Latest Updates
-
గుండెల్ని పిండేస్తున్న విశాఖ చిన్నారి ఉదంతం..డాక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు! -
చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు.. ఆగస్టు 25 నుంచి ఈ 3 రాశులకు కుప్పలుతెప్పలుగా ధనాగమం! -
సండే స్పెషల్: నోరూరించే ఎగ్ ఘీ రోస్ట్ మసాలా..నాలుకకి పండగే పండగ..వేళ్లు నాక్కుంటూ తినేస్తారు! -
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే!
Nirjala Ekadashi 2022:నిర్జల ఏకాదశి రోజున నీటిని ఎందుకు మానేయాలంటే...!
నిర్జల ఏకాదశి 2022 తేదీ, సమయం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
హిందూ పంచాగం ప్రకారం, ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఒక్క ఏకాదశికి ఏదో ఒక ప్రత్యేకత అనేది కచ్చితంగా ఉంటుంది.

తిథుల ప్రకారం, ఏకాదశి రోజున శుభప్రదంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున నీటిని తాగడం వంటివి చేస్తారు.

అందుకే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. పురాణాలను పరిశీలిస్తే.. ఈరోజును భీమసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో నిర్జల ఏకాదశి ఎప్పుడొచ్చింది. శుభ ముహుర్త సమయం.. ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శుభ ముహుర్తం..
హిందూ పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో జూన్ 10వ తేదీన శుక్రవారం ఉదయం 7:25 గంటలకు శుభ ముహుర్తం ప్రారంభమవుతుంది. ఇదే ఏకాదశి మరుసటి రోజు అంటే 11 జూన్ 2022 శనివారం రోజున సాయంత్రం 5:45 గంటలకు ముగుస్తుంది.

నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత..
నిర్జల ఏకాదశి సమయంలో ఉండే ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని సక్రమంగా పాటించకపోతే కోరికలు నెరవేరకుండా పోతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే నిర్జల ఏకాదశి శుభ ముహుర్తం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

విష్ణు మూర్తికి పూజలు..
ఏకాదశి రోజున విష్ణు మూర్తికి ఎంతో ప్రీతికరమైనది చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున నీరు తాగకుండా ఉపవాసం కొనసాగించాలి. అదే సమయంలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే ఏకాదశి రాత్రి వేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలని చేస్తుంటారు. ఇక ఉపవాస విరమణ సమయంలో ద్వాదశి నాడు బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను దానంగా ఇస్తారు. అలాగే అతిథులను భోజనానికి పిలిచి, ఉపవాస వ్రతాన్ని విరమించడం వంటివి చేస్తారు. ఈ రోజున ఎవరైనా తమ శక్తి, సామర్థ్యం మేరక దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు.

పూజా విధానం..
నిర్జల ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ముందుగా స్నానం చేసి సూర్య దేవునికి నీటిని అర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువుకు పూలు, పండ్లు, అక్షింతలు, చందనంతో పూజలు చేయాలి. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపిస్తూ రోజంతా గడపాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకునేందుకు స్వామి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ అందించాలి. ఉపవాసం పూర్తయిన తర్వాతే నీటిని తాగాలి.



Click it and Unblock the Notifications