Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
Sabarimala devotees: అయ్యప్ప భక్తులకు అలర్ట్..శబరిమల వెళ్లేటప్పుడు ఇలా చేస్తే జైలు శిక్ష
మనదేశంలోని మగతా ప్రాంతాలతో పోలిస్తే ఏపీ,తెలంగాణ,తమిళనాడు, కేరళలోనే అయ్యప్పస్వామి మాలలు(ayyappa mala) వేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. అక్టోబర్, నవంబర్ లో ఎక్కువగా అయ్యప్ప దీక్ష చేపడతారు. 41 రోజుల పాటు ఎంతో నియమ నిష్ఠలతో దీక్ష పూర్తి చేసుకొని శబరిమల(sabarimala) వెళ్లి 18 మెట్లు ఎక్కి ఇరుముడి సమర్పిస్తారు. కొంతమంది అక్కడే మాల తీస్తారు..కొందరు అయితే ఇంటికొచ్చిన తర్వాత తీస్తారు. అయితే ప్రస్తుతం శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది.
మన తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో శబరిమలకు వెళ్తున్నారు. యాత్రికుల సౌకర్యార్థం రైల్వే శాఖ కూడా ఏపీ,తెలంగాణ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు(sabarimala special trains) నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు వైజాగ్, శ్రీకాకులం రోడ్,సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ,కాకినాడ,తిరుపతి తదితర స్టేషన్ల నుంచి బయలుదేరతాయి.

అయితే రైళ్లల్లో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు(ayyappa devotees) సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా కీలక సూచన చేసింది. అయ్యప్ప భక్తులు రైళ్లల్లో ప్రయాణిస్తున్న సమయంలో పూజా విధానంలో భాగంగా కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం, అగరబత్తులు వెలిగించడం వంటివి చేస్తుండటం తమ దృష్టికి వచ్చిందని..అయితే అలా చేయడం పూర్తిగా నిషేధం అని,దీని వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని దక్షిణ మధ్య రైల్వే(south central railway) సూచించింది. రైళ్లలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. మండే స్వభావం కలిగిన పదార్థాలు అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయని తద్వారా భారీగా ప్రాణ,ఆస్తి నష్టం జరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
మరోవైపు, కేరళలో ఇడుక్కి, పథనంథిట్ట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శబరిమల వెళ్లే భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు. సాథ్రం నుంచి శబరిమలకు వెళ్లే అటమీ మార్గాన్ని మూసివేస్తున్నట్లు..అలాగే నదిలోకి, స్నానపు ఘాట్ లోకి ప్రవేశాలను నిలిపివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గే వరకు ఈ రూల్స్ అయల్లో ఉంటాయని తెలిపారు.



Click it and Unblock the Notifications