Latest Updates
-
రోడ్ సైడ్ టిఫిన్ సాంబార్..ఏం రుచిరా బాబు కేక అంతే..10 నిమిషాల్లో మీ ఇంట్లో చేసుకోండిలా.. -
కన్ను అదురుతుందని ఇలా చేస్తున్నారా.. అసలు కారణం తెలిస్తే ఈ తప్పులు చేయరు.! -
డాక్టర్ సలహా..షుగర్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన 3 కూరగాయలు, 3 పండ్లు.. -
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా -
చితి మంటల్లో కూడా కాలిపోని శరీర భాగం ఇదే..99శాతం మందికి తెలియని నిజం! -
వీకెండ్ స్పెషల్..గొంతుకు హాయినిచ్చే పెప్పర్ చికెన్ గ్రేవీ..పూరీ,చపాతీ,అన్నం దేనికైనా అదుర్స్ -
పెద్దలు కుదిర్చిన పెళ్లి: మీ కాబోయే భాగస్వామి ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకున్నారా? ఇలా కనిపెట్టండి! -
విటమిన్లు, ఐరన్ పుష్కలం..చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ రోల్ చేసుకోండిలా -
బరువు తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాతో కొవ్వును కొవ్వొత్తిలా కరిగించొచ్చు! -
క్యాల్షియం, ప్రొటీన్ల ఖజానా..ఎముకలకి ఉక్కులాంటి బలాన్నిచ్చే రాగి కిచిడీ
Sheetala Saptami 2022:శీతల సప్తమి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు...
శీతల సప్తమి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
హిందూ మతంలో శీతల దేవత ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం రెండుసార్లు శీతల సప్తమి వస్తుంది.

ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షంలో సప్తమి రోజున, రెండోది శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వస్తుంది. ఈ పవిత్రమైన రోజున శీతల దేవతను ఆరాధించడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని చాలా మంది భక్తులు నమ్ముతారు.

అంతేకాకుండా.. అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతారు. అందుకే ప్రతి సంవత్సరం శీతల సప్తమి రోజున శీతలామాతను పూజిస్తారు. ఈ రోజున అమ్మవారికి నిల్వ ఉంచిన ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. అంతేకాదు.. ఈరోజున ఇంట్లో పొయ్యి వెలిగించరు. అందరూ నిల్వ ఉంచిన ఆహారాన్నే తింటారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో శీతలా సప్తమి ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం ఎప్పుడు, ఈ పవిత్రమైన రోజున ఎలాంటి పనులు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

2022లో శీతల సప్తమి ఎప్పుడు?
2022 సంవత్సరంలో శీతల సప్తమి మార్చి 24వ తేదీన గురువారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున అమ్మవారి భక్తులందరూ ఉపవాసం ఉంటారు. శీతల సప్తమి రోజున ప్రజలు తీపి వంటకాలను ఎక్కువగా వండుతారు. ఆ తర్వాత అష్టమి రోజున నిల్వ ఉంచిన ఆహారాన్ని ప్రసాదంగా పంచుతారు. శీతల సప్తమిని బాసోడ అని కూడా అంటారు.

శుభ ముహుర్తం..
2022లో శీతల సప్తమి మార్చి 24వ తేదీన గురువారం రోజున వస్తుంది. ఈ పవిత్రమైన రోజున మధ్యాహ్నం 12:09 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే శుక్రవారం నాడు 25వ తేదీన ముగుస్తుంది. ఈ మధ్యలో పూజ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

శీతల సప్తమి పూజ..
ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి. పూజా గదిని శుభ్రం చేసి, పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. అనంతరం వంటగదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం శీతల మాతను ఆరాధించడం వల్ల అన్నపూర్ణ దేవి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ఉపవాసం ఉండాలి. ఈరోజున రాత్రంతా జాగారం చేసి అమ్మవారి పూజనలు, భజనలు చేస్తారు.

శీతల సప్తమి ప్రాముఖ్యత..
శీతల మాతను ఆరాధించడం వల్ల మనిషికి తట్టు, మశూచి, కలరా, కంటి వ్యాయాధులు వంటి తీవ్రమైన వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు. అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లోని వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. అదే సమయంలో ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు. తిండికి కూడా ఎలాంటి లోటు ఉండదని చాలా మంది నమ్ముతారు.

చల్లని ఆహారం ఎందుకంటే..
శీతల సప్తమితో వేసవికాలం ప్రారంభమవుతుందని పండితులు చెబుతారు. శీతల దేవికి చల్లని పదార్థాలు చాలా ఇష్టమని, అందుకే భక్తులందరూ సప్తమి రోజున తయారు చేసిన ఆహారాన్ని అష్టమి రోజున ప్రసాదంగా తీసుకోవాలని నమ్ముతారు. అయితే శీతల సప్తమి తర్వాత పాత ఆహారానికి దూరంగా ఉండాలి. ఒక పురాణం ప్రకారం, విరాట్ అనే రాజు తన రాజ్యంలో ఉండటానికి శీతల మాతను నిరాకరించాడు. ఈ కారణంగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రజలందరూ ఎరుపు రంగు ధాన్యాలు తీసుకోవడం ప్రారంభించారు. ప్రజలందరూ వేడికి తట్టుకోలేక మరణిస్తున్నారు. దీంతో ఆ రాజు ఆ మాతకు క్షమాపణలు చెప్పాడు. ఆమెకు చల్లని పాలు మరియు లస్సీని అందజేశాడు. ఆ తర్వాత అమ్మవారు శాంతించారు.

ఇవి మరచిపోవద్దు..
* శీతల సప్తమి రోజున దీపం వెలిగించకూడదు.
* ఈ పవిత్రమైన రోజున వేడి వేడి ఆహారం తినకూడదు.
* శీతల సప్తమి రోజున మాంసాహారం జోలికి వెళ్లకూడదు.
* వంటగదిలో పొయ్యి వెలిగించకుండా చూసుకోవాలి.
* నిల్వ ఉంచిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
* కేవలం చల్లగా ఉండే పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
* స్నానం చేయడానికి వేడి నీటికి బదులుగా, చల్లని నీటిని ఉపయోగించాలి.
* శీతల సప్తమి రోజున దీపం వెలిగించకూడదు.
* ఈ పవిత్రమైన రోజున వేడి వేడి ఆహారం తినకూడదు.
* శీతల సప్తమి రోజున మాంసాహారం జోలికి వెళ్లకూడదు.
* వంటగదిలో పొయ్యి వెలిగించకుండా చూసుకోవాలి.
* నిల్వ ఉంచిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
* కేవలం చల్లగా ఉండే పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
* స్నానం చేయడానికి వేడి నీటికి బదులుగా, చల్లని నీటిని ఉపయోగించాలి.
శీతల సప్తమితో వేసవికాలం ప్రారంభమవుతుందని పండితులు చెబుతారు. శీతల దేవికి చల్లని పదార్థాలు చాలా ఇష్టమని, అందుకే భక్తులందరూ సప్తమి రోజున తయారు చేసిన ఆహారాన్ని అష్టమి రోజున ప్రసాదంగా తీసుకోవాలని నమ్ముతారు. అయితే శీతల సప్తమి తర్వాత పాత ఆహారానికి దూరంగా ఉండాలి. ఒక పురాణం ప్రకారం, విరాట్ అనే రాజు తన రాజ్యంలో ఉండటానికి శీతల మాతను నిరాకరించాడు. ఈ కారణంగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రజలందరూ ఎరుపు రంగు ధాన్యాలు తీసుకోవడం ప్రారంభించారు. ప్రజలందరూ వేడికి తట్టుకోలేక మరణిస్తున్నారు. దీంతో ఆ రాజు ఆ మాతకు క్షమాపణలు చెప్పాడు. ఆమెకు చల్లని పాలు మరియు లస్సీని అందజేశాడు. ఆ తర్వాత అమ్మవారు శాంతించారు.
2022 సంవత్సరంలో శీతల సప్తమి మార్చి 24వ తేదీన గురువారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున అమ్మవారి భక్తులందరూ ఉపవాసం ఉంటారు. శీతల సప్తమి రోజున ప్రజలు తీపి వంటకాలను ఎక్కువగా వండుతారు. ఆ తర్వాత అష్టమి రోజున నిల్వ ఉంచిన ఆహారాన్ని ప్రసాదంగా పంచుతారు. శీతల సప్తమిని బాసోడ అని కూడా అంటారు.

Click it and Unblock the Notifications