Latest Updates
-
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..
శ్రీవారికి కళ్యాణం జరిపించినా, లేదా శ్రీవారి కళ్యాణం వీక్షించిన పొందే ఫలితాలేంటి...?
తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువు గా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు.
నిత్యకల్యాణం .. పచ్చతోరణం అనే మాట వేంకటేశ్వరస్వామికి సంబంధించినదే. అసలే వైభవంతో వెలుగొందే స్వామి .. అలాంటి ఆయన కల్యాణోత్సవం చూడటానికి రెండుకళ్ళూ చాలవు. స్వామి కల్యాణోత్సవాన్ని తిలకించడమే ఈ జన్మకి దక్కిన మొదటి అదృష్టమైతే, ఇక ఆ స్వామికి కల్యాణోత్సవాన్ని జరిపించడం వలన ఎంతటి పుణ్యఫలితాలు కలుగుతాయో అర్థం చేసుకోవచ్చు.
అందుకే తిరుమలలో స్వామికి కల్యాణం జరిపించడానికి భక్తులు పోటీలు పడుతుంటారు. ఇక అంతవరకూ వెళ్లే అవకాశం లేని వాళ్లు తమకి దగ్గరలో గల వేంకటేశ్వరస్వామికి కల్యాణం జరిపిస్తుంటారు. అవకాశాన్ని బట్టి కుటుంబసభ్యుల వరకూ .. బంధువులను పిలిచి ఈ వేడుకను జరుపుతుంటారు. మనసులోని కోరికలు ఫలించడం కోసం .. ఫలించడం వలన ఈ వేడుకను జరిపిస్తుంటారు.
ఇక ప్రతి ఏడాది ఈ వేడుకను జరిపించే భక్తుల సంఖ్య కూడా అధికంగానే వుంటుంది. వేంకటేశ్వరస్వామికి .. అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో ఇలా కల్యాణాన్ని జరిపించడం వలన, సమస్త కష్టనష్టాలు తొలగిపోతాయి. దోషాలు .. పాపాలు .. నశించిపోతాయి. దారిద్ర్యము .. దుఃఖము దూరమై ఆయురారోగ్యాలు కలుగుతాయి. స్వామివారి కల్యాణాన్ని చేయించినవారికి ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో, చూసినవారికి సైతం అంతటి పుణ్యఫలం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది. శ్రీవారికి నిత్యకళ్యాణం అనే మాట ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? శ్రీవారికి కళ్యాణం జరిపించినా, లేదా శ్రీవారి కళ్యాణం వీక్షించిన పొందే ఫలితాలేంటో? తెలుసుకుందాం...

1. శ్రీవారి విహహా వేడుక
శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీమలయప్పస్వామికి ప్రతినిత్యం కల్యాణోత్సవం జరుగుతుంది. రెండవ అర్చన, గంట, నివేదన పూర్తయిన తర్వాత శ్రీవారి ఉత్సవమూర్తులు సకల రాజమర్యాదలతో తిరుచ్చిని అధిరోహించి, ఆనందనిలయం నుండి సంపంగి ప్రదక్షిణలో గల కల్యాణమండపానికి తరలివస్తారు.

శ్రీనివాసునికి నిత్యం కళ్యాణం అనే మాట ఎందుకు వచ్చింది..?
2. 15వ శతాబ్దంలో తాళ్లపాక వంశస్థులచే ఈ కల్యాణోత్సవం ఆరంభించబడినట్లు శాసనాలవల్ల తెలుస్తూంది. తాళ్లపాక వంశస్థులే నేటికీ కన్యాదాతలుగా వ్యవహరించటం గమనార్హం. అయితే క్రీ. శ 1546లో ఇదొక ఉత్సవంగా మారింది.

శ్రీనివాసునికి నిత్యం కళ్యాణం అనే మాట ఎందుకు వచ్చింది..?
3. తిరుమల ఆలయంలో కళ్యాణోత్సవాలు మొదట కళ్యాణమండపంలో జరిగేవి. శ్రీవారిని సేవించాక తిరుమామణి మండపం దాటాక ప్రదక్షణం చేసేవేళా ఎడమవైపు కనిపించే మండపమే కల్యనమందపం.కాని క్రమంగా ఇది రంగా నాయకుల మండపానికి ,తదనంతరం మరో చోటకి (సంపంగి ప్రదక్షనలోకి)మారింది.

శ్రీనివాసునికి నిత్యం కళ్యాణం అనే మాట ఎందుకు వచ్చింది..?
4 మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవులను వివాహమాడడం కల్యాణోత్సవం. సామాన్య వ్యక్తులకు జరిగే వివాహ పద్దతిలోనే ప్రవరలు, కంకణధారణ, మంగళాస్టకాలు, బాసికాలు మొదలయిన తంతు జరగడం ఒక ప్రతేకత.

శ్రీనివాసునికి నిత్యం కళ్యాణం అనే మాట ఎందుకు వచ్చింది..?
5. సర్వజనులు క్షేమ స్థైర్య ధైర్యాదులతో ఉండాలనీ స్త్రీలు ఈ జన్మలోనూ రాబోవు జన్మలోను సువాసినులుగా ఉండాలనే మహాసంకల్పంతో ఏడు కొండలరాయనికి కళ్యాణోత్సవం చేయటం పరిపాటి.

శ్రీనివాసునికి నిత్యం కళ్యాణం అనే మాట ఎందుకు వచ్చింది..?
6. ఈ నిత్యకల్యాణం వల్లనే శ్రీవారికి కల్యాణచక్రవర్తి అని, తిరుమల క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నదని ప్రశస్తి ఏర్పడింది.
శ్రీవారికి కళ్యాణం జరిపించడం వల్ల పొందే ఫలితాలు:

శ్రీనివాసునికి నిత్యం కళ్యాణం అనే మాట ఎందుకు వచ్చింది..?
6. మీకు వివాహ అడ్డంకులా.. ఎన్ని సంబంధాలొచ్చినా కుదరట్లేదా... అయితే శ్రీవారి కళ్యాణోత్సవాన్ని చూడండి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షిస్తే.. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి.

శ్రీనివాసునికి నిత్యం కళ్యాణం అనే మాట ఎందుకు వచ్చింది..?
7 . అలాగే శ్రీవారికి కళ్యాణోత్సవం చేయిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.

శ్రీనివాసునికి నిత్యం కళ్యాణం అనే మాట ఎందుకు వచ్చింది..?
8 . అంతేకాదు.. శ్రీవారి కళ్యాణోత్సవ మహోత్సవాన్ని కనులారా వీక్షించే వారికి కుజ, రాహు దోషాలు తొలగిపోయి.. పెళ్లిళ్లు కుదురుతాయని, వివాహ అడ్డంకులు తొలగిపోయి పెళ్లి జరుగుతుందని వారు చెబుతున్నారు.

శ్రీనివాసునికి నిత్యం కళ్యాణం అనే మాట ఎందుకు వచ్చింది..?
9. అంతేగాకుండా శ్రీవారి కళ్యాణాన్ని చేయించే వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

శ్రీనివాసునికి నిత్యం కళ్యాణం అనే మాట ఎందుకు వచ్చింది..?
10. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం ఎవరైనా ఎక్కడైనా చేసుకునే భాగ్యాన్ని టిటిడి కల్పిస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాపింపజేసే దిశగా టిటిడి శ్రీ కల్యాణోత్సవ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది.



Click it and Unblock the Notifications











