Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
నమస్కారమనే సంస్కారం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?
నమస్కారం అనేది గౌరవసూచకంగా రెండు చేతులు జోడించి, చెస్ట్ దగ్గరకు తీసుకొచ్చి తలవంచి చేసే ప్రక్రియ. నమస్కారాన్ని నమస్తే అని కూడా పిలుస్తారు. ఈ సంప్రదాయం నిన్న మొన్నటిది కాదు.. బిలియన్ల సవంత్సరాల క్రితంది. నమస్కారాన్ని ఇద్దరు కలిసినప్పుడు, చివరగా వెళ్లేటప్పుడు పెడతారు.
కానీ ప్రస్తుత కాలంలో.. ఏ ఇద్దరు కలిసినా.. చేయి చేయి కలిపి.. హాయ్, హల్లో అంటూ పలకరించుకోవడం స్టైల్ గా మారిపోయింది. ఒకరి చేతిని మరొకరు పట్టుకుని కరచాలనం చేయడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. అయితే.. హృదపూర్వకంగా పలకరించే విధానం మన పూర్వీకులదే. అదే నమస్కారమనే సంస్కారం. దీనికున్న ప్రత్యేకతే వేరు.
పెద్దవాళ్లైనా, కొత్తవాళ్లైనా.. ఎవరు కనిపించినా.. మొదటిసారి కలిసినా.. ముందుగా నమస్కారం పెట్టే పద్ధతి ఉంది. చాలా ఆరోగ్యవంతమైన, మనస్పూర్తిగా పలకరించే విధానం హిందూ సంప్రదాయంలోని నమస్కారం. రెండు చేతులూ జోడించి ఎదుటి వ్యక్తికి ఇచ్చే అసలు సిసలు గౌరవం ఇది.
నమస్కారమనే సంస్కారాన్ని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారు. వస్తున్న మార్పులు, మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా నమస్కారం అట్టడుగుకి పోయింది. కానీ.. నమస్కారంతో పలకరించడం వెనక చాలా గొప్ప ఆధ్యాత్మిక విలువలు, సైంటిఫిక్ రీజన్స్ దాగున్నాయి. అసలు నమస్కారానికి ఉన్న ప్రత్యేకతేంటో ఇప్పుడు చూద్దాం..

నమస్కారం రెండు రకాలు
నమస్కారాన్ని రెండు రకాలు పెడతారు. కేవలం చేతులు జోడించి ఎదుటి వ్యక్తిని చూస్తూ నమస్కరించడం. మరొకటి.. రెండు చేతులూ జోడించి.. తలవంచి గౌరవప్రదంగా నమస్కరించే విధానం.

నమస్కారం అర్థం
నమస్కార్ అనే పదం నమ: అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. నమ: అంటే.. వందనం లేదా నమస్కారం అని అర్థం.

నమస్కారానికి రెండు చేతులు ఎందుకు జోడిస్తాం
హిందూయిజం ప్రకారం మానవ శరీరం నీళ్లు, అగ్ని, భూమి, గాలి, సూశ్యం నుంచి రూపొందిందని చెబుతుంది. ఈ విశ్వంలో అతి సూక్ష్మమైన కిరణాలు ప్రసరించేదిగా మానవ శరీరాన్ని భావిస్తారు. కాబట్టి రెండు చేతులు జోడించి నమస్కరించడం వల్ల శరీరంలోకి ఎనర్జీ ప్రసరిస్తుందని నమ్మకం ఉంది.

గౌరవ సూచకం
రెండు చేతులూ జోడించి పెట్టే నమస్కారం.. ఎదుటివ్యక్తి పట్ల గౌరవాన్ని సూచిస్తుంది.

అహంకారం
అహంకారాన్ని విడిచి అవతలవ్యక్తిపై సహృదయతను నమస్కారం వివరిస్తుంది.

జైన, బౌద్ధ మతాలు
చేతులు జోడించి నమస్కరించడం హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనది. ఈ పద్ధతిని బౌద్ధ, జైన మతాలు కూడా ఆచరించాయి.

నమస్కారం వెనక సీక్రెట్
నమస్కరించడానికి రెండు అర చేతులనూ దగ్గరికి చేరుస్తాం. అలా చేర్చడం వల్ల వేళ్ల చివర, అరచేతిలో ఉండే శక్తి కేంద్రకాలు ఉత్తేజితమౌతాయి. దాని వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తి ఎక్కువ కాలం గుర్తుంటారు.

నమస్కారమే ఎందుకు ?
నమస్కారం చేయడం వల్ల గుండె భాగంలో ఉండే చక్రం తెరుచుకుంటుంది. ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరికొకరు తమ ఆత్మ శక్తి ద్వారా అనుసంధానించబడతారు. అంటే కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఆత్మానుసంధానమైన వారధి నిర్మించుకోవడానికి నమస్కారం చేస్తాం. అంటే మాటలతో అవసరం లేకుండా.. ఒకరి మనసు, ఒకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుందనేది నమస్కారం వెనక ఉన్న రహస్యం.

ఆరోగ్యం
నమస్కారమనేది ఆరోగ్యకరమైన అలవాటని మీకు తెలుసా ? కరచాలనం చేయడం వల్ల ఒకరి చేతి క్రిములు మరొకరికి అంటుకునే అవకాశం ఉంది. అదే నమస్కారం చేస్తే వల్ల అలాంటి అవకాశాలు లేవు. అందుకే నమస్కారం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా చెప్పవచ్చు.

సైంటిఫిక్ రీజన్
నమస్కారం పెట్టే సమయంలో మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ విధమైన శక్తి విస్ఫోటనం అవుతుంది. ఇలా చేయడం వల్ల మీ జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతోంది. అంటే మిమ్మల్ని మీరు అవతలి వ్యక్తికి అర్పించుకుంటున్నారని సూచిస్తుంది. అలా అవతలి వ్యక్తిని మీతో సహకరించే జీవిగా చేసుకుంటారు.

నమ్మకం
మనం నమస్కరించే సమయంలో మన చేతులకున్న పది వేళ్లు ఒకదానికి మరొకటి తాకడం వల్ల మన శరీరంలోని కళ్లు, చెవులు, మెదడు వంటి అవయవాలలో చైతన్యం కలుగుతుంది. దీనివల్ల ఎదుటివ్యక్తిని చిరకాలం గుర్తుంచుకోవచ్చనే నమ్మకం ఉంది.



Click it and Unblock the Notifications











