Latest Updates
-
బుద్ధ పూర్ణిమ ఈసారి ఎప్పుడొస్తోంది? బ్యాంక్ పనులు ఉన్నవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే!
దుర్గా మాత నవరాత్రుల్లో వచ్చే ప్రత్యేక వాహనాల గురించి తెలుసా..
తెలంగాణలో అయితే బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తొమ్మిది రోజులు రంగు రంగుల పూలతో వేడుకలను నిర్వహించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజిస్తారు.
ఈ ఏడాది హిందువుల క్యాలెండర్ ప్రకారం నవరాత్రులు సెప్టెంబర్ 29వ తేదీన ప్రారంభమవ్వనున్నాయి. నవరాత్రులు ముగిసిన వెంటనే దశమి రోజు అంటే దసరా పండుగను హిందువులందరూ ఘనంగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది భక్తులు బెజవాడ కనకదుర్గమ్మను ఈ తొమ్మిది రోజులు అత్యంత పవిత్రమైన సమయంగా భావించి పూజలు చేస్తారు.

అలాగే కలకత్తాలో, వారణాసిలో, మైసూరుతో పాటు ఇతర ప్రముఖ ప్రాంతాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. అంతేకాదు ఈ నవరాత్రుల్లో ప్రత్యేక వాహనాలపై వచ్చి ప్రత్యేక సందేశాలిస్తారని చాలా మంది నమ్ముతారు. అమ్మవారి వాహనం సింహం అని అందరికీ తెలుసు.

కానీ ప్రతి ఏడాది వచ్చే నవరాత్రుల్లో దుర్గాదేవి వేర్వేరు వాహనాలపై స్వారీ చేస్తారని చాలా మందికి తెలీదు. అలాగే అమ్మవారు వీడ్కోలు సమయంలో కూడా విభిన్నమైన వాహనాలు ఉంటాయని పురాణాలలో పేర్కొన్నారు. ఈ ఏడాది దుర్గామాతను ఏ వాహనంలో వస్తారో మరియు ఏ వాహనంలో వీడ్కోలు పలుకుతారో తెలియాలంటే మీరు కిందికి స్క్రోల్ చేయాల్సిందే.

మహాపరవ క్యాలెండర్ ప్రకారం..
మహాపరవ హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్విన్ నెల శుక్ల పక్షం యొక్క ప్రతిపాదలో శరత్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ సారి శరత్ నవరాత్రులు సెప్టెంబర్ 29వ తేదీన అంటే ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 7వ తేదీకి నవమి పూర్తవుతుంది. ఆ మరుసటి రోజే అంటే అక్టోబర్ 8వ తేదీన దసరా పండుగను జరుపుకుంటారు. ఈ వేడుకతో తల్లి మహాపరవ ముగుస్తుంది.

ఏనుగుపై స్వారీ..
ఈ నవరాత్రుల్లో దుర్గామాత వచ్చే వాహనాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అవి చూడగానే భక్తులను బాగా ఆకట్టుకుంటాయి. అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేయి కళ్లతో వేచి చూస్తారు. వారణాసి పంచాంగం మరియు మిథిలా పంచాంగం ప్రకారం అమ్మవారు ఏనుగుపై స్వారీ చేస్తారు.

తొమ్మిది రూపాల్లో..
నవరాత్రుల్లోని తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారు భక్తుల గోడును కచ్చితంగా వింటారని, తమ కోరికలను తప్పకుండా నెరవేరుస్తుందని భక్తులందరూ నమ్ముతారు. తొలిరోజు శైలపుత్రి, రెండోరోజు బ్రహ్మచారిణీ, మూడోరోజు చంద్రఘంట, నాలుగో రోజు కుష్మండ, ఐదో రోజు స్కంద మాత, ఆరోరోజు కాత్యాయాణి, ఏడో రోజు కలరాత్రి, ఎనిమిదో రోజు మహాగౌరి, తొమ్మిదో రోజు సిద్ధపత్రి రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు. ఈ రూపాలను ఎక్కువగా ఉత్తర భారతంలో పూజిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో..
అదే తెలంగాణలో అయితే బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తొమ్మిది రోజులు రంగు రంగుల పూలతో వేడుకలను నిర్వహించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజిస్తారు. తొలిరోజు శ్రీ బాలా త్రిపురా సుందరి దేవీగా, రెండో రోజు శ్రీ గాయత్రి దేవిగా, మూడో రోజు మహాలక్ష్మీ అవతారంలో, నాలుగో రోజు శ్రీ అన్నపూర్ణ దేవీగా, ఐదో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, ఆరో రోజు శ్రీ మహా సరస్వతి దేవిగా (మూల నక్షత్రం నాడు), ఏడో రోజు శ్రీ దుర్గా దేవి అలంకారంలో, ఎనిమిదో రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా, తొమ్మిదో రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించబడి భక్తులందరినీ ఆశీర్వదిస్తారు.
తెప్పోత్సవం..
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడలో కనక దుర్గమ్మ విగ్రహాలను క్రిష్ణా నదిలోకి తీసుకెళ్లి తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. హంస వంటి ఆకారంలో పడవను తయారు చేస్తారు. ఆ పడవకు రంగు రంగుల విద్యుత్ దీపాలంకరణ చేస్తారు. తెలంగాణలో బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు.

ఉత్తర భారతంలో వీడ్కోలు ఇలా..
వారణాసి పంచాంగం ప్రకారం దుర్గామాత యొక్క వీడ్కోలు గుర్రంపై ఉంటుంది. ఇది శుభం కాదని చాలా మంది నమ్ముతారు. అయితే మిథిలా పంచాంగం ప్రకారం అమ్మవారి పరమ పవిత్రంగా భావించే పడవలో వీడ్కోలు ఉంటుంది.

పవిత్ర సోమవారాలు..
ఈ సారి వచ్చే నవరాత్రుల్లో రెండు సోమవారాలు ఉండటం విశేషం. ఇలా రెండు రోజులు సోమవారం రావడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. సోమవారం రోజున అమ్మవారిని పూజిస్తే అనేక ఫలాలు లభిస్తాయని చాలామంది భక్తులు నమ్ముతారు.



Click it and Unblock the Notifications