Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
Kumbh Mela 2025: కుంభమేళా అసలు కథ ఏంటో తెలుసా? 2025 కుంభమేళా ఎందుకంత ప్రత్యేకం?
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమూహాల్లో మహా కుంభమేళా ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇది ప్రారంభమైంది. ఈ కుంభమేళాకు సుమారు 45 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంత పెద్ద ఈవెంట్ కావడంతో ప్రపంచం మొత్తం ఈ కుంభమేళా వైపే చూస్తోంది. ఇప్పటికే త్రివేణి సంగమంలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. హిందువులు జరుపుకునే అతిపెద్ద వేడుకల్లో ఇది ఒకటి. 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ కుంభమేళా విశిష్టతలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కుంభమేళా పవిత్రత
కుంభమేళాలో స్నానం చేస్తే వంద జన్మల పుణ్యం వస్తుందని మన పూర్వికులు చెబుతుంటారు. ఎందుకంటే మూడు నదులు కలిసే ప్రదేశంలో కుంభమేళా నిర్వహించినప్పుడు ఆ ప్రదేశంలోని నీరు అమృతంలా మారుతుందని, దీని కారణంగా అందులో స్నానం చేసే భక్తుల బాధలన్నీ పోతాయని నమ్ముతారు. అందుకే త్రివేణి సంగమం వద్ద జరిగే ఈ కుంభమేళాలో పాల్గొనడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారని చెబుతున్నారు.

కుంభమేళా జరిగే ప్రధాన ప్రదేశాలు
కుంభమేళా మన దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో జరుగుతుంది. అందులో అతి ముఖ్యమైనది త్రివేణి సంగమం. ఆ నాలుగు ప్రధాన నగరాలు ఏవంటే
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్
మధ్యప్రదేశ్‌లో షిప్రా ఉజ్జయిని గంగా నది ఒడ్డున
మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నది ఒడ్డున
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా, సరస్వతి సంగమం వద్ద
త్రివేణి సంగమం కథ ఏంటి?
త్రివేణి సంగమం అనేది మూడు నదులు ఒకే చోట కలిసే ప్రత్యేక ప్రదేశం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ రెండు నదులు మాత్రమే కలుస్తున్నాయి. గంగా మరియు యమునా నదులు ప్రస్తుతం ఇక్కడ కలుస్తాయి. కానీ సరస్వతి నది ఇప్పుడు ప్రవహించడం లేదు. కానీ విశ్వాసాల ప్రకారం, ఈ రెండు నదులలో స్నానం చేయడం ద్వారా సరస్వతి తల్లి మానవుల పాపాలను పోగొడుతుందని భక్తులు విశ్వసిస్తారు.
మహాకుంభమేళా సందర్భంగా ఈ త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ పుణ్యస్నానం చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అనారోగ్యం నయమవుతుందని కూడా నమ్ముతారు.
ఈ కుంభమేళా ఎందుకు ప్రత్యేకం?
ఈ ఏడాది మహా కుంభమేళా చాలా ప్రత్యేకం. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ మేళా కావడం విశేషం. మహా కుంభమేళా 2025 144 సంవత్సరాల తర్వాత గ్రహాలు, నక్షత్రాల అరుదైన కలయికల వలన జరుగుతోంది. గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ఈ రోజు శుభప్రదమని నమ్ముతారు.
కుంభమేళా నాలుగు రకాలు
4 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా
అర్ధ కుంభమేళా- 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది
పూర్తి కుంభమేళా- 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది
మహా కుంభమేళా- 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది



Click it and Unblock the Notifications