Just In
- 2 hrs ago
ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట...!
- 4 hrs ago
ఆల్కహాల్ వల్ల బ్లడ్ షుగర్ లో వచ్చే మార్పును ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకోండి!
- 4 hrs ago
Carbide Free Mangoes:మామిడిలో కార్బైడ్ కలిసిందా లేదా అనేది ఇలా కనిపెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...
- 5 hrs ago
మీ భర్తలోని 'ఈ' లక్షణాల వల్ల మీరు సమస్యల్లో చిక్కుకోవచ్చు...!
Don't Miss
- News
కిన్నెర మొగులయ్య మనస్థాపం: పద్మ శ్రీ వెనక్కి ఇచ్చేస్తా, బీజేపీ నేతలు బదనాం చేస్తున్నారు..
- Sports
బ్యాటింగ్ ఎంచుకోవడానికి కారణమేంటో చెప్పిన హార్దిక్.. ఆర్సీబీ టీం నుంచి సిరాజ్ ఔట్
- Movies
RC15 : రామ్ చరణ్ మరో న్యూ లుక్ వైరల్.. శంకర్ ప్లాన్ మామూలుగా లేదు!
- Technology
ఈ కోడ్ల సాయంతో మీ మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనవచ్చు
- Automobiles
హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?
- Finance
ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి, ఎల్ఐసీ స్టాక్ మరింత డౌన్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Narasimha Jayanti 2022: నరసింహ జయంతి రోజున ఈ పనులు చేస్తే.. శత్రువుల బాధ తొలగిపోతుందట...!
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో చతుర్దశి రోజున జరుపుకుంటారు.
ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు నరసింహుని అవతారంలో వచ్చి హిరణ్య కశిపుని సంహరించాడు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో మే 14వ తేదీన అంటే శనివారం నాడు నరసింహ జయంతి వచ్చింది. ఈరోజున దేశవ్యాప్తంగా నరసింహ స్వామి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.
ఈ స్వామి వారు ఎల్లప్పుడూ శక్తి మరియు విజయంతో సంబంధాలను కలిగి ఉంటాడు. ఈ స్వామి వారిని పూజించి, నరసింహ జయంతి వ్రతం ఆచరించిన వారికి ఈ భగవంతుని అనుగ్రహం లభించడమే కాదు.. బాధలన్నీ తొలగిపోయి.. శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా నరసింహ స్వామి జయంతి రోజున పాటించాల్సిన ఆచారాలు, నరసింహ కథ, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
Lunar
Eclipse
May
2022
Astrology
:ఈ
ఏడాది
తొలి
చంద్ర
గ్రహణం
వేళ
ఈ
రాశులకు
చాలా
కష్టాలు...!

నరసింహ జయంతి తేదీ..
ఈ సంవత్సరం, నరసింహ జయంతి 2022 మే 14వ తేదీన అంటే శనివారం రోజున వచ్చింది. నరసింహ జయంతి రోజున ఉపవాసాలను పాటించే నియమాలు, మార్గదర్శకాలు ఏకాదశి ఉపవాసంతో సమానంగా ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున మధ్యాహ్ సమయంలోనం నరసింహ స్వామిని పూజించాలి మరియు సూర్యాస్తమయం ముందు నరసింహ పూజలు చేయాలి. నరసింహ స్వామి సాయంత్రం కనిపించినందున, ఆ సమయంలో ఆరాధించడం వల్ల ఆ స్వామి వారి ఆశీర్వాదాలు మెండుగా లభిస్తాయని పండితులు చెబుతారు.

పూజా విధానం..
నరసింహ స్వామి జయంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. అనంతరం ఉతికిన బట్టలు వేసుకుని లక్ష్మీదేవి మరియు నరసింహ స్వామి చిత్రపటాలు లేదా విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు చేయాలి. పూజ అనంతరం కొబ్బరికాయ, మిఠాయిలు, పండ్లు, కుంకుమ, పువ్వులు సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున నువ్వులు, బట్టలు, ఆహారం మరియు విలువైన లోహాలను అవసరమైన దానం ఇస్తే బాధలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలొస్తాయి. అంతేకాదు స్వామి వారి నుండి శ్రేయస్సు, ధైర్యం మరియు విజయం లభిస్తాయని నమ్ముతారు.

నరసింహ స్వామి మంత్రాలు..
స్వామి వారి అనుగ్రహం పొందేందుకు నరసింహ స్వామి మంత్రాలను పఠించాలి.'ఓం నమో నారసింహాయ' అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు పెద్దలు. - 'నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్' అంటూ నృసింహ గాయత్రిని జపిస్తూ ఉన్నా ఎటువంటి అనారోగ్యం, ఆపదల నుంచైనా విముక్తి లభిస్తుంది. అంతేకాదు శత్రువుల బాధ కూడా తొలగిపోతుందని పండితులు చెబుతారు. అలాగే నరసింహ మూర్తి వివిధ రూపాల్లో చిత్రీకరించబడింది. నరసింహ స్వామికి విభిన్న వ్యక్తీకరణలు మరియు ఆయుధాలతో 74 కంటే ఎక్కువ రూపాలు ఉన్నాయి. నరసింహ యొక్క 9 ప్రధాన రూపాలను నవనరసింహ అని పిలుస్తారు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి: ఉగ్ర నరసింహ, క్రోటా నరసింహ, వీర నరసింహ, విలంబ నరసింహ, కోపా నరసింహ, యోగ నరసింహ, అగోరా నరసింహ, సుదర్శన నరసింహ.
మీ
పర్సులో
ఇవి
కచ్చితంగా
ఉండేలా
చూసుకోండి...
ఎందుకంటే
ఆర్థిక
సమస్యలను
అధిగమించొచ్చు...!

నరసింహ జయంతి కథ..
శ్రీ మహా విష్ణువు దశావతరాల్లో చాలా ముఖ్యమైన, శక్తివంతమైన అవతారం నరసింహ స్వామి అవతారం. నరసింహస్వామి శరీరం సగ భాగం మనిషి ఆకారం, సగ భాగం సింహ రూపంలో దర్శనమిస్తారు. హిరణ్యకశిపుని వరాన్ని కోరిక మేరకు స్వామి వారు ఈ రూపంలో అవతరించారని పురాణాల ప్రశస్తి. పురాణాలలో పూర్వం కశ్యపుడనే ఒక మహర్షికి భార్య దితి, ఇద్దరు కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఉండేవారు. విష్ణుభగవానుడు లోకకళ్యాణార్ధం రాక్షసుడైన హిరణ్యాక్షుడుని సంహరించాడు. ఇది భరించలేని సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తితో వైరం పెంచుకున్నాడు. కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు తీవ్ర తపమొనర్చి బ్రహ్మను ప్రత్యక్షం గావించుకొన్నాడు. బ్రహ్మ వలన చావులేని వరం పొందిన హిరణ్యకశిపుడు అన్ని లోకాలను శాసించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే దేవతలను, మునులను, ఋషులను బాధ పెట్టాడు. చివరకు దేవలోకంలో ఇంద్రునితో సహా అందరు నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలను భరించాల్సి వచ్చింది.

ప్రహ్లదుని భక్తి..
ఆ సమయంలో హిరణ్యకశిపుని భార్య కయధు మగపిల్లవాడు ప్రహ్లాదుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తులు నచ్చలేదు. అతడు పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు. హిరణ్యకశిపుడు శతవిధాల ప్రహ్లాదుడిని విష్ణుభక్తి నుండి మరల్చుదామని ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమౌతూనే వచ్చాడు. తండ్రి ప్రయత్నిస్తున్నకొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ అయ్యింది. ప్రహ్లాదుడిని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా లోయలో పడేసినా, ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తు ఉండేవాడు. ప్రహ్లాదుని నారాయణ మంత్రం విన్న సమయంలో కోపంతో ఊగిపోయిన హిరణ్యకశిపుడు తన కుమారుని పరిపరివిధాల మృత్యు సమీపానికి దండించే నిమిత్తం శిక్షలు వేయసాగాడు. ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు. ఇందుగలడని అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి అని చెబుతాడు ప్రహ్లాదుడు. దాంతో మరింత ఆగ్రహావేశాలకు లోనైన హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉంటాడా నీ శ్రీ హరి అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పడగొడతాడు.

నరసింహావతారం..
ఆ సమయంలో శ్రీ విష్ణుమూర్తి నరసింహుని అవతారంలో ఓ వైపు మనిషి రూపంలో మరోవైపు తల భాగంలో సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పరుండబెట్టి ఆయన తన గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని అంతమొందిస్తాడు. ప్రహ్లాదుని ఆశీర్వదించి ఎవరైతే ఈరోజున నా నామసంకీర్తనతో ఉపవాసం ఉంటారో వారి సమస్యలు, బాధలు తొలగిపోతాయి అని చెబుతారు. ఈ పవిత్రమైన రోజునే నరసింహ జయంతిగా జరుపుకుంటున్నాం.