Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
అయోధ్య vs కాశీ..ఏ ఆలయ పూజారికి ఎక్కువ జీతం వస్తుందో తెలుసా?
కోట్లాది మంది హిందువులు దశాబ్దాల ఎదురుచూపులు ఫలించి అయోధ్యలో భవ్యమైన,దివ్యమైన రామమందిరం నిర్మించడింది. 2024లో అయోధ్య రామాలయాన్ని భక్తుల దర్శనం కోసం ప్రారంభించబడింది. ఆలయ ప్రధాన పూజారిగా ఆచార్య సత్యేంద్ర దాస్ నియమించబడ్డారు. అయితే ఇటీవల సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. 85 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఫిబ్రవరి 12,2025న లక్నోలోని ఓ హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. సత్యేంద్ర దాస్ మరణం తర్వాత అయోధ్య ఆలయ ప్రధాన పూజారిగా పండిట్ మోహిత్ పాండే నియమితులయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాకు చెందిన మోహిత్ పాండే..ప్రస్తుతం అయోధ్య రాముడికి నిత్య పూజల దగ్గర నుంచి ఆలయ సంప్రదాయాల వ్యవహారాలు అన్నింటిని చూసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 3వేలమందికి పైగా ప్రధాన పూజారి పోస్ట్ కి పోటీ పడగా..ఇంటర్వ్యూలు,కఠినమైన ప్రక్రియ తర్వాత మోహిత్ పాండే అయోధ్య ఆలయ ప్రధాన పూజారిగా ఎంపికయ్యారు. 2024 జనవరిలో జరిగిన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న 29 మంది పూజారులలో మోహిత్ పాండే ఒకరు.

అయితే చాలామంది మదిలో మెదిలో సాధారణ ప్రశ్నలు ఏంటంటే అసలు అయోధ్య రామ మందిర ప్రధాన పూజారికి ఎంత జీతం వస్తుంది? సహాయ అర్చకులకు ఎంత జీతం వస్తుంది? జీతంతో పాటు ప్రభుత్వం వారికి ఇంకేం సౌకర్యాలు కల్పిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చూద్దాం.
అయోధ్య రామాలయంలో అర్చకుల జీతాలు ఎలా ఉంటాయి
మీడియా కథనాల ప్రకారం అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడైన పండిట్ మోహిత్ పాండే నెలకు రూ.32,900 జీతంగా అందుకుంటున్నారు. సహాయ అర్చకులకు నెలకు రూ.31,000 జీతం వస్తుంది. గతంలో ఈ జీతాలు కాస్త తక్కువగా ఉండేవని సమాచారం. ప్రధాన అర్చకులకు గతంలో రూ. 25,000, సహాయ అర్చకులకు రూ. 20,000 మాత్రమే ఇచ్చేవారంట.
జీతంతో పాటు ఇంకేం ఇస్తారు
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి పండిట్ మోహిత్ పాండేకు కేవలం జీతం మాత్రమే కాకుండా ఇతర మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, బస, ప్రయాణ ఖర్చులు, ఇంకా ఆయా కార్యక్రమాలకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలను కూడా ఆలయ ట్రస్ట్ అందిస్తుంది.
ప్రధాన అర్చకుడి అర్హతలేంటో తెలుసా?
సంస్కృత భాషపై మంచి పట్టు కలిగి ఉన్న మోహిత్ పాండే.. దూధేశ్వర్ వేద విద్యాలయంలో పూజారి పదవికి అవసరమైన వేద విద్యను అభ్యసించారు. సామవేదంలో వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పట్టా పొందారు. చాలా సంవత్సరాల పాటు మతం, సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేశారు.
కాశీ ఆలయంలో ప్రధాన అర్చకుడి జీతం ఎంత
మనదేశంలో ఎన్నో దాడులకు గురై కూడా తట్టుకొన నిలబడ్డ ఆలయాల్లో కాశీ విశ్వనాథ ఆలయం ఒకటి. ఎంతమంది ఎన్నిసార్లు ఈ ఆలయంపై దాడి చేసినా కూడా ఆ ప్రయత్నాలు చేసినవాళ్లు కనుమరుగైపోయారు తప్ప ఆలయాన్ని ఏం చేయలేకపోయారు. శివుడు స్వయంగా వెలసిన కాశీ క్షేత్రాన్ని 1983 నుండి ఈ ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ధర్మకర్తల మండలి నిర్వహిస్తోంది. విశ్వనాథ ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసే శ్రీకాంత్ మిశ్రాకి నెలకు రూ.90,000 జీతంగా అందుకుంటారు. కాశీ విశ్వనాథ ఆలయంలో జూనియర్ అర్చకులకు నెలకు రూ.80000 జీతం..సహాయ అర్చకులు నెలకు రూ.65,000 జీతం అందుకుంటున్నారు.



Click it and Unblock the Notifications
