Latest Updates
-
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.?
దసరా నవరాత్రులు: 9 దివ్యమైన రాత్రులు
నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులని అర్ధం.ఈ నవరాత్రులని సంవత్సరంలో రెండు సార్లు, వేసవి కాలం మొదలయ్యే ముందు ఒక సారి, శీతాకాలం ప్రారంభం లో ఇంకోసారీ చేస్తారు.

నవరాత్రుల ప్రాముఖ్యత ఏమిటి:
మన దుఃఖాలని తొలగించే శక్తి స్వరూపిణి , జగన్మాత అయిన దుర్గా మాత యొక్క శక్తి ని ఈ నవరాత్రులలో మేల్కొలుపుతాము.జగన్మాతయే "దేవీ" అనీ లేదా "శక్తి" అని పిలవబడుతుంది.

పూజ:
పూజ యొక్క శక్తి వలనే భగవంతుడు సృష్టి, స్థితి, లయం చేయగలుగుతున్నాడు.ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడు కదలిక లేకుండా,మార్పు లేకుండా ఉంటాడు. జగన్మాత అయిన దుర్గా మాత యే అన్నీ చేస్తుంది.నిజం చెప్పాలంటే శాస్త్ర పరం గా నిరూపించబడిన శక్తి ని నాశనం చెయ్యలేము అనే సిద్ధాంతాన్నే మనం శక్తి ని పూజించడం ద్వారా చాటుతున్నాము. శక్తి ని సృష్టించలేము లేదా నాశనం చెయ్యలేము. సదా అది సృష్టి లో నిలిచి ఉంటుంది.

దుర్గా మాత ని ఎందుకు పూజించాలి:
సృష్టిలో ని శక్తి అంతా జగన్మాత యొక్క రూపమే అనీ మనమందరమూ ఆమె పిల్లలలమని నమ్ముతాము.కానీ అమ్మే ఎందుకు, నాన్న ఎందుకు కాదు అన్న ప్రశ్న ఉదయించచ్చు.దైవానికి సంబంధించిన కీర్తి,కాస్మిక్ ఎనర్జీ ,ఆయన గొప్పతనం మరియు ఆధిపత్యం అంతా జగన్మాత శక్తి రూపం లోనే గొప్పగా వర్ణించబడింది.ఒక పిల్లవాడు తన తల్లిలో అన్ని గుణాలనీ చూసినట్లు మనము భగంతుడు అంటే జగన్మాత అయిన శక్తి అని భావించి ఆరాధిస్తాము.హిందూ మతం ఒక్కటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని తల్లి రూపం లో వర్ణించి,ఆవిడే సృష్టి కి మూలకారణం అని నమ్ముతుంది.

సంవత్సరానికి రెండు సార్లు ఎందుకు:
వేసవి కాలం మొదలయ్యేటప్పుడు, మరియు శీతాకాలం ప్రారంభం రెండూ కూడా వాతావరణం మరియు సూర్య శక్తీ మార్పులకి గురయ్యే కాలం.
ఈ రెండు కాలాల ప్రారంభాన్ని దైవిక శక్తి ని ఆరాధించడానికి ముఖ్య రోజులుగా నిర్ణయించారు, ఎందుకంటే

సంవత్సరానికి రెండు సార్లు ఎందుకు:
1)ఈ దైవిక శక్తి వల్లే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. దాని వల్లే వాతావరణ మార్పులు జరుగుతున్నాయి, వాతావరణం లో సమతుల్యత ని కాపాడుతున్నందుకు ఈ శక్తి కి కృతఙత చెప్పుకోవడానికి,

సంవత్సరానికి రెండు సార్లు ఎందుకు:
2)ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల ప్రజల మనసుల్లో,ఆలోచనల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి.అందుకే మనకి శారీరక మానసిక సమతుల్యత పాటించడానికి కావాల్సిన శక్తినిమ్మని ఆ జగన్మాతని ప్రార్ధిస్తాము

తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు ఎందుకు:
జగన్మాత యొక్క వివిధ శక్తి స్వరూపాల ఆరాధన కొరకు నవరాత్రులని మూడు మూడు రోజుల చొప్పున విభజించారు.మొదటి మూడు రోజులూ దుర్గా మాత ని మేల్కొలిపి మనలోని దుర్గుణాలు,మలినాలు,లోపాలని రూపుమాపమని పూజిస్తాము.ఆ తరువాతి మూడు రోజులూ,సంపద కి అధిపతి అయిన లక్ష్మీ దేవిని ఆరాధిస్తాము.ఆవిడ తనని నమ్మిన భక్తుల మీద ఎనలేని సంపదలని కురిపిస్తుంది.ఆఖరి మూడు రోజులూ ఙానానికి ప్రతీక అయిన సరస్వతీ మాత ని పూజిస్తాము.మనకి జీవితం లో ఈ మూడు శక్తుల ఆశీర్వాదం లభించడం వల్లే సఫలత కలుగుతుంది. అందుకే తొమ్మిది రాత్రుల పాటు ఆరాధన చేయడం.

శక్తి ఎందుకు కావాలి?
పైన చెప్పిన కారణాల వల్ల మీరు మీ తల్లితండ్రులతో కలిసి కూర్చుని దుర్గా మాత ఆరాధన లో పాల్గొనండి. ఆవిడ సంపదలని, శ్రేయస్సునీ,ఙానాన్ని,అడ్డంకులని అధికమించగలిగే శక్తినీ ప్రసాదిస్తుంది.అందరూ శక్తి స్వరూపమైన దుర్గా మాత ని పూజిస్తారని గుర్తు పెట్టుకోండి.ఎవరికి మాత్రం ఏదో ఒక రూపం లో శక్తి ని పొందాలనుకోరు??



Click it and Unblock the Notifications