Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
Navaratri 2020 : కాళీమాత మరియు దుర్గా దేవి ఒక్కరేనా? వారి మధ్య తేడాలేంటి?
దుర్గాదేవి మరియు కాళీమాత మధ్య ఉన్న అంతరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం మరికొన్ని రోజుల్లో అంటే అక్టోబర్ 17 నుండి 25వ తేదీ వరకు దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో హిందు భక్తులందరూ అమ్మవారిని అనేక రూపాల్లో అలంకరించి.. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.

ఈ సమయంలో అమ్మవారిని పూజించి.. ఉపవాసం ఉంటే తాము కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. అయితే ఇక్కడ అమ్మవారిని రెండు విధాలుగా పోల్చారు.

అమ్మవారిని కాళీమాతగా కొందరు.. దుర్గా దేవిగా మరికొందరు కొలుస్తున్నారు. పురాణాల ప్రకారం ఈ ఇద్దరు దేవతలు వేర్వేరా? లేక అందరూ ఒకరేనా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి...

దుర్గాదేవి..
పురాణాల ప్రకారం.. దుర్గాసురుడు అనే రాక్షసుడు ఓ ఘోర తపస్సు చేసి, బ్రహ్మ దేవుని నుండి అనేక వరాలను పొందాడు. ఆ గర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాల్లో ఉండే దేవుళ్లను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు.

పరాశక్తిని వేడుకోగా..
అప్పుడు ముల్లోకాల్లో ఉండే దేవతలు ఆ పరాశక్తిని వేడుకున్నారు. ఆ దేవి అప్పుడు కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది. ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను స్తుతించారు.

దుర్గాసురుని సంహరించడం కోసం..
ఆ దేవి దుర్గాసురుడుని సంహరించేందుకు వరుణుడి చేత శంఖం, అగ్ని చేత బల్లెం, వాయువు చేత బాణాలు అంబులపొది, ఇంద్రుని చేత వజ్రాయుధం, బ్రహ్మ చేత అక్షరమాల, సూర్యుని చేత కిరణాలు, శివుని వద్ద నుండి సింహ వాహనం పొందారు. స్కంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలన్నీ పొందుపరచి ఉన్నాయి.

దుర్గాదేవిని..
శ్రీ దుర్గాదేవిని శ్రీ మహాలక్ష్మీ, మహా సరస్వతి, బాలా త్రిపుర సుందరి, లలితాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, గాయత్రీ రూపాలతో పాటు ఇతర రూపాల్లో అలంకరించి ఆరాధిస్తారు.

కాళి మాత..
ఈ దేవత గురించి అనేక కథలు పురాణాలలో వివరించబడ్డాయి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త స్వామి వివేకానంద తన అభిమాన దేవత అయిన కాళిమాతపై 1898లో ‘కాళి ది మదర్' అనే కవితను కూడా రాశారు. అయితే చాలా మంది కాళి మాత అంటే భయంకరమైన రూపం అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆమె గొప్ప శక్తి ఉన్న తల్లి అని అతికొద్ది మందికే తెలుసు.

శక్తిని సూచిస్తాయి..
కాళీ మాతకు కోపం వస్తే తట్టుకోవడం కష్టం. ఆ మాతకు ఆవేశం వచ్చినప్పుడు నియంత్రణలో ఉండరట. అలాంటి సమయంలో ఆమెను శాంతపరచటానికి శివుడు తన మార్గాన్ని చాటుతాడు. ఆమె పాదాలు శివుడిని తాకినప్పుడు, ఆమె కోపం నిగ్రహానికి వస్తుంది. అప్పుడు మాత్రమే కాళిదేవి ప్రశాంతంగా మారుతుంది.

ఆది శక్తిగా..
ఈ విశ్వం మొత్తం అంతమైనప్పటికీ.. కాళీ మాత ఉనికి మాత్రం అలాగే ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఈ మాతను స్వచ్ఛమైన, ఎన్నో శక్తులు కలిగి ఆది శక్తిగా భావిస్తారు.

ఇవన్నీ ఒకేలా ఉండవు
ఇవన్నీ ఖచ్చితంగా ఒకటి కాదు మరియు హిందువుల దేవి పురాణం ఇలాగే కొనసాగుతుంది. నవరాత్రి సమయంలో పూజించే ఆదిశక్తికి మరికొన్ని పేర్లు ఉన్నాయి. అవి: కాశీ, తారా, త్రిపురసుందరి, భువనేశ్వరి, చిన్నమస్థ, త్రిపురభైర్వి, దుమావతి, బాగ్లముకి, మడంగి మరియు కమలతో పాటు మరెన్నో పేర్లు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications