For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తిరుమలలో శ్రీనివాసుని కంటే వరహ స్వామినే మొదట ఎందుకు దర్శించుకోవాలి?

|

ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఏకైక క్షేత్రం తిరుమల కొండ. బహుశా ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని కూడా, అనునిత్యం, తిరుమలను దర్శించుకున్న విధంగా, వేలాది-లక్షలాది మంది సందర్శించరేమో!

తిరుమల పుణ్య క్షేత్రమంటే, సాక్షాత్తు, శ్రీ మహావిష్ణువు నివాసమైన శ్రీ వైకుంఠమే! మహావిష్ణువిక్కడ "ఆనంద నిలయం" అనే తన "బంగారు మేడ" లో, ఏడుకొండల వాడని, తిరుమలేశుడని, శ్రీనివాసుడని, శ్రీ వేంకటేశ్వరుడని, గోవిందుడని, బాలాజీ అని... ఒక్కో భక్తుడికి, ఒక్కో పేరుతో దర్శనమిస్తున్నాడు.

 significance of first visit to Varaha Swamy!

కలియుగ తిరువేంకటనగరి నాధునిగా కలియుగంలో భక్తులకు కొంగుబంగారమైనది. దివ్వారామం తిరుమలలో నిత్యం కల్యాణంగా గోవిందుడు భక్తులకు దర్శనిమిస్తున్నాడు. సప్తాచల నిలయంలోని ఏడో కొండైన వెంకటాచలంలో దివ్వారామంవుంది. పురాణాలు, శాస్త్రాలు, స్థల మహాస్యాలు, ఆళ్వార్ల ప్రబంధాల్లో తిరుమల గురించి సవివరంగా వివరించారు. తిరునగరి దర్శన భాగ్యం గురించి రుగ్వేదంలోను అష్టాదశపురాణాల్లోనూ ప్రస్తావన ఉంది.

 significance of first visit to Varaha Swamy!

శ్రీనివాసుడు తిరుములను తన ఆవాసంగా మలచుకుని భక్తజనవరదుడిగా మారి ఐదు వేల సంవత్సరాలయింది. అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని శ్రీవేంకటేశుడు వరాహస్వామి వద్ద బహుమతిగా తీసుకున్నాడు. అందుకు ప్రతిగా తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకువచ్చేలా చూస్తానని ఓ హామీ ఇచ్చాడు.

తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖం గా శ్రీవరాహ స్వామి ఆలయం వుంది. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.

 significance of first visit to Varaha Swamy!

వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందు న వరాహస్వామికి తొలిదర్షనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి ఈ రాగిరేకు ని నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు.తిరుమల వెళ్ళే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్షించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.

English summary

significance of first visit to Varaha Swamy!

significance of first visit to Varaha Swamy!, Varaha It is the third avatar of Lord Vishnu. The meaning of the word, Varaha means a wild boar. Lord Vishnu took this incarnation to kill a demon named Hiranyaksha who carried the Earth to the bottom of the cosmic world. After defeating Hiranyaksha, Lord Vishnu i
Story first published: Friday, June 17, 2016, 16:29 [IST]
Desktop Bottom Promotion