Latest Updates
-
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
నమ్మలేని నిజాలు: గాంధారికి నిజంగా 101 మంది సంతానమా?
మహాభారతం...ఈ అత్యద్భుతమైన పురాణగాథను ఎంత తవ్వితే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకి తెలుస్తాయి. అటువంటి ఒక మిస్టరీ గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఈ పురాణ గాధలో ప్రస్తావించబడిన కొన్ని సంఘటనలు ఎన్నో సందేహాలను కలిగిస్తాయి. ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తాయి. ముఖ్యంగా గాంధారి అనే పాత్ర మరిన్ని సందేహాలను కలిగిస్తుంది. గాంధారికి నిజంగా 101 మంది సంతానమున్నారా అనే ప్రశ్న మహాభారతాన్ని చదివిన ప్రతి ఒక్కరిలో తప్పక ఒక ప్రశ్న ఉదయిస్తుంది.
ఈ ఇతిహాసంలో అయిదుగురు అన్నదమ్ములైన పాండవులలో ముగ్గురు కుంతీ దేవికి జన్మించారని, మరో ఇద్దరు పాండు రాజు రెండవ భార్య అయిన మాద్రికి జన్మించారని చెప్పబడి ఉంది. అయినప్పటికీ, కౌరవుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కౌరవులు వందమంది అన్నదమ్ములని వారికి ఒక సోదరి ఉన్నదని అంటారు. ఈ నిజం కొంచెం నమ్మశక్యంగా అనిపించదు?.
ప్రకృతి స్వభావాన్నే తీసుకుంటే ఒక బిడ్డకు జన్మనివ్వడానికి దాదాపుగా తొమ్మిది నెలల సమయం పడుతుంది. కాబట్టి, ఒక ప్రసవంలో ఒక గాంధారి ఒక్కొక్క సంతానాన్ని ప్రసవించిందని అనుకుంటే ఆమె నూరవ సంతానానికి జన్మనిచ్చే సమయంలో ఆమె మొదటి సంతానానికి కనీసం 75 సంవత్సరాలుంటాయి. అంటే, అప్పటికి గాంధారి వయసు ఎంత ఉండవచ్చన్నది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఒక వేల ఆమె కవలల్ని అలాగే ఒకే ప్రసవంలో ముగ్గురు పిల్లల్ని, నలుగురు పిల్లల్ని ప్రసవించిందని అనుకున్నా మహాభారత యుద్ధం అంతమయ్యేవరకు ఆమె జీవించి ఉండడం అసాధ్యమని చెప్పవచ్చు. ఒకవేళ 101 మంది సంతానాన్ని ఆమె ఒకే ప్రసవంలో కన్నాదని అనుకుందామన్న వారందరూ బ్రతికి ఉండే అవకాశాలు దాదాపు లేనట్లే.
మరి ఇదెలా సాధ్యం? కౌరవులనబడే 100 మంది నిజంగా ఉండేవారా? లేదా ఇదేమైన మిరాకిల్ ద్వారా సంభవించినదా? మనకు తెలియని ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఉంటారా? ఈ ప్రశ్నలన్నీ దాదాపు కొంచెం ఆందోళనని కలిగించేవే. ఒకసారి ఈ ఇతిహాసం గాంధారి 101 సంతానం గురించి ఏమని చెప్తుందో చూద్దాం.

వ్యాస మహర్షి వరం
"మహాభారత" ఇతిహాస రచయిత వ్యాస మహర్షి గాంధారి సేవలకు సంతుష్టుడై ఆమెకి ఒక వరాన్ని ప్రసాదించాడు. 100 మంది కొడుకులకు జన్మనిచ్చే వరాన్ని ఆమెకు ప్రసాదించాడు. ఆ రోజుల్లో ఇటువంటి వరాలు కొంచెం సాధారణమేనని కొన్ని ఇతిహాసాల ద్వారా అర్థమవుతుంది. గాంధారి విషయంలో కచ్చితంగా 100 మంది సంతానం వ్యాస మహర్షి ఇచ్చిన వరమని అంటారు.

గాంధారి ఆగ్రహం
కురు వంశానికి చెందిన ధృతరాష్ట్రుడుని గాంధారి వివాహమాడింది. అయితే, చిన్నతనం నుంచే ధృతరాష్ట్రుడు అంధుడు కావడం చేత రాజ్యాన్ని పాలించే అవకాశం అతని తమ్ముడు పాండు రాజుకు దక్కింది. ఈ నిజం ధృతరాష్ట్రుడితో పాటు ఆయన భార్య గాంధారిని కూడా బాగా మనస్తాపానికి గురి చేసింది. అందువల్ల పాండురాజు- కుంతీల కంటే ముందుగా పిల్లల్ని కనాలని ఆశించేవారు. తద్వారా, తమ కుమారుడే రాబోయే కాలంలో రాజవుతాడని ఆశించారు.

గాంధారి ఆగ్రహం
కుంతి కంటే ముందు గర్భం దాల్చినందుకు గాంధారి ఎంతో ఆనందం చెందింది. కాని, ఇంతలోగా దురదృష్టం ఆమెను వెంటాడింది. ఆమె కలలను కల్లలు చేసింది. రెండేళ్ళ పాటు జన్మనివ్వలేకపోయింది. మరోపక్క కుంతీ తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది. దీంతో, గాంధారి ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని అణచుకోలేకపోయింది. తన గర్భంపై పదే పదే కొట్టుకుని తనను హింసించుకుంది.

మాంసపు ముద్ద
ఆగ్రహంతో గాంధారి తనను తాను విపరీతంగా హింసించుకోవడం వల్ల ఆమె ఒక మాంసపు ముద్దకు జన్మనిచ్చింది. దీంతో వ్యాస మహర్షిని అక్కడకు పిలిపించారు. వెంటనే వంద నేతి సీసాలను తెప్పించమని వ్యాస మహర్షి ఆదేశించారు. ఆ సమయంలో గాంధారి తనకు అమ్మాయి కూడా కావాలన్న కోరికను వ్యక్తపరిచింది. వంద సీసాలు సిద్ధం కాగానే, వ్యాస మహర్షి మాంసపు ముద్దను వంద భాగాలుగా విభజించి ఒక్కొక్క ముద్దను ఈ సీసాలలో ఉంచారు. ఈ సీసాలను భద్రపరచమని గాంధారికి సూచించారు. ఆ విధంగా గాంధారి 100 మంది కొడుకులకు, ఒక కుమార్తె(దుశ్శాల)కు జన్మనిచ్చింది.

అద్భుతమా? లేదా ఆధునిక శాస్త్ర మహిమా?
గాంధారి సంతానజన్మరహస్యానికి సంబంధించి ఎంతో మంది ఎన్నో థియరీస్ తో ముందుకొచ్చారు. కాని, కొన్ని మాత్రమే అందులో సరైనవిగా అనిపిస్తాయి. అటువంటి ఒక థియరీ ఇన్-విట్రో ఫెర్టిలైసేషన్(IVF). ఈ పద్దతి ప్రస్తుత కాలంలో ఎంతో ప్రాధాన్యతను పొందింది. వ్యాస మహర్షికి ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన విజ్ఞానం ఉన్నాదని ఈ థియరీ చెప్తోంది. అందువల్లే గర్భస్థ పిండాలను సీసాలలో పెట్టి వాటి ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడాని అంటారు.ఈ థియరీలో చెప్పబడిన విషయాలు నమ్మశక్యంగా లేవని ఎన్నో విమర్శలున్నాయి.

అద్భుతమా? లేదా ఆధునిక శాస్త్ర మహిమా?
ఇంకొక సిద్ధాంతం ప్రకారం గాంధారికి దుర్యోధన, దుశ్శాసనలనే ఇద్దరే సంతానం. వీరి గురించే మహాభారతంలో ఎక్కువగా ప్రస్తావించబడి ఉంది. అయితే, అక్కడక్కడా కౌరవుల ప్రస్తావనలో వికర్ణ, యుయుస్తు అనే పేర్లు పేర్కొనబడినవి. అయితే, వీరిలో ఎక్కువగా పాండవులకు అనుకూలభావనలు ఎక్కువగా ఉండేవని అంటారు. అందువల్ల, ఈ సిద్ధాంతాన్ని కూడా నమ్మలేమనే విమర్శలున్నాయి.



Click it and Unblock the Notifications











