Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గంగాజలం ఎందుకంత ప్రాధాన్యత సంతరించుకుంది ?
భారతదేశంలో గంగాజలానికి చాలా ప్రాధాన్యత ఉంది. గంగాజలం చాలా పవిత్రమైనది, శక్తివంతమైనదని మన భారతీయులు నమ్ముతారు. అందుకే ఏ ఒక్క పూజ గంగాజలం లేకుండా పూర్తికాదు. గంగాజలంలో మునిగినా, గంగా జలం సేవించినా.. ఎంతో పుణ్యమని విశ్వసిస్తారు. గంగాజలం ఇంతటి ప్రాధాన్యత పొందడానికి కారణమేంటి ? గంగాజలం ఎందుకు అంత పవిత్రమైనది ?
గంగాజలంలో శుద్ధిచేసే తత్వం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. పూజాకార్యక్రమాల్లో గంగాజలం ఉపయోగిస్తే.. ఎలాంటి దోషం ఉన్నా తొలగిపోతుందని భక్తుల నమ్మకం. పరమ పవిత్రమైన గంగానదిలో మునిగితే.. స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. అందుకే గంగానదిపై అనేక అధ్యయనాలు కూడా జరిగాయి. ఈ అధ్యయనాలు గంగాజలం గురించి ఏం చెబుతున్నాయి.

స్వర్గానికి సంబంధించిన
మన పాపాలన్నీ కడగడానికి స్వర్గలోకం నుంచి వచ్చిన జలముగా గంగాజలానికి ప్రత్యేకత ఉంది.

గంగానదిగా పేరు
భగీరథుడు గంగాజలాన్ని భూమ్మీదకు తీసుకొచ్చాడని పౌరాణిక కథలు వివరిస్తున్నాయి. హిమాలయాల్లోని గౌముఖ్ దగ్గర గంగా నది ముందుగా భగీరథగా ఉద్భవించింది. తర్వాత 75 చదరపు మైళ్లు ఇది ప్రవహించి.. దేవప్రయాగలోని అలకనందలో కలిసిపోతుంది. ఇలా కలవడం వల్ల ఈ నదికి గంగానదిగా పేరు వచ్చింది.

ఉపనదులు
గంగానదుల్లోకి కలిసే మరో పెద్ద నది.. కైలాస పర్వతానికి అతి దగ్గరగా ఉన్న ఘాగరా నది గంగానదిలో కలుస్తుంది. అలాగే కాట్మాండుకి దగ్గరలోని ఘాంటాక్ అనేది పవిత్ర నది. ఈ రెండు నదుల పవిత్ర జలం గంగానదిలో కలవడం వల్ల.. ఈ నీళ్లు చాలా పవిత్రమయ్యాయని ఆధ్మాత్మిక వేత్తలు చెబుతారు.

త్రిమూర్తులు 1
గంగాజలం హిందువులు విశ్వసించే బ్రహ్మ, విష్ణు, శివులతో కలిసినదిగా చెబుతారు. బ్రహ్మ గంగాజలాన్ని త్రివిక్రముని అవతారంలో మహావిష్ణువు పాదాలు కడగడానికి ఉపయోగించారట.

త్రిమూర్తులు 2
భూమ్మీద ప్రశాంతత కల్పించడానికి తన తల నుంచి గంగాజలాన్ని భూమ్మీదకు పంపడానికి శివుడు అంగీకరించాడు. అందుకే శివుడికి గంగాధరుడు అనే పేరు ఉంది.

గంగాజలం ప్రత్యేకత
మహర్షి వేదవ్యాసుడు గంగా జలాన్ని దుష్టశక్తుల నిర్మూలను ఉపయోగించారట. గంగానదిలో మునగడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. గంగానదిలో చనిపోయిన వాళ్ల అస్థికలు కలపడం వల్ల వాళ్లకు విముక్తి లభిస్తుంది.

పరిశుభ్రమైనది
గంగాజలంలో అనేక గుణాలున్నాయి. ఇందులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండటం వల్ల పూజలకు ఉపయోగిస్తారు.

యాంటీ బ్యాక్టీరియల్
గంగాజలంపై జరిగిన అధ్యయనాల్లో అత్యంత ఆసక్తికర విషయం తేలింది. గంగాజలంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నయని సైంటిఫిక్ గా నిరూపించబడింది. అందుకే ఈ నీటిని సేవించడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications