Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
త్రిలింగ క్షేత్రాలు అంటే ఏంటో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లోని ఈ పరమేశ్వరుడి క్షేత్రాలు దర్శించుకుంటే ఎంతో పుణ్యం
శ్రీశైల క్షేత్రం జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే కాళేశ్వరాన్ని దక్షిణకాశిగా పిలుస్తారు. పంచరామాల్లో ఒకటైనది దాక్షారామం. ఈ మూడు శైవ క్షేత్రాలను కలిపి త్రిలింగ క్షేత్రాలు లేదా త్రిలింగ దేశం, త్రిలింగ దేవాలయాలు అని పిలుస్తారు. త్రిలింగ, త్రైలింగ్, తెలుంగు, తెలుగుగా భాష తత్సమము, తద్భవము, దేశీయముగా మారుతూ వచ్చింది. ఈ త్రిలింగ క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతమే కాలక్రమంలో తెలంగాణగా మారినట్లు చెబుతారు.
త్రిలింగ క్షేత్రాల్లో దేనికదే ప్రత్యేకమైనది. శ్రీశైల మల్లిఖార్జున స్వామి, ద్రాక్షారామం, కాళేశ్వరం అన్ని శైవ క్షేత్రాలే. ఈ మూడు పరమేశ్వరుడి దివ్య క్షేత్రాలను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, పరమేశ్వరుడి కృపకు పాత్రులు కాగలరని, భోళా శంకరుడు ఆనందింది అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. త్రిలింగ క్షేత్రాల్లోని మూడు ఆలయాల విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం.

శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం, శ్రీశైలం
శ్రీశైలం మల్లికార్జున ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. పార్వతీ దేవి యొక్క 18 శక్తి పీఠాల్లో శ్రీశైలం ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం మల్లికార్జున ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అలాంటి ఈ దేవాలయాన్ని శివునికి ఇష్టమైన శ్రావణ మాసంలో దర్శించుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రావణమాసంలో శ్రీశైల శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్షించుకుంటే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని అంటారు. చీడపీడతో, దిగుబడి తగ్గడం లాంటి అనేక సమస్యలతో బాధపడే రైతులు ఈ నెలలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుంటే పొలాలు సమృద్ధిగా ఉంటుందని అంటారు. పాడి రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందని చెబుతారు.
భీమేశ్వర స్వామి దేవాలయం, ద్రాక్షారామం, తూర్పుగోదావరి
భీమవరం లోని సోమేశ్వర ఆలయం 2 కిలోమీటర్ల దూరంలోని గునుపూడి లో కలదు. ఈ ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడి లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించాడని స్థల పురాణంలో చెప్పబడింది. చంద్రుడి పేరు మీద ఇక్కడి స్వామివారిని సోమేశ్వర స్వామి అని అంటారు. ఈ ఆలయ ప్రత్యేకత విషయానికి వస్తే, అమావాస్య నాడు చంద్రుడు బూడిద లేదా గోధుమ రంగులోనూ మరియు పౌర్ణమి నాడు తెలుపు రంగులోనూ స్వామి వారు దర్శనమిస్తాడు.
శ్రీకాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కాళేశ్వరం, కరీంనగర్
పవిత్ర గోదారవరి నదికి ఉపనది అయిన ప్రాణహిత కలిసే చోట ఉంటుంది కాళేశ్వర క్షేత్రం. ఈ ఆలయం పేరు మీదుగానే తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు అనే పేరు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి గాంచిన త్రిలింగ క్షేత్రాల్లో కాళేశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం ఎంతో మహిమ కలది. కరీంనగర్ కు 125 కిలోమీటర్ల దూరంలో మహాదేవపూర్ మండలానికి సమీపంలో దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల నడుమ, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రానికి చాలా విశిష్టత ఉంది.
సాధారణంగా ఏ గర్భగుడిలో అయినా ఎన్ని శివలింగాలు ఉంటాయి. ఒకటే కదా.. కానీ కాళేశ్వర క్షేత్రం అందుకు మినహాయింపు. ఎందుకంటే కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం గర్భగుడిలో రెండు శివలింగాలు పూజలు అందుకుంటాయి. అందులో ఒక శివలింగాన్ని ముక్తేశ్వరుడిగా(శివుడిగా), మరొకటేమో కాళేశ్వరునిదిగా(యముడు) గా పూజిస్తారు. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా.. భారత్ లో మరో చోట కనిపించదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications