, కలియుగ దేవుడు వేంకటేశ్వరుడి లీలలు తెలిసిన వ్యక్తులు ఈ అద్భుతాన్ని నమ్ముతున్నారు. కానీ కొందరు వ్యక్తులు దీనిని నమ్మడం లేదు. ఆ విగ్రహం తయారు చేసిన రాయికి వేడిని గ్రహించే శక్తి ఉందని, ఆ రాయి వల్లే వేడినీళ్లు చల్లగా మారుతున్నాయని చెబుతున్నారు. అతి కేవలం రాతి లక్షణమని, దేవునికి ఎలాంటి శక్తి లేదని పేర్కొంటున్నారు. కానీ చాలామంది భక్తులు మాత్రం ఇది ఆ వేంకటేశ్వరుడి మహిమే అని పేర్కొంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications