షిరిడీ సాయి లీల - భక్తుడి జబ్బును తను తీసుకోవటం

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఖార్పాడే కొడుకుకి జబ్బు: ఓం సాయిరాం శ్రీ దాదాసాహెబ్ ఖార్పాడే, ఆయన భార్య శ్రీ షిరిడీ సాయిబాబాకి పెద్ద భక్తులు. ఆయనని చాలాసార్లు వ్యక్తిగతంగా కలిసేవారు. వారి కొడుకు చిన్న ఖార్పాడేకి ఒకసారి బొబ్బలతో కూడిన ప్లేగు వచ్చింది. ఈ వ్యాధిలో శరీరం మొత్తం బొబ్బలు వచ్చి వాచిపోతాయి.

Shirdi Sai Leela - Taking illness of devotee

శ్రీమతి ఖార్పాడే షిరిడి సాయిబాబాను కలిసారు

ఓం సాయిరాం షిరిడీలో కొడుకు గురించి చింతించిన శ్రీమతి ఖార్పాడే బాబా దగ్గరికి పరుగుపరుగున వెళ్ళి, వణుకుతున్న గొంతుతో తమకొచ్చిన సమస్యను వివరించారు. బాబా దానికి జవాబుగా తన కఫ్నీ పైకి జరిపి అక్కడ ఉన్న అందరికీ నడుంపై ఉన్న నాలుగు గుడ్ల సైజున్న బొబ్బలను చూపించారు. దీనితో చిన్న ఖార్పాడే వ్యాధి నయం అయింది ఎందుకంటే బాబా అతని వ్యాధిని మొత్తం తీసేసుకున్నారు.

Shirdi Sai Leela - Taking illness of devotee

బాబా సూచన

ఓం సాయిరాం ఆ సందర్భంగా బాబా తన చుట్టూ ఉన్న భక్తులకి, తాను తన భక్తులందరి కష్టాలను తీసుకుని వారి బదులు తనే వాటిని అనుభవిస్తానని తెలిపారు.*బాబా అంటారు మీ బరువు బాధలను బాబాపై వదిలేస్తే, ఆయన తప్పక మోస్తారు.

Shirdi Sai Leela - Taking illness of devotee

షిరిడీ సాయిలీల- గురుమంత్రం ఎలా సాధించి ఇంటికొచ్చాను

గురుమంత్రం పొందాలన్న ఆశ కలగటం

ఓం సాయిరాం ఒకరోజు నేను దగ్గర్లో ఉన్న షిరిడీ సాయిబాబా మందిరానికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే నా మనసులో ఒక ఆలోచన అప్పటికప్పుడు వచ్చింది. నేను బాబా మంత్రాన్ని ఒకటి తీసుకుని, నా మనస్సులోనే ఆయన నా గురుమంత్రంగా దాన్ని అంగీకరిస్తున్నారా అని అడిగాను. ఒకవేళ అంగీకరిస్తే, పూజారిగారు బాబా పాదాలవద్ద ఉన్న ఒక ప్రత్యేక గులాబిని తీసి నాకివ్వాలి అనుకున్నారు.

Shirdi Sai Leela - Taking illness of devotee

పూజారిగారు ఆ పువ్వుని నాకిచ్చారు

ఓం సాయిరాం మనస్సులో ఈ ఆలోచన రాగానే, మూలన నిల్చున్న పూజారిగారు బాబా విగ్రహం వద్దకు నడవసాగారు. నేను కూడా విగ్రహం వైపే నడవసాగాను. నా మనస్సులో గుర్తొచ్చి అన్పించిన మంత్రమే పూజారి కూడా చదువుతూ, ఆ గులాబి తీసి నాకు ఇచ్చారు.

Shirdi Sai Leela - Taking illness of devotee

ముగింపు

ఓం సాయిరాం నేను అదే గుడికి ఇంతకుముందు వెయ్యిసార్లు వెళ్ళివుంటాను కానీ నాకు ఒక 5 సార్లు మాత్రమే పువ్వు లభించింది, అక్కడి పూజారులు సాధారణంగా ప్రతిరోజూ పువ్వులు ఇవ్వరు. ఆ సమయంలో అలా జరగటం బాబా అంతర్యామి అని తన భక్తులపై కృపను కూడా నిరూపించింది. సత్చరిత్రలో బాబా ఇలా అన్నారు,” నువ్వెక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నాకు నువ్వు ఏం చేస్తున్నావో, పూర్తిగా వివరంగా అంతా ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది”.

English summary

Shirdi Sai Leela - Taking illness of devotee

Shirdi Sai Leela - Taking illness of devotee,Om Sai Ram Mr. Dadasaheb Khaparde and his wife were ardent devotees of Shri Shirdi Sai Baba and had numerous personal interactions with him. Their son Master Khaparde once suffered from Bubonic Plague. In this bubos i.e. swellings develop on parts of the body.