Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
భక్తులతో నేరుగా మాట్లాడుతున్న దేవుడు.. కోరుకున్న కోరికలు తీరిపోతున్నాయట.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ ఆలయం..
సాధారణంగా ప్రతి ఒక్కరికీ దేవుడంటే అపారమైన భక్తి ఉంటుంది. ప్రతిరోజూ దేవుడిని మొక్కనిదే కొంతమంది బయటికి కూడా వెళ్లరు. దైవ భక్తిలోనే పరవశించిపోతారు. దైవ భక్తి ఎంత ఉంటుందో బాబాలను నమ్మే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి బాబాలను మనం చాలా మందిని చూశాము. సత్యసాయి బాబా కూడా అలానే దేవుడయ్యారు. అలాగే తాను బతికున్న దేవుడినని చెప్పుకుంటున్నారు రాజమాత దేవి. ఆమె ఏది చెబితే అది నిజమైపోతుందట. కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు నమ్ముతున్నారు. ఇంతకీ ఆ రాజమాత దేవి స్టోరీ ఏంటి? ఎక్కడ ఆమె ఉన్నారు అనే విషయాల గురించి చర్చించుకుందాం రండి.
రాజమాత దేవి ఆలయ ఎక్కడుందంటే?
ఈ రాజమాత దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కావలి సమీపంలోని చంద్ర రావూరు గ్రామంలో ఉంది. ఇక్కడ శ్రీ రాజమాత దేవి అనే ఆధ్యాత్మిక గురువు ఉన్నారు. ఆమె తన ఆత్మలోకి దేవుడు వస్తారని, తాను బతికున్న దేవుడినని చెప్పుకుంటున్నారు. మానవాళికి సేవ చేసేందుకే తన జన్మ ఉద్భవించిందని పేర్కొంటుంటారు. ఆధ్యాత్మికతను వ్యాపింపజేసేందుకు, మానవాళికి సేవలు అందించేందుకు తాను కృషి చేస్తానని పేర్కొంటున్నారు.

ఎవరీ రాజమాత దేవి?
శ్రీ రాజమాత దేవిని బండ్లమాంబ దేవి, బండ్లమాంబమ్మ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఆమె ఒక ఆధ్యాత్మిక గురువు. భక్తులకు తన సూచనలు, దీవెనలు ఇస్తూ ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి రోజూ వేల కొద్దీ భక్తులు వస్తుంటారు. సాధారణంగా ఆలయంలోని ప్రాంగణంలో కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంటారు. భక్తులు ఆమెకు అభిషేకాలు, పూజలు చేస్తుంటారు. సత్య సాయి బాబా మాదిరిగా మండల దీక్షలు చేపడతారు. అలాగే ప్రతిరోజూ భక్తులకు దర్శనమిస్తూ రాజమాత దేవి పూజలు అందుకుంటారు.
రాజమాత దేవి విశేషాలు
శ్రీ రాజమాత దేవికి విశేషమైన శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతుంటారు. ఆమె దీవెనలు ఉంటే కచ్చితంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. రాజమాత దేవిని దర్శించుకుంటే సమస్యలన్నీ తొలిగిపోతాయని, సుఖ సంతోషాలు నెలకొంటాయని చెబుతున్నారు. ఏదైనా సమస్యలతో ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు.. దేవినే సమస్యను గుర్తించి ఆ సమస్య ఉన్న వ్యక్తిని పిలిచి, ఆ సమస్యకు పరిష్కారం చెబుతారని, భక్తులు సమస్యల్లో ఉన్నట్లు తెలిస్తే తన శక్తులు, దివ్య దృష్టితో కచ్చితంగా పరిష్కార మార్గం చూపుతారని నమ్ముతున్నారు.
ఏదైనా కోరికలు కోరుకొని అవి నెరవేరాలంటే శ్రీరాజమాత అభిషేకం చేస్తే చాలని, కోరికలు నెరవేరిపోతాయని చెబుతున్నారు. రాజమాత దేవి ప్రతిరోజూ దర్శనం కోసం అందుబాటులో ఉంటారట. ఆమె ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం కూడా చేస్తున్నారు. ఎవరైనా అన్నదానం చేయాలనుకునే వ్యక్తులు కూడా అన్నదానం చేయవచ్చు. మీకు కూడా దేవుళ్లపై ఆధ్యాత్మిక గురువులపై నమ్మకం ఉంటే ఓసారి ఈ ఆలయాన్ని సందర్శించండి.



Click it and Unblock the Notifications