For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవగ్రహాలు - హిందూ జ్యోతిష్యశాస్త్రంలోని తొమ్మిది గ్రహాల దేవతలు

హిందూమతంలో,ఆచారాలలో నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్ణయించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని నమ్ముతారు…

|

హిందూమతంలో,ఆచారాలలో నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్ణయించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని నమ్ముతారు…

హిందూమతంలో,ఆచారాలలో నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్ణయించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని నమ్ముతారు. ఈ నవగ్రహాలు సూర్యుడు, చంద్రుడు, మంగళ ( కుజుడు), బుధుడు, బృహస్పతి(గురుగ్రహం), శుక్ర (శుక్రుడు) ,శని, రాహువు (ఉత్తర మరుగుజ్జు బిలం) మరియు కేతువు(దక్షిణ మరుగుజ్జు బిలం). ఈ తొమ్మిది గ్రహాలు మనుషుల జీవితాలను నియంత్రిస్తాయని, జీవితంలో ఎదుర్కొనే మంచి చెడులను నిర్ణయిస్తాయని నమ్ముతారు.

Navagrahas – 9 Planetary Deities in Hindu Astrology

ఈ నవగ్రహ దేవతల గురించి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

సూర్యుడు- సూర్య భగవానుడు

సూర్యుడు- సూర్య భగవానుడు

తూర్పువైపు తిరిగి ఉండే నవగ్రహాలలో సూర్యుడు మధ్య స్థానంలో ఉంటాడు. రవి అని కూడా పిలవబడే సూర్యుడు సింహరాశికి అధిదేవుడు. సూర్యుడి వాహనం ఏడు గుర్రాలు నడిపే రథం. ఈ ఏడు గుర్రాలు ఇంద్రధనుస్సులోని రంగులు (తెల్లటి కాంతిలోని ఏడురంగులు) మరియు వారంలో ఏడురోజులకు ప్రతీక. ఆయన రోజు రవివారం లేదా ఆదివారం, రంగు ఎరుపు మరియు రత్నం కెంపు. మంచి ఆరోగ్యకరమైన జీవితానికి సూర్యనమస్కారాలు చేయటం మంచిది. ఒరిస్సాలోని కోణార్క్ ఆలయం మరియు తమిళనాడులోని కుంభకోణం వద్దనున్న సూర్యనార్ కోవిల్ సూర్యుడికి సంబంధించి దేశంలో రెండు ముఖ్య ఆలయాలు.

చంద్రుడు- చంద్ర భగవానుడు

చంద్రుడు- చంద్ర భగవానుడు

చంద్రుడు రాత్రి దేవుడు, సోముడు అని కూడా పిలవబడతాడు. చంద్రుడు మనస్సును, స్త్రీత్వాన్ని, అందాన్ని మరియు ఆనందానికి ప్రతీక. ఆయన ప్రతి రాత్రి పది గుర్రాలు లేదా లేడి నడిపే రథంపై ఆకాశంలో విహరిస్తాడని భావిస్తారు. చంద్రుడిని నిషధిపతి మరియు క్షుపారక అని కూడా అంటారు. చంద్రదేవుడు సంతానసాఫల్యతకి దేవుడు. కర్కాటక రాశికి అధిదేవుడు. ఒక వ్యక్తి మానసిక స్థితి, ఆరోగ్యం జాతకచక్రంలో చంద్రుడి స్థానంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. సోముడు కావడం వలన తన రోజు సోమవారం, మరియు రత్నం ముత్యం. తమిళనాడులోని తంజావూర్ వద్దనున్న తింగలూర్ కాలియసనాథార్ ఆలయం మన దేశంలోని ముఖ్య చంద్ర ఆలయాలలో ఒకటి.

మంగళ – కుజగ్రహం

మంగళ – కుజగ్రహం

అంగారకుడుగా కూడా పిలవబడే మంగళ దేవుడు నాలుగు చేతులతో ఉగ్రంగా కన్పించే దేవత. ఈయనను పృథ్వీ లేదా భూమికి కొడుకుగా భావిస్తారు. కుజగ్రహాన్ని వేడిగా ఉండే గ్రహంగా మరియు ధర్మానికి రక్షకుడిగా భావిస్తారు. ఆయన తన రెండు చేతులలో ఆయుధాలతో మరియు మరో రెండు చేతులు అభయ, వరద ముద్రలు కలిగి ఉంటాయి. మేషరాశి (మేదం) మరియు వృశ్చిక రాశులు(వృశ్చిగం)(ఏరిస్ మరియు స్కార్పియో రాశులు) మంగళ లేదా కుజ గ్రహం ఆధీనంలో ఉంటాయి. ఆయన కండరాల వ్యవస్థ, ముక్కు, నుదురు, రక్తప్రసరణ వ్యవస్థలను నియంత్రిస్తాడు. అతని వాహనం ర్యామ్ (ఒక రకమైన గొర్రె) మరియు రంగు ఎరుపు. వారం మంగళవారం మరియు రత్నం పగడం. తమిళనాడులోని సిర్కఝి వద్ద నున్న పుల్లిరుక్కువేలూర్ వైదీశ్వరన్ కోయిల్ కుజ గ్రహానికి చెందిన ప్రముఖ ఆలయాలలో ఒకటి.

బుధుడు –బుధ గ్రహం

బుధుడు –బుధ గ్రహం

బుధుడు సాధారణంగానాలుగు చేతులు, మూడు చేతులలో కత్తి, డాలు మరియు గద ఉంటాయి మరియు నాలుగవది సాధారణంగా కన్పించే వరద ముద్రలో ఉంటుంది. ఆయన కార్పెట్ లేదా గద్ద లేదా సింహాలు నడిపే రథంపై దర్శనమిస్తారు. బుధుడు మేధస్సుకి మరియు సమాచారానికి ప్రతీక. ఈ గ్రహం నాడీవ్యవస్థను నియంత్రిస్తుంది. ఆయన రంగు ఆకుపచ్చ మరియు బుధవారం ఆయనరోజు. రత్నం పచ్చమరకతం. మిథున రాశి మరియు కన్యారాశులకి బుధుడు అధిదేవుడు. తమిళనాడులోని సిరికంజి వద్దనున్న తిరువెంకడు శ్వేత్రాణ్యేశ్వరర్ ఆలయం మనదేశంలోని బుధుడి గుడులలో ప్రముఖమైనది.

బృహస్పతి – గురుగ్రహం

బృహస్పతి – గురుగ్రహం

బృహస్పతిని బ్రాహ్మణస్పతిగా కూడా అంటారు. దేవతల గురువు అయిన గురుదేవుడిని రుగ్వేదంలో చాలా ప్రశంసించారు. బృహస్పతి పసుపు లేదా బంగారు రంగులో ఉండి, చేతిలో ఒక కర్ర, కమలం మరియు జపమాలతో కన్పిస్తారు. గురుగ్రహం జ్ఞానం, ప్రేమ మరియు ఆధ్యాత్మికతకి గుర్తు. ఈ గ్రహం తొడలు, మాంసం, కిడ్నీలు, కాలేయం, కొవ్వు మరియు రక్తప్రసరణ వ్యవస్థలను నియంత్రిస్తుంది. బృహస్పతి వారం గురువారం మరియు రత్నం నీలం. ధనూరాశి మరియు మీనరాశులకు గురుగ్రహం అధిదేవుడు. భారతదేశంలో ప్రసిద్ధ బృహస్పతి ఆలయాలలో ఒకటి తమిళనాడులోని కుంభకోణం వద్దనున్న అలన్గుడి అభత్సహాయేశ్వర్ ఆలయం.

శుక్రుడు- శుక్ర గ్రహం

శుక్రుడు- శుక్ర గ్రహం

శుక్రదేవుడు లేదా శుక్రగ్రహం రాక్షసుల గురువు మరియు శుక్రనీతి రచయిత అయిన శుక్రాచార్యుడి వలన ఏర్పడింది. శుక్రుడు తెల్ల రంగులో, నడివయస్సులో మరియు ఎనిమిది గుర్రాలు నడిపే బంగారు లేదా వెండి రథంపై నాలుగు చేతులతో దర్శనమిస్తారు. ఆయన చేతిలో ఒక కర్ర మరియు జపమాల, కమలం మరియు కొన్నిసార్లు విల్లు,బాణం కూడా ఉంటాయి.ప్రతి వ్యక్తి జీవితంలో శుక్రదశ ఇరవై ఏళ్ళ పాటు ఉంటుంది మరియు సరైన స్థానంలో ఉంటే ఈ సమయం చాలా సంపద,అదృష్టం, విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుంది. శుక్రగ్రహం ప్రేమ మరియు తీవ్రమైన కాంక్షకి గుర్తు. శుక్రుడి రోజు శుక్రవారం మరియు రత్నం వజ్రం. శుక్రగ్రహం వృషభ రాశి(ఏడవం) మరియు తులారాశి(తులం)లకు అధిదేవుడు. తమిళనాడులోని కుంభకోణం వద్ద ఉన్న కంజనూర్ ఆలయం ప్రముఖ శుక్రుడి ఆలయాలలో ఒకటి.

శని- శని గ్రహం

శని- శని గ్రహం

శని దేవుడు కష్టాల దేవుడిగా, అన్ని అదృష్టాలను గ్రహాలవ్యవస్థలో తన స్థానంతో ప్రభావితం చేసే దేవుడిగా ప్రసిద్ధి. శనిదేవుడిని సాధారణంగా నాలుగు చేతులతో, రథం లేదా గేదె లేదా రాబందుపై ప్రయాణిస్తున్నట్లు చూపిస్తారు. శని చేతుల్లో కత్తి, బాణాలు మరియు రెండు బాకులతో కన్పిస్తాడు. శనిని సామాన్యంగా చీకటి గ్రహంగా, దీర్ఘకాల దురదృష్టం మరియు బాధగా అభివర్ణిస్తారు. శని యొక్క రోజు శనివారం మరియు రత్నం నీలం. కుంభ మరియు మకరరాశుల అధిదేవుడు శనిదేవుడు లేదా శనిగ్రహం. మహారాష్ట్రలోని శని సింగణాపూర్ ఆలయం మరియు తమిళనాడులోని తిరునల్లార్ దర్బారణ్యేశ్వరార్ ఆలయం రెండు దేశంలోనే ప్రసిద్ధ శనిదేవుడి ఆలయాలుగా ఉన్నాయి.

రాహు

రాహు

హిందూ పురాణాలలో, రాహు గ్రహదేవుడుని రాక్షస పాము యొక్క తలగా వర్ణించారు. ఈ పాము సూర్యుడిని, చంద్రుడిని మింగేస్తూ గ్రహణాలు కలిగేలా చేస్తుంది. రాహువు కన్పడని చీకటి గ్రహంగానే ఉంటూ తనకంటూ ప్రత్యేకంగా ఏ రోజూ లేనివాడు. అతన్ని కళారూపాల్లో శరీరంలేని ఒక వింతపక్షిగా, ఎనిమిది నల్ల గుర్రాలు నడిపే రథంపై ప్రయాణిస్తాడని చూపిస్తారు. రాహు ప్రభావం వస్తే విజయం సాధించేలోగా అనేక అవాంతరాలు,తీవ్ర సమస్యలు, కష్టాలు బాధిస్తాయి. రాహువుకి సంబంధించిన రత్నం గోమేధం లేదా తేనె రంగు హెస్సొనైట్. తమిళనాడులోని కుంభకోణం వద్ద ఉన్న తిరునాగేశ్వరం నాగనాథస్వామి ఆలయం,దేశంలోని ప్రసిద్ధ రాహువు గుడిలలో ఒకటి.

కేతు

కేతు

సంస్కృతంలో, కేతు (ధూమకేతు) అంటే ఒక ఉల్క(కామెట్). ఇది కన్పడని నల్లటి గ్రహం అందుకని దీనిని రాక్షస పాము యొక్క తోక అని కూడా భావిస్తారు. చిత్రాల్లో ఎప్పుడూ కేతువును మచ్చలున్న శరీరంతో, రాబందు వాహనంపై దండం పట్టుకుని ఉన్నట్లుగా చూపిస్తారు. కేతువు మంచి, చెడు, ఆధ్యాత్మిక మరియు అభూత ప్రభావాల కర్మ ఫలితాలను చూపే రూపం. కేతుగ్రహ రత్నం పిల్లి కన్ను. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఉన్న కేతు నాగనాథస్వామి ఆలయం దేశంలోనే ప్రసిద్ధ కేతు భగవానుడి గుడి.


English summary

Navagrahas – 9 Planetary Deities in Hindu Astrology

Navagraha or the Nine Planets has great importance in Hinduism and Hindu rituals. Navagrahas are considered to play a major role in deciding the destiny of man.
Desktop Bottom Promotion