Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పురాణాలలో స్త్రీ పురుష అంతర్భేద కధలు
భారత దేశం లో స్త్రీల పట్ల వివక్ష చూపిస్తారని ఒక అపవాదు ఉంది.కానీ మీరు చరిత్ర ని తిరగేస్తే ఇది నిజం కాదని స్పష్టమవుతుంది.పురాణాలలో ఈ సంప్రదాయానికి వ్యతిరేక ఉదాహరణలు బోలెడు కనిపిస్తాయి.
అనేక సందర్భాలలో స్త్రీ పురుష తత్వాల మధ్య విభజన రేఖ అస్పష్టం గా ఉండటం మీకు కనపడుతుంది..పురాతన కవులు, రచయితలు ఈ స్త్రీ పురుష వివక్ష ని ధైర్యం గా తరచి చూసి ఒక్కోసారి మార్చడానికి కూడా ప్రయత్నించారు.
మీ కర్మానుసారం మీరు ఆడ, మగ గానో, జంతువుగానో లేదా చెట్టుగానో పుడతారు.ఎలా పుట్టినా మృత్యు సమయం లో ఆత్మ జీర్ణ వస్త్రాన్ని విడిచిపెట్టినట్లు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అందుకే ఆత్మ స్త్రీ లేదా పురుష లింగం కాదు.
ఇప్పుడు మనం హిందూ పురాణాలలో లింగ వివక్ష కి అందని కధలు చూద్దాము.ఈ కధలలో మగవారు ఆడవారి పాత్ర పోషించడానికి సిద్ధపడ్డ సంఘటనలు,మగవారు గా బ్రతికిన ఆడవారు,ఇంకా ఆడా మగా ఒకటే అని నిరూపించే కధలని చూద్దాము.
ఇవి చదివి మీ భావాలని, కామెంట్లని దిగువ తెలియచెయ్యడానికి సంకోచించకండి.

అర్ధనారీశ్వరుడు;
"అర్ధనారీశ్వర" శబ్దానికి సగం స్త్రీ సగం పురుష తత్వం కలిగిన భగవంతుడని అర్ధం. మహా శివుడు మరియు ఆయన దేవేరి పార్వతి యొక్క ఏక రూపం ఈ అర్ధనారీశ్వరం.ఈ రూపం పురుష స్త్రీ తత్వాల ఏకీకరణకి ప్రతీక.ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు లేరూని ,ఒకళ్ళు ఇంకొకళ్ళ కంటే ఎక్కువ కాదు అనీ, మరియు తనలో ఈ రెండు లక్షణాలనీ ఉంచుకున్నవాడే పరిపూర్ణ జీవితం గడపవచ్చనీ ఈ రూపం మనకి తెలియచేస్తుంది.

మోహిని
శ్రీ మహా విష్ణువు అవతారం గా మోహినీ అవతారం మనకి హిందూ పురాణాలలో చాలా చోట్ల కనిపిస్తుంది.ఈ రూపాన్ని గురించి మూడు ముఖ్య కధలు చెప్తారు.మొదటిది సాగర మధనం తరువాత అమృతానికి సంబంధించిన తగవు తీర్చడానికి వచ్చిన రూపం.శ్రీ మహా విష్ణువు అందమైన మోహినీ రూపం ధరించి తెలివిగా అమృతాన్ని దేవతలకి మాత్రం పంచుతాడు.రెండోది పరమేశ్వరుణ్ణి భస్మాసురుడు అనే రాక్షసుడి బారి నుండీ కాపాడిన మోహినీ అవతారం.ఈ మనోహరమైన మోహినీ అవతారం భస్మాసురుడు తననను తాను అంతం చేసుకునేటట్లు చేసింది.మనోహరమైన మోహినిని పరమేశ్వరుడు మోహించడం వల్ల అయ్యప్ప జననమయ్యింది.అయ్యప్ప దక్షిణ భారతం లో ప్రసిద్ధి చెందిన భగవత్ స్వరూపం.ఇంక మూడోది మహా భారతం లో.అర్జునుడి కొడుకైన అరవనుణ్ణి యుద్ధం లో పాండవుల విజయం కోసం బలి ఇవ్వ వలసి వస్తుంది.కానీ అరవణుడికి చనిపోయే ముందు వైవాహిక సుఖాలని అనుభవించాలని కోరిక ఉంటుంది.కానీ చావు రాసి పెట్టి ఉన్న ఈ మనిషి ని పెళ్ళాడేందుకు ఏ స్త్రీ ముందుకురాకపోయేసరికి శ్రీ కృష్ణుడే మోహిని గా మారి అరవనుణ్ణి పెళ్ళాడి అతను చనిపోయాకా దఃఖిస్తాడు.

శిఖండి
ద్రుపద మహారాజుకి కుమార్తె గా పుట్టిన శిఖండి ని మగ పిల్లవాడిలాగ పెంచుతారు.కొన్ని కధల ప్రకారం శిఖండి కి అమ్మాయినిచ్చి పెళ్ళి చేసారుట కూడా. శిఖండి తన స్త్రీ తత్వాన్ని తాను వైవాహిక జీవితం గడపడానికీ , భీష్ముడిని చంపటానికీ ఒక యక్షునికిచ్చినట్లు కూడా కొన్ని కధలు ప్రచారం లో ఉన్నాయి. చాలా కధల ద్వారా శిఖండి ఆడా ఉభయ లింగం అని తెలుస్తుంది.

బృహన్నల
తనని తిరస్కరించాడన్న కోపం తో ఊర్వశి అర్జునుడిని ఒక సంవత్సరం స్త్రీగా మారతాడని శపిస్తుంది.కానీ ఈ శాపం అజ్ఞాతవాసం ఆఖరి సంవత్సరం లో విరాట మహారాజు కొలువులో బృహన్నల అనే స్త్రీలా ఉండటానికి ఒక వరం లా పనికొచ్చింది.కానీ కొంతమంది ఆ శాపం వల్ల అర్జునుడు స్త్రీగా కాకుండా నపుంసకుడిగా మారాడని కూడా అంటారు.

సుద్యుమ్న/ఇల
పరమశివుడి తోట లోకి అనుమతి లేకుండా పొరపాటున ప్రవేశించడం వల్ల తన జీవితం లో సగ భాగం స్త్రీగా మారతాడని మగవాడిగా పుట్టిన సుద్యుమ్నుడికి శాపం వచ్చింది.అతను ప్రతీ నెలా తన తత్వాన్ని(లింగాన్ని) మార్చుకుంటుండేవాడు. అతని స్త్రీ స్వరూపాన్ని "ఇల" గా వ్యవహరిస్తారు. బుధుడు ఈమెతో ప్రేమలో పడటం వల్ల వీళ్ళిద్దరికీ కురు వంశ పితామహుడిగా పేరు గాంచిన పుర్రూరవుడు జన్మిచాడు. తన మగ స్వరూపం ద్వారా సుద్యుమ్నుడికి ముగ్గురు కుమారులు కలిగారు.

స్త్రీ రూపం లో నారదుడు
తాను శ్రీ మహా విష్ణువు కు మహా భక్తుడిననీ తనని భగవంతుని మాయ కూడా ఏమీ చెయ్యలేదనీ నారదుడు గర్వించేవాడు.ఇతని గర్వమణచడానికి నారదుడు స్నానం చేస్తుండగా శ్రీ మహా విష్ణువు నారదుణ్ణి స్త్రీ గా మార్చేసాడు.స్త్రీ గా మారిన నారదుడు తన అసలు స్వరూపాన్ని మరచి ఒక రాజుని వివాహమాడాడు. రాజు గారి వల్ల అనేక మంది సంతానం కూడా కలిగారు.కానీ మహారాజూ అతని పిల్లలందరూ యుద్ధం లో మరణించారు.ఈ శోకం నుండి ఉపశమనం పొందడానికి నీళ్ళల్లో మునిగి శరీరం విడిచిపెడదామనుకుంటుండగా తన నిజ స్వరూపమయిన నారదుడు బయటకొస్తాడు.అప్పుడు మాయ ని తప్పించుకోవడం ఎవ్వరి వల్లా కాదని నారదుడు గ్రహిస్తాడు.

గోపేశ్వరునిగా శివుడు
బ్రుందావనం లో శ్రీ కృష్ణుడు గోపికలతో రాస లీలలో మునిగి ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులకి కూడా అందులో భాగమవ్వాలని కోరిక కలుగుతుంది. స్త్రీ అవడం వల్ల పార్వతి మాత్రమే అనుమతించబడి మహా శివునికి ప్రవేశం నిరాకరించబడుతుంది. దగ్గర లోని మానస సరోవరం లో స్నాన మాచరించడం వల్ల మహా శివుడు కూడా రాస లీలలో పాల్గొనవచ్చని బృందావన దేవత తెలియచేస్తుంది.అలా చేసిన శివుడు స్త్రీ గా మారతాడు. స్త్రీగా మారిన మహా శివుణ్ణి గోపేశ్వర్ అని శ్రీ కృష్ణుడు సంభోదించి బృందావనం లోకి అనుమతిస్తాడు.బృందావనం లోని గోపేశ్వరాలయం లో శివిణ్ణి గోపేశ్వరుడిగా పూజిస్తారు. ఇక్కడ శివుడు స్త్రీగా చీరలో అలంకరించబడి ఉంటాడు.



Click it and Unblock the Notifications











