For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Narada jayanti 2021: నారదుడు ఎలా జన్మించాడో తెలుసా...!

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, నారద ముని వైశాఖ మాసంలోని క్రిష్ణ పక్షంలో జన్మించాడు. నారద ముని శ్రీమహా విష్ణువు యొక్క గొప్ప భక్తుడు.

పురాణాల ప్రకారం నారదుడిని బ్రహ్మ కుమారునిగా భావిస్తారు. ఈ మహర్షి దేవతల మధ్య సంధానకర్తగా వ్యవహరించేవాడు. అందుకే అతన్ని విశ్వం యొక్క తొలి జర్నలిస్టు అని పిలవడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని పండితులు చెబుతుంటారు.

ఈ సందర్భంగా 2021 సంవత్సరంలో నారద మహర్షి జయంతి, పవిత్ర సమయం మరియు ఆరాధన పద్ధతులు, ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నారద జయంతి తేదీ..

నారద జయంతి తేదీ..

2021 సంవత్సరంలో నారద జయంతి 27వ తేదీన జరుపుకుంటారు. నారద జయంతి 26వ తేదీ సాయంత్రం 4 గంటల 43 నిమిషాలకు ప్రారంభమై 2021 సంవత్సరంలోని మే 27వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ముగుస్తుంది.

నారదుని ఆరాధన పద్ధతులు..

నారదుని ఆరాధన పద్ధతులు..

- నారద జయంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

- తర్వాత పవిత్ర జలాల్లో స్నానం చేయాలి. ప్రస్తుతం కోవిద్ మహమ్మారి ఉన్నందున ఇళ్లలో స్నానం చేస్తే సరిపోతుంది.

- ఈరోజున శ్రీ మహా విష్ణువు విగ్రహాన్ని ఆరాధించాలి.

- ఈ స్వామి వారికి గంధపు చెక్క, ధూపం కర్రలు, తులసి ఆకులు, కుంకుమ, పువ్వులు మరియు పండ్లను, సమర్పించాలి.

- ఒక దీపం వెలిగించి విష్ణు మంత్రాలను పఠించాలి.

- పూజ చేసిన తర్వాత బ్రాహ్మాణులకు, ముఖ్యంగా పేదలు, పెద్ద వయసు వారికి ఆహారం ఇవ్వాలి. అలాగే అవసరమైన వారికి దానం చేస్తే ప్రయోజనం కూడా ఉంటుంది.

నారద జయంతి ప్రాముఖ్యత..

నారద జయంతి ప్రాముఖ్యత..

- హిందూ గ్రంథాలు మరియు పౌరాణిక కథనాల ప్రకారం, నారదుడు కేవలం భూలోకానికే పరిమితం కాలేదు. స్వర్గ లోకం మరియు నరక లోకం అనే మరో రెండు లోకాల్లోనూ ప్రయాణించేవాడు.

-తను ఏ ప్రదేశంలో అయినా కనిపించి సర్వశక్తిమంతుని సందేశాలను అందించగలడు.

- నారద మహర్షిని బ్రహ్మ కుమారుడని నమ్ముతారు.

- నారద ముని విష్ణువు యొక్క గొప్ప భక్తుడని చాలా మంది విశ్వాసం.

- ప్రజలు నారద ముని ఆలయాలను సందర్శించి, ఆయన కథలు వింటూ, విష్ణువును ఆరాధించడం ద్వారా నారద జయంతిని జరుపుకుంటారు.

- నారద ముని దేవాలయాలు తక్కువగా ఉన్నప్పటికీ, అందులో ముఖ్యమైనది కర్నాటకలోని దావణగిరి సమీపంలో ఉంది.

ఉపవాస ఫలాలు..

ఉపవాస ఫలాలు..

శ్రీ నారద మహర్షి దేవతలలోనే కాదు.. అసరుల చేత కూడా గౌరవించబడ్డాడు. అందుకే నారదుడిని ముల్లోకాలు ప్రయాణించే గొప్పవాడిగా భావించేవారు. నారద జయంతి రోజున నారదుని ఆరాధించడం వల్ల బలం, తెలివితేటలు, జ్ణానం మరియు శక్తీ, ఆశీర్వాదం లభిస్తుంది. ఈరోజున ఉపవాసం ఉండటం ద్వారా మీరు పూర్తి ఫలాలను పొందుతారు.

నారదుని కథ..

నారదుని కథ..

పురాణాల ప్రకారం.. నారదుడు పుట్టినప్పటి నుండి తన అందాన్ని చూసుకుని చాలా గర్వపడేవాడు. ఒకరోజు వనదేవతలు న్రుత్యం చేస్తూ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అప్పుడు ఉప్బర్ణ(నారదుడు) మహిళా వేషంలో అక్కడికి వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు నారదుడిపై కోప్పడతాడు. దీంతో తనను ‘శూద్ర యోని'లో జన్మించాలని శపించాడు. ఈ కారణంగా ఉపబారన్ ఒక శూద్ర కుమారునిగా జన్మిస్తాడు. తన తల్లి ఐదేళ్ల వయసులోనే మరణించింది.

ధ్యానం చేస్తుండగా..

ధ్యానం చేస్తుండగా..

అలా తన తల్లి మరణించిన తర్వాత, తను దేవుని భక్తుడిగా మారాడు. ఓ చెట్టు కింద ద్యానం చేస్తున్నప్పుడు, తనకు దేవుని దర్శనం లభించిందని పండితులు చెబుతారు. దీని తర్వాత దేవుడి గురించి తెలుసుకుని తనని చూడాలనే కోరిక కలుగుతుంది. తను నిరంతర కఠిమైన దీక్ష వల్ల మరుసటి జన్మలో తనకు ఆ అవకాశం లభిస్తుంది. అందుకే ఈ బిడ్డను బ్రహ్మకుమారుడు, నారదముని అని పిలుస్తారు.

ఇక్కడ ఇవ్వబడిన సమాచారం పురాణాలు, చరిత్ర ప్రకారం ఇస్తున్నది. వీటితో పాటు ఇంటర్నెట్లో దొరికిన సమాచారం.. మాకు ఉన్న పరిజ్ణానంతో జోడించి రాసినది.

English summary

Narada Jayanti 2021 Date, Puja Vidhi, History and Significance in Telugu

Here we are talking about the Narada Jayanti 2021 Date, Puja Vidhi, History and Significance in Telugu. Read on