Latest Updates
-
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే!
ఈ రక్షాబంధన దినోత్సవం రోజున, రాఖీ కట్టడానికి అనువైన శుభ సమయాలు.
ఈ రక్షాబంధన దినోత్సవం రోజున, రాఖీ కట్టడానికి అనువైన శుభ సమయాలు.
మానవ సంబంధాలలో, సోదరీ సోదరుల మధ్య ఉన్న సంబంధం చాలా అందమైనది. ఒక సోదరుడి ఉక్రోషం తెప్పించే వ్యాఖ్యలు, ఒక సోదరి నిరంతర పొట్లాటలు; తల్లిదండ్రులు తన సోదరుని మందలించేటప్పుడు, సోదరి మనస్సులో సోదరుని పట్ల హృదయంలో కలిగే జాలి, తన సోదరి పట్ల సోదరునికి ఉండే శ్రద్ధ, జాగ్రత్త , వారి బంధంలో విశిష్టత ను తెలియజేస్తుంది.

రాఖీ పండుగ యొక్క ప్రాముఖ్యత:
ఒక సోదరుడు మరియు సోదరి మధ్య ఉన్న ఆప్యాయత, అనురగాలకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికై , ప్రతి సంవత్సరం రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ బంధాన్ని మరీంత బలోపేతం చేసుకోడానికి, దేశమంతటా రాఖీ పండుగను జరుపుకుంటారు. ఇది హిందూ పండుగ అయినప్పటికీ, వివిధ మతాల వారు దీనిని జరుపుకుంటారు.

రక్షా బంధన ముహూర్తం:
ఒక సోదరి ఈ రోజు తన సోదరుడు మణికట్టు చుట్టూ ఒక దారాన్ని కడుతుంది. రాఖీ అని పిలువబడే ఈ దారాన్ని కడుతున్నప్పుడు, ఆమె తన సోదరుడి సుదీర్ఘ ఆయుష్షు మరియు సదారోగ్యం గురించి ప్రార్థిస్తుంది. దానికి బహుమానంగా, సోదరుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆమెను కాపాడతాననే వాగ్ధానాన్ని బహుమతిగా ఇస్తాడు.

రక్షా బంధన శుభ మరియు అశుభ ముహుర్తములు:
భధ్ర సమయమును ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవాలి. ఇది దాదాపు ప్రతి రక్షా బంధన్ రోజున ఉంటుంది. జ్యోతిష్కులు, ఏ పవిత్రమైన కార్యమైననూ చేపట్టకూడని సమయాన్ని భద్ర అని పిలుస్తారు. భధ్ర సమయంలో ఒక రాఖీని కడితే అశుభమని నమ్మిక. రాఖీ కట్టకూడని దుర్ముహూర్త సమయములున్నప్పటికిని, ఈ రాఖీ రోజున ఎటువంటి భధ్ర సమయములు లేవు. దుర్ముహూర్త కాలాలలో రాఖీ ముడులను వేయరాదు. అశుభ ఘడియలు, రాహుకాలం మరియు యమ ఘడియల సమయంలో రాఖీని కట్టరాదు.

2018రక్షా బంధన్ 2018:
రక్షా బంధన్ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. మాసంలో శుక్ల పక్షం యొక్క పదిహేనవ రోజును పౌర్ణమి అంటారు. ఈ సంవత్సరం ఆగష్టు 26, 2018 న ఈ పండుగ జరుపబడుతుంది.
పూర్ణిమ తిథి ఆగష్టు 25 న, మధ్యాహ్నం 3గంటల 15 నిమిషాలకు ప్రారంభమయ్యి, ఆగష్టు 26 న, సాయంత్రం 5గంటల 25 నిమిషాల వరకు కొనసాగుతుంది.
ఈ రోజు ధనిష్ఠ నక్షత్రం మరియు పంచకం ప్రారంభం అవుతుంది (పంచకం అనగా ఐదు రోజులు). అన్ని రకాల పూజలకు మరియు నివారణలకు పంచకం పవిత్రమైనదిగా భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ, రాఖీ కట్టడానికి, ఆగష్టు 26 న ఉదయం 7:45 నుండి 12: 28 వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. మళ్లా మధ్యాహ్నం 2:03 నుండి 3:38 వరకు కూడా ఉంటుంది.
రాహు కాలము - ఉదయం 5:13 గం. నుండి 6:48 గం. వరకు
యమ ఘడియలు - మధ్యాహ్నం 3:38 గం. నుండి 5:13 గం.వరకు
అశుభ కాలం- మధ్యాహ్నం 12:28 గం. నుండి 2:03 గం. వరకు

లక్ష్మి దేవి ఒక రాక్షసుని మణికట్టు చుట్టూ రాఖీ కట్టింది:
రక్షా బంధన్ అనేది హిందీ పదం, రక్ష అనగా రక్షణ మరియు బంధన్ అనగా ముడి అనే రెండు పదాల నుండి ఇది పుట్టింది. రెండు పదాలను కలిపి చూస్తే - రక్షణనిచ్చే ముడి. ఒకసారి బలిచక్రవర్తి,విష్ణు భగవానుడు తనతో కలిసి ఉండాలనే వాగ్దానం తీసుకున్నాక, ఈ పండుగ ఆరంభమైనట్లు నమ్మకం. ఎంత కాలం గడిచినా కానీ విష్ణువు మూర్తి తిరిగి రాకపోవడంతో, లక్ష్మిదేవి బలిచక్రవర్తి మణికట్టు చుట్టూ దారాన్ని కట్టి, తన సోదరునిగా చేసుకుంది. బదులుగా, బలిచక్రవర్తిని ఆమె విష్ణువును విడిచిపెట్టి, తన నివాసమైన వైకుంఠానికి పంపమని వాగ్ధానం చేయమంది.



Click it and Unblock the Notifications