Latest Updates
-
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా!
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
వివాహమయ్యాక దంపతులు తమ జీవితంలో మొదటగా జరగాలని కోరుకునే విశేషం ఏదైనా ఉంది అంటే అది సంతానానికి సంబంధించినదే. భార్య కడుపు పండితే భర్త మనసు నిండుతుంది. చిన్నారి అడుగుల సందడితో ఇల్లంతా కళకళలాడిపోతుంది. కానీ కొందరికి పలు కారణాల వల్ల ఆ భాగ్యం దక్కడం లేదు. పురాణాల కాలం నాటి నుంచి కొందరు దంపతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారే. అయితే నేటి కాలంలో ఆ సంఖ్య పెరిగింది. అలాంటి భార్యాభర్తలు పెళ్లయి నెలలు, సంవత్సరాలు గడిచినా సంతాన భాగ్యం కలగకపోతే ఆధ్యాత్మికపరంగా ఒక పరిష్కారం ఉందని పండితులు చెబుతున్నారు. అదే సంతాన సప్తమి వ్రతం. భాద్రపద మాసంలో వచ్చే ఈ పవిత్రమైన రోజున దంపతులు ఈ వ్రతం పాటిస్తే మేలు జురుగుతుందని సూచిస్తున్నారు.

భాద్రపద మాసంలో శుక్ల పక్షం ఏడవ రోజున ఈ సంతాన సప్తమి వ్రతాన్ని పాటిస్తారు. అంటే ఈ ఏడాది ఈ తిథి సెప్టెంబర్ 17న గురువారం వస్తుంది. దీనినే ముక్తాభరణ సప్తమి, దుబ్ది సప్తమి అని కూడా అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం గురువారం ఉదయం 10:48 గంటలకు ప్రారంభమై 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:01 గంటల వరకు ఈ తిథి ఉంటుంది. శాస్త్రాల ప్రకారం సాయంత్రం పూట ఈ పూజను నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఈ వ్రతం పాటిస్తారు. ఈ రోజున శివపార్వతులను పూజిస్తారు. పిల్లలు ఉన్న దంపతులు కూడా వారి క్షేమం కోసం ఈ వ్రతం పాటిస్తారు.
పూజా విధానం

సంతాన సప్తమి వ్రతం చేయాలనుకునే మహిళలు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి, సంతానం కోసం, పిల్లల దీర్ఘాయువు, ఆరోగ్యం కోసం ఉపవాసం ఉంటామని వ్రతం తీసుకోవాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి. చెక్క పీఠంపై ఎర్రటి వస్త్రం పరిచి దానిపై ఆది దంపతుల ఫొటో లేదా విగ్రహం పెట్టుకోవాలి. ఎదురుగా కలశం పెట్టుకోవాలి. దానిపై స్వస్తిక్ గీసి, కొబ్బరికాయను పెట్టుకోవాలి. అనంతరం నెయ్యి దీపం వెలిగించి శివపార్వతులను పూజించడం మొదలుపెట్టాలి.

కుంకుమ, బియ్యం గింజలు, తెల్ల పొడి, రంగుల పొడి, పూలు, తమలపాకులు, వక్కలు ఇలా పూజకు సంబంధించిన సామగ్రి పెట్టుకోవాలి. శివపార్వతులకు ఇష్టమైన నైవేద్యాలను తయారుచేసి సమర్పించాలి. తర్వాత సంతాన సప్తమి వ్రతం కథ వినాలి. చివరిగా హారతి ఇచ్చి పూజ ముగించాలి.
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.!
ఈ మంత్రాన్ని జపించండి
పూజ ముగించే ముందు 'దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరం సుఖం" అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల శివపార్వతుల ఆశీర్వాదంతో సంతాన ప్రాప్తి కలుగుతుంది. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘాయువుతో ఉంటారు.



Click it and Unblock the Notifications
