For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'కనుమ నాడు కాకి అయినా కదలదు'... మరి మనం ప్రయాణాలు చేయొచ్చా...

|

పురాణాల ప్రకారం సంక్రాంతి పండుగకు ముందు వచ్చే భోగి రోజు ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ సమయంలోనే భూమి తిరిగే దశ మారుతుంది. దేవతలందరికీ ఉత్తరాయణం పగటి కాలం అని, వారికి ఇది అత్యంత ఇష్టమైన సమయమనీ పండితులు చెబుతున్నారు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈరోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారనీ, వారిని తలచుకుంటూ ప్రసాదాలు పెట్టడం అనేది ఓ ఆచారం.

అలాగే కనుమ రోజున ఇంట్లోని వారందరూ కలిసి అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ పండుగని ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే పశువులను పూజించి, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి, సుష్టుగా భోజనం చేయడం వంటివి చేస్తారు. ఈ సందర్భంగా మన శరీరం అనేది కొంత బద్ధకంగా తయారవుతుంది. దీంతో ప్రయాణం చేయడానికి కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇంకా కనుమ నాడు ఎందుకు ప్రయాణాలు చేయకూడదో.. ఆరోజు ఏయే పనులు చేయాలో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి...

ఆహ్లదకరమైన వాతావరణంలో సంతోషాలు వెళ్ళువిరిసే 'కనుమ'

అల్లుళ్లకు ప్రాముఖ్యత...

అల్లుళ్లకు ప్రాముఖ్యత...

మకర సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ. మన దేశంలో చాలా మంది హిందువులకు పంట కాలం పూర్తి అయినందుకు మరియు దేవునికి మరియు పశువులకు కృతజ్ఞతలు తెలిపే రోజు కనుమ రోజు. ఈ పండుగలో అల్లుళ్లకు తొలి ప్రాముఖ్యత ఉంటుంది.

మాంసాహార ఘుమఘుమలు..

మాంసాహార ఘుమఘుమలు..

కనుమ పండుగ నాడు నాటుకోడి పులుసు, నాటుకోడి ఇగురు, రొయ్యల వేపుడు, చేపల పులుసుతో పాటు ఇంకా రకరకాల కూరలకు లెక్కేలేదు. ముఖ్యంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాంసాహారుల్లో లాలాజలం ఊరిస్తూ ‘కోస‘లు ఈ మూడు రోజులు ఘుమఘుమలాడుతాయి.

ముక్కనుమ కూడా..

ముక్కనుమ కూడా..

సంక్రాంతి తర్వాత రోజు కనుమ పండుగ జరుపుకుంటారని అందరికీ తెలుసు. కనుమ మరుసటి రోజు కూడా ముక్కనుమ పండుగను జరుపుకుంటారని చాలా మందికి తెలీదు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ పండుగను జరుపుకుంటారు. ఈరోజున తాజా కూరగాయలు మరియు తోర్ దాల్ మరియు చింతపండుతో పాటు కొంచెం బెల్లంతో కలిపిన వంటకాన్ని తయారు చేస్తారు. దీన్నే ముక్కనుమా అంటారు.

పశువుల అలంకరణ, పూజలు..

పశువుల అలంకరణ, పూజలు..

కనుమ పండుగ రోజు పల్లెటూళ్లలో ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలను పసుపు, కుంకుమ, రంగు రంగుల వస్త్రాలు, బంతిపూలు, బుడగలతో అందంగా అలంకరించి పూజలు చేస్తారు. ఆ రోజున వాటితో ఏ పనీ చేయించరు. వాటిని చాలా ప్రేమగా చూసుకుంటారు.

తిరుగు ప్రయాణాలు చేయరు..

తిరుగు ప్రయాణాలు చేయరు..

‘కనుమ పండుగ నాడు కాకి అయినా కదలదు‘ అని ఒక సామెత ఉంది. అందుకే ఆరోజు పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలు మరియు అత్తారింటికి వెళ్లిన అల్లుళ్లు తిరుగు ప్రయాణం అనేది చేయరు. ఎందుకంటే తొలిరోజు భోగి, రెండో రోజు సంక్రాంతి తర్వాత వచ్చే మూడోరోజే కనుమ. సాధారణంగా మూడో రోజున ప్రయాణాలు చేయకూడదు అని పురాణాలు చెబుతున్నాయి.

శని సంబంధ నక్షత్రం..

శని సంబంధ నక్షత్రం..

పుష్య మాసంలో కనుమ పండుగ రోజు శని సంబంధమైన నక్షత్ర ప్రభావం కూడా ఉంటుంది. ఆరోజున దేవలంతా మన ఇంటికి విచ్చేస్తారు అని పండితులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదని చాలా మంది పండితులు చెబుతున్నారు.

బొమ్మల కొలువులు..

బొమ్మల కొలువులు..

కనుమ పండుగ నాడు బొమ్మల కొలువు ఎత్తటం అనే పేరంటాన్ని కూడా నిర్వహిస్తారు. ఈరోజున బొమ్మలకు హారతి పట్టి ఒక బొమ్మను శాస్త్రపరంగా ఎత్తిపెడతారు. అంతేకాదు గొబ్బెమ్మల పూజలు, హరిదాసుల రాకపోకలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, కొన్ని ప్రాంతాల్లో బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, బావమరదల్ల సరసాలతో ఎంతో సరదాగా సాగిపోయే రోజు కనుమ పండుగ.

పశువులకు విశ్రాంతి..

పశువులకు విశ్రాంతి..

పూర్వం పశువులతో ఉన్న ఎడ్లబండ్లనే వాహనాలుగా ఉపయోగించేవారు. కనీసం కనుమ పండుగ రోజు అయిన వాటికి విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆరోజు ప్రయాణాలు చేసేవారు కాదు. వ్యవసాయంలోనూ తనకు ఎంతగానో ఉపయోగపడ్డ పశువులకు మానవులు ఇచ్చే ప్రాముఖ్యత అది. అందుకే ఆరోజు ఎవ్వరూ ప్రయాణాలు చేసే వారు కాదు.

English summary

Reasons Why kanuma is bad day for travel

Here are the reasons why kanuma is bad day for travel. Read on
Story first published: Thursday, January 16, 2020, 12:17 [IST]