Latest Updates
-
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.!
Ram Navami 2022:శ్రీరాముడిని ఇలా పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట...!
2022లో శ్రీరామ నవమి సందర్భంగా ఇంట్లో ఏ సమయంలో పూజలు చేయాలి, ఎలాంటి మంత్రాలు పఠించాలి, రాముడిని ఎలా ఆరాధించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మహా భారతం గురించి తెలిసిన వారందరికీ రాముని అవతారం గురంచి కచ్చితంగా తెలిసే ఉంటుంది. 'రామ' అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు.

అందుకే శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఇదే రోజు రాముడు జన్మించాడని.. అలాగే వనవాసం నండి కూడా అయోధ్యకు పట్టాభిషేకం జరుపుకున్నారని పెద్దలు చెబుతుంటారు.

ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు త్రేతా యుగంలో వసంత కాలంలో ఛైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు.

ఆ మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజునే భారతీయులంతా పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగేళ్లు అడవిలో వనవాసం చేసి, లంకలో రావణాసరుడిని మట్టుబెట్టి అనంతరం శ్రీరాముడు సతీసమేతంగా అ యోధ్యలో పట్టాభిషేకం పొందాడు. ఈ శుభ సమయం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత శ్రీరామ నవమిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో సీతారాములోరి కళ్యాణం జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీరామ నవమి శుభ ముహుర్తం ఎప్పుడొచ్చింది? ఇంట్లో ఏ సమయంలో పూజలు చేయాలి, ఎలాంటి మంత్రాలు పఠించాలి, రాముడిని ఎలా ఆరాధించాలనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శుభ ముహుర్తం ఎప్పుడంటే..
హిందూ పంచాంగం ప్రకారం, 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం నాడు శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన శుభముహుర్తం ఎప్పుడంటే ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:39 గంటల వరకు ఉంటుంది. అంటే సుమారు 2 గంటల 33 నిమిషాల పాటు ఉంటుంది. ఈ వ్యవధిలోనే శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిపించాలి.
నవమి తిథి ప్రారంభం : ఏప్రిల్ 10న అర్థరాత్రి 1:23 గంటలకు
నవమి తిథి ముగింపు సమయం : ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు

సూర్యోదయానికి ముందు..
శ్రీరామ నవమి రోజున ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి. అనంతరం పసుపు లేదా పచ్చని రంగులో బట్టలు వేసుకుని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దేవుని గదిని పువ్వులతో అందంగా అలంకరించాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి. గడపకు పసుపు, కుంకుమ బొట్లను పెట్టి.. ఇంటి ముందు మంచి ముగ్గును వేయాలి.

రామునితో పాటు..
చరిత్రను పరిశీలిస్తే.. ఛైత్ర మాసంలో తొమ్మిదో రోజైన నవమి రోజున మధ్యాహ్నం సమయంలో కౌసల్యకు జన్మించాడు. ఆ తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రఘ్నలు జన్మించారు. కాబట్టి ఈ నలుగురు ఉన్న ఫొటోలను పూలతో అలంకరించాలి. భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. మీరు సమర్పించే నైవేద్యంలో వడపప్పు, పానకం ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు.

పట్టాభిషేకం కథ..
శ్రీరామ నవమి రోజున రాముని రక్షా స్తోత్రం లేదా శ్రీరామ సహస్రం, శ్రీరామ అష్టోత్తరం వంటి స్తోత్రాలను పఠించాలని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం రాముని పట్టాభిషేకం కథను చదివితే కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

సకాలంలో పనులు..
ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమే రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసమే రాముడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీరామ నవమి రోజున దగ్గర్లోని దేవాలయాల్లో శ్రీసీతారాముల కళ్యాణోత్సవాన్ని జరిపిస్తే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయట. మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

మధ్యాహ్నం వేళలో..
శ్రీరామ నవమి వేసవి కాలంలో ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. అందుకే రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ప్రారంభం 12 గంటల సమయంలో శ్రీరామునికి పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మీరు పూజ చేసే సమయంలో రెండు దీపారాధనలు, కంచు దీపంతో ఐదు పత్తితో తయారు చేసిన వత్తులను వెలిగించాలి. పూజ సమయంలో ఈ శ్లోకం మూడుసార్లు స్మరిస్తే.. ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే‘ అనే శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని చాలా మంది నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రకషణ కోసం ఛైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించాడని నమ్ముతూ శ్రీరామ నవమిగా జరుపుకుంటారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవవత్సరం ఛైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత శ్రీరామ నవమిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో సీతారాములోరి కళ్యాణం జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కళ్యాాణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications